శ్రీ శివ మహా పురాణము - 824 / Sri Siva Maha Purana - 824
🌹 . శ్రీ శివ మహా పురాణము - 824 / Sri Siva Maha Purana - 824 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 26 🌴
🌻. విష్ణువు యొక్క మోహమును తొలగించుట - 6 🌻
దేవీమూర్తులు ఇట్లు పలికిరి - ఈ బీజములను విష్ణువు ఉన్న స్థానమునందు నాటుడు. అట్లు చేయుట వలన మీ పని సిద్ధించగలదు (42).
సనత్కుమారుడిట్లు పలికెను - ఓ మునీ! బ్రహ్మ విష్ణురుద్రుల శక్తులు, త్రిగుణస్వరూపులు అగు ఆ దేవీమూర్తులు ఇట్లు పలికి పిదప అంతర్ధానమును చెందిరి (43). అపుడు బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలందరు సంతసిల్లి ఆ బీజములను శ్రద్ధగా స్వీకరించి విష్ణువు ఉన్న స్థానమునకు వెళ్లిరి (44). ఆ దేవతలు వాటిని బృందాదేవియొక్క చితభూమియందు నాటిరి. ఓ మునీ! వారు శివుని శక్తియొక్క అంశలగు ఆ దేవీమూర్తులను స్మరిస్తూ అచట నిలబడియుండిరి (45). ఓ మహర్షీ! నాటిన బీజములనుండి ధాత్రి, మల్లె మరియు తులసి అను మూడు మొక్కలు ఉద్భవించెను (46). సరస్వతినుండి ధాత్రి, లక్ష్మీదేవి నుండి మల్లె, మరియు గౌరీదేవి నుండి తులసి తమస్సత్త్వరజో గుణరూపములై పుట్టినవి (47). ఓ మునీ! స్త్రీ రూపములో నున్న ఆ మొక్కలను చూడగానే విష్ణువు మోహముచే వాటియందు అతిశయించిన రాగము గలవాడై లేచి నిలబడెను (48). ఆతడు మోహమువలన కామనతో మిక్కిలి రాగయుక్తమైన మనస్సుతో వారిపై ఇచ్ఛను కలిగియుండెను. తులసి మరియు ధాత్రి కూడా ఆతనిని ప్రేమతో చూచిరి (49).
పూర్వము ఏ బీజము లక్ష్మీదేవి యొక్క శక్తిచే సమర్పింపబడినదో, దాని నుండి ఉద్భవించిన యువతి ఆ కారణముచేతనే ఆతనియందు ఈర్ష్య గలది ఆయెను (50). కావుననే మల్లె మిక్కిలి నిందించదగిన 'బర్బరి' అను పేరును గాంచెను. ధాత్రి మరియు తులసి మొక్కలు విష్ణువునందు ప్రేమను చూపుటచే ఆయనకు సర్వదా ప్రీతిపాత్రములాయెను (51). అపుడు ఆ విష్ణువు తన దుఃఖమును విస్మరించి వారిద్దరితో గూడి దేవతలందరు నమస్కరించుచుండగా సంతోషముతో వైకుంఠమును చేరెను (52).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 824 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 26 🌴
🌻 The Vanishing of Viṣṇu’s delusion - 6 🌻
The goddesses said:—
42. “Sow these seeds in the place where Viṣṇu is standing. Then your task will be fulfilled.”
Sanatkumāra said:—
43. O sage, after saying this, the goddesses, the Śaktis of Śiva, Viṣṇu and Brahmā, possessed of the three attributes, vanished.
44. Then Brahmā and other gods including Indra took the seeds and went to the place where Viṣṇu was standing.
45. The gods sowed those seeds in the ground where the pyre of Vṛndā had been lit. O sage, they stayed there thinking these as parts of Śiva’s Śakti.
46. Out of the seeds sown, O great sage, three plants shot up—the Myrobalan, the Jasmine and the holy basil.
47. The Myrobalan is born of the creator’s Śakti, the jasmine of Lakṣmī and holy basil of Gaurī, born of the attributes Tamas, Sattva and Rajas.
48. O sage, on seeing the plants in the forms of ladies Viṣṇu stood up with excitement of infatuation over them.
49. On seeing them he was deluded and his mind became overwhelmed by lust. The two plants—the holy basil and Myrobalan looked at him lovingly.
50. The womanlike plant born out of the seed by the Śakti of Lakṣmī became jealous of him.
51. Hence the plant came to be called Varvarī[2] (a kind of wild basil) and was despised by all. The Dhātrī and the Tulasī are always pleasing to him due to their love and affection.
52. Then Viṣṇu forgot his sorrow. Accompanied by them he went to Vaikuṇṭha fully satisfied. He was bowed to by all the gods.
Continues....
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment