శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 508 / Sri Lalitha Chaitanya Vijnanam - 508


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 508 / Sri Lalitha Chaitanya Vijnanam - 508 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 104. స్వాధిష్ఠానాంబుజగతా, చతుర్వక్త్ర మనోహరా ।
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104 ॥ 🍀

🌻 508. 'అతిగర్వితా' 🌻

సౌందర్యాదుల వలన, ఆనందానుభూతి వలన గర్వించి యున్నట్లుగ స్వాధిష్ఠాన మందలి శ్రీమాత గోచరించును. ఆమె చైతన్య ప్రీతయై మేధస్సున నుండి శివతత్త్వముతో అనుసంధానము చెంది యుండుట వలన యినుమడించిన అందము గలదై గర్వముగ నుండును. ఈ స్థితియందు గర్వమనగా పరితృప్తి. పరితృప్తి కలిగిన వారి చూపులయందు, హావభావముల యందు ఆ తృప్తి ప్రకటము కాగ చూచువారికి గర్వముగ నున్నది అనిపించును. తృప్తి వలన యేర్పడు చూపులకు మాటలకు, గర్వము వలన యేర్పడు చూపులకు మాటలకు సున్నితమగు వ్యత్యాస మున్నది. పరితృప్తులు అసూయ గలవారికి గర్వముగ గోచరింతురు. కారణము వారి అసూయయే గాని ఎదుటివారి గర్వము కాదు. గర్వము లేనివారే గర్వము లేనివారిని గమనింప గలరు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 508 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻104. Svadhishtananbujagata chaturvaktra manohara
shuladyayudha sanpanna pitavarna tigarvita ॥ 104 ॥ 🌻


🌻 508. 'Athigarvita' 🌻

Sri Mata in Swadhishthana Mandali, appears proud because of her beauty and sense of bliss. She is beautiful and proud because of her love of Chaitanya and her wisdom connected with Siva Tattva. In this state pride is in fact contentment. For those in contentment, it reflects as pride in the expressions and gestures to the beholders. There is a subtle difference between looks and words because of contentment, and looks and words because of pride. Those who are content appear proud to the envious. The reason is their jealousy and not the other's pride. Only those who are not proud can observe those who are not proud.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹




No comments:

Post a Comment