శ్రీమద్భగవద్గీత - 481: 12వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 481: Chap. 12, Ver. 12

 

🌹. శ్రీమద్భగవద్గీత - 481 / Bhagavad-Gita - 481 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -12 🌴

12. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్జ్ఞానద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్కర్మఫల త్యాగాస్త్యాగాచ్చా న్తిరనన్తరమ్ ||

🌷. తాత్పర్యం : ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞానసముపార్జనమునందు నియుక్తుడవగుము. అయినప్పటికిని జ్ఞానముకన్నను ధ్యానము మేలైనది. కాని త్యాగము వలన మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుటచే సర్వకర్మఫల త్యాగము ఆ ధ్యానము కన్నను మేలితరమైనది.

🌷. భాష్యము : కడచిన శ్లోకములందు తెలుపబడినట్లు భక్తియుతసేవ రెండువిధములు. విధిపూర్వక నియమములు కలిగిన మార్గము ఒకటి కాగా, దేవదేవుని యెడ పూర్ణానురాగము కలిగిన మార్గము వేరొకటి. కృష్ణభక్తిభావన యందలి విధినియమములను వాస్తవముగా పాటింప జాలని వారు జ్ఞానసముపార్జన చేయుట ఉత్తమము. ఏలయన అట్టి జ్ఞానసముపార్జన ద్వారా మనుజుడు తన నిజస్థితిని అవగాహన చేసికొనగలడు. అట్టి జ్ఞానమును క్రమముగా ధ్యానముగా వృద్ధినొందగలదు. ధ్యానము ద్వారా మనుజుడు క్రమానుగతిని భగవానుని అవగతము చేసికొనగలుగును.

ఆత్మయే బ్రహ్మమును ఎరుకను కలిగించు కొన్ని విధానములు కలవు. భక్తియుక్తసేవలో నియుక్తుడగుటకు సమర్థుడు కానివానికి అటువంటి ధ్యానము ఉత్తమమైనది. ఒకవేళ మనుజుడు ఆ విధముగా ధ్యానము చేయలేనిచో వేదములందు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు విధింపబడిన విధ్యుక్తధర్మములను పాటింప వచ్చును. అట్టి వివిధవర్ణముల ధర్మములు భగవద్గీత యందలి అష్టాదశాధ్యాయమున వివరింప బడినవి. కాని ఈ అన్నిమార్గములందును మనుజుడు తన కర్మఫలమును త్యాగము చేయవలసి యున్నది. అనగా కర్మఫలమును ఏదియోనొక మంచి ప్రయోజనముకై వినియోగింప వలసి యుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 481 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 12 🌴

12. śreyo hi jñānam abhyāsāj jñānād dhyānaṁ viśiṣyate
dhyānāt karma-phala-tyāgas tyāgāc chāntir anantaram

🌷 Translation : If you cannot take to this practice, then engage yourself in the cultivation of knowledge. Better than knowledge, however, is meditation, and better than meditation is renunciation of the fruits of action, for by such renunciation one can attain peace of mind.

🌹 Purport : If you cannot take to this practice, then engage yourself in the cultivation of knowledge. Better than knowledge, however, is meditation, and better than meditation is renunciation of the fruits of action, for by such renunciation one can attain peace of mind. As mentioned in the previous verses, there are two kinds of devotional service: the way of regulative principles and the way of full attachment in love to the Supreme Personality of Godhead. For those who are actually not able to follow the principles of Kṛṣṇa consciousness it is better to cultivate knowledge, because by knowledge one can be able to understand his real position. Gradually knowledge will develop to the point of meditation. By meditation one can be able to understand the Supreme Personality of Godhead by a gradual process.

In the cultivation of knowledge there are processes which make one understand that one himself is the Supreme, and that sort of meditation is preferred if one is unable to engage in devotional service. If one is not able to meditate in such a way, then there are prescribed duties, as enjoined in the Vedic literature, for the brāhmaṇas, kṣatriyas, vaiśyas and śūdras, which we shall find in the last chapter of Bhagavad-gītā. But in all cases, one should give up the result or fruits of labor; this means to employ the result of karma for some good cause. In summary, to reach the Supreme Personality of Godhead, the highest goal, there are two processes: one process is by gradual development, and the other process is direct.

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment