నిత్య ప్రజ్ఞా సందేశములు - 193 : 11. మనస్సు ఇంద్రియ-అనుభవానికి బానిసైంది / DAILY WISDOM - 193 : 11. The Mind is Addicted to Sense-experience




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 193 / DAILY WISDOM - 193 🌹

🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 11. మనస్సు ఇంద్రియ-అనుభవానికి బానిసైంది 🌻


మనలో నాటబడిన ఈ ఆత్మ పరమాత్మతో ఐక్యతని కోరుకుంటుంది. అది దాని క్లిష్టమైన క్షణం. ఇది మనం సాగరాన్ని ఆలింగనం చేసుకోబోతున్నట్లుగా ఉంటుంది. ఈ అనుభవాన్ని అనేక విధాలుగా వర్ణించారు. దీనినే అగ్నిలో కలపడం అన్నారు, అడవి ఏనుగును పట్టు దారాలతో కట్టడం అన్నారు, అగ్నిని మింగడం మొదలైన వాటిగా వర్ణించారు. మనస్సు యొక్క విచిత్రమైన స్వభావం కారణంగా ఒక సమస్య తలెత్తుతుంది. ఇంద్రియ అనుభవానికి మనస్సు వ్యసనమైంది. ఇది వస్తువుల ఆనందానికి అలవాటు పడింది, మరియు అది ఇప్పుడు వస్తుమయ ప్రపంచం కంటే పైకి ఎదగడానికి ప్రయత్నిస్తోంది. గొప్ప గురువులు అస్పర్శ యోగం అని పిలిచే ఆ యోగ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది.

ఇది వేరొక దానితో కలయిక కాదు; అది మరొక బంధం అవుతుంది. ఇది అపరిచయం యొక్క పరిచయం. ఇది ఆత్మ యొక్క దుఃఖం కారణంగా అనుభూతిలోకి తెచ్చుకోవడం కష్టం. ఈ ఆత్మ దుఃఖం అనేది మానసిక దుఃఖం కంటే లోతైనది. దీనిని మహాత్ములు సైతం అనుభూతి చెందారు. మనం లోతుగా వెళ్ళే కొద్దీ, సూక్ష్మ శరీరాల సునిశిత తత్వం వల్ల భౌతిక శరీరం కంటే అనుభూతి లోతుగా, గాఢంగా ఉంటుంది. అంటే మనకి స్థూల శరీరానికి దెబ్బ తగలడం కంటే, మానసిక అవేదన భరించడానికి కష్టంగా ఉంటుందని తెలుసు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 193 🌹

🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 11. The Mind is Addicted to Sense-experience 🌻


This spirit that is implanted in us suffers for union with the spirit outside, the Absolute. There is its critical moment. It is as if we were going to embrace the ocean. This experience has been compared in many ways to merging into fire, tying a wild elephant with silken threads, swallowing fire, etc. The problem arises on account of the peculiar nature of the mind. The mind is addicted to sense experience. It is accustomed to the enjoyment of objects, and it is now attempting to rise above all contacts and reach the state of that yoga which great masters have called asparsha yoga—the yoga of non-contact.

It is not a union of something with something else; that would be another contact. It is a contact of no contact. It is difficult to encounter because of a sorrow of the spirit, deeper than the sorrow of the feelings, which even a saintly genius has to experience. The deeper we go, the greater is our sorrow, because the subtle layers of our personality are more sensitive to experience than our outer, grosser vestures. We know very well that the suffering of the mind is more agonising than the suffering of the body. We may bear a little sorrow of the body, but we cannot bear sorrow of the mind—that is more intolerable.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment