శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 6


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 6 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥

108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀

🌻 521 to 528 నామ వివరణము - 6 🌻


శ్రీ మాత చైతన్యమే అంతటా అన్నిటా, వ్యాపించి యుండును. సృష్టిదారులు అన్నిటి యందు ఆమె వ్యాపించి యున్నది. అన్ని నాళములు, అన్ని నరములు శ్రీమాత చైతన్యముతోనే నిండియున్నది. ఆజ్ఞ నుండి మూలధారము వరకు గల నాళమునందు, ఈ నాళమునందు వికసించిన వివిధ పద్మము లందు, ఆ పద్మముల నుండి వ్యాప్తిచెందు నరముల యందు, నాళములందు శ్రీమాత స్థితికొని యుండుట వలన 'మజ్జా' సంస్థా' అని కీర్తింపబడుచున్నది. సృష్టి యందంతయూ ఈమెయే యింకి యున్నదని తెలియనగును. స్వర్గము, నరకము, పాతాళము అన్నిటి యందు వ్యాప్తిచెంది వాటికి ఆధారమై నిలచు సర్వవ్యాపిని తత్వమును 'మజ్ఞ్యాసంస్థ' అను నామముతో యిచ్చట కీర్తించుట జరిగినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 6 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥

108. Majasansdha hansavati mukhyashakti samanvita
haridranai karasika hakinirupa dharini ॥ 108 ॥ 🌻

🌻 521 to 528 Names Explanation - 6 🌻


Sri Mata consciousness is all-pervasive. She pervades across all creators. All vessels, all nerves are filled with Srimata consciousness. In the vessel from Ajna to Muladhara, in the various lotuses that blossom in this vessel, in the veins spreading from those lotuses, as Sri Mata resides in three vessels she is glorified as 'Majja Sanstha'. She is embedded in the entire creation. She is glorified by the name of 'Majja samstha' who is the basis of the all-pervasive philosophy that spreads in heaven, hell and underworld.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment