🌹 . శ్రీ శివ మహా పురాణము - 830 / Sri Siva Maha Purana - 830 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 28 🌴
🌻. శంఖచూడుని వివాహము - 1 🌻
సనత్కుమారుడిట్లు పలికెను- అపుడా శంఖచూడుడు జైగీషవ్యమహర్షి ఉపదేశమును పొంది పుష్కరక్షేత్రమునందు చిరకాలము బ్రహ్మను ఉద్దేశించి పరమప్రీతితో తపస్సును చేసెను (1). ఆతడు ఇంద్రియములను నిగ్రహించి మనస్సును ఏకాగ్రము చేసి గురువుచే ఉపదేశింప బడిన బ్రహ్మ మంత్రమును జపించెను (2). లోకములకు తండ్రి, సర్వసమర్థుడు నగు బ్రహ్మ వెంటనే పుష్కరములో తపస్సు చేయుచున్న ఆ శంఖచూడాసురునకు వరము నిచ్చుటకై అచటకు వెళ్లెను (3). అపుడు బ్రహ్మ ఆ రాక్షసవీరునితో 'వరమును కోరుకొనుము' అని పలికెను. ఆతడు బ్రహ్మను గాంచి మిక్కిలి వినయముతో ప్రణమిల్లి పవిత్రమగు వచనములతో స్తుతించెను (4).
దేవతలచే జయింపబడకుండుట అను వరమును ఆతడు బ్రహ్మనుండి కోరగా, ఆయన మిక్కిలి ప్రసన్నమగు మనస్సుతో తథాస్తు అనెను (5). జగత్తులోని సర్వమంగళవస్తువులకంటే మంగళప్రదమైనది, సర్వదేశములలో మరియు సర్వకాలములలో విజయము నొసంగునది, దివ్యమైనది అగు శ్రీకృష్ణకవచమును ఆయన శంఖచూడునకు ఇచ్చెను (6). నీవు బదరికి వెళ్లి అచట తులసిని వివాహమాడుము. ఆమె అచటనే తన కోరికననుసరించి తపస్సును చేయుచున్నది (7).
'ఆమె ధర్మధ్వజుని కుమార్తె' అని బ్రహ్మ ఆతనికి బోధించి ఆతడు చూచు చుండగా వెంటనే అదృశ్యడాయెను (8). పుష్కరములో తపస్సును చేసి గొప్ప సిద్ధిని పొందియున్న ఆ శంఖచూడుడు అపుడు జగత్తు మంగళములకు కూడ మంగళమైన కవచమును మెడలో కట్టుకొనెను (9).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 830 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 28 🌴
🌻 The penance and marriage of Śaṅkhacūḍa - 1 🌻
Sanatkumāra said: —
1. As instructed by Jaigīṣavya, Śaṅkhacūḍa performed a penance in Puṣkara for a long time in order to propitiate Brahmā with devotion.
2. He concentrated his mind, controlled the senses and organs of activities, and muttered the mantra of Brahmā imparted by his preceptor.
3. Lord Brahmā, the preceptor of the worlds, went to Śaṅkhacūḍa who was practising penance at Puṣkara in order to grant him the boon soon.
4. Brahmā said to him: “Tell me the boon you wish to choose.” On seeing Brahmā, the king of Dānavas bowed to him humbly and eulogised him with words of devotion.
5. He requested Brahmā to grant him the power of being invincible to the gods. With a delighted mind, Brahmā said “Be it so.”
6. He gave Śaṅkhacūḍa the divine amulet of Śrīkṛṣṇa the most auspicious of all auspicious things in the universe, that yielded victory everywhere.
7. “You now go to Badari. There you marry Tulasī who is performing penance just at her own will.
8. She is the daughter of Dharmadhvaja.” Brahmā instructed him thus and vanished even as he was watching him.
9. Then Śaṅkhacūḍa whose penance had been fruitful in the holy centre of Puṣkara tied the most auspicious amulet round his neck.
Continues....
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment