శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 529 / Sri Lalitha Chaitanya Vijnanam - 529


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 529 / Sri Lalitha Chaitanya Vijnanam - 529 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀

🌻 529. 'సహస్రదళ పద్మస్థా' 🌻


వేయి దళముల పద్మమునందు వసించి యుండు శ్రీమాత. సహస్రదళ పద్మము శివశక్తుల సమాగమ స్థానము. వేయి దళములు వేయి సూర్యులతో సమానమగు ప్రకాశము కలిగి యుండును. సహస్ర అను శబ్దమే సర్వశక్తియుతము, సర్వతేజోమయము. ప్రకృతి పురుషుల సమాగమ ప్రజ్ఞ పరిపూర్ణముగ వికాసము చెందు స్థానము. 'సహ' అను శబ్దమునకు పురుష ప్రకృతులని ముందు తెలుపబడినది. వాని సమాగమ స్థితియే సహస్రము. సమస్తమగు శబ్దము లిచ్చట నుండియే పుట్టును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 529 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita
sarvayudha dhara shukla sansdhita sarvatomukhi ॥109 ॥ 🌻

🌻 529. 'Sahasradala Padmastha' 🌻


Shrimata resides in the lotus of a thousand petals. The thousand petaled lotus is the confluence of Shiva and Shakti. The thousand petals will be as bright as a thousand suns. The sound Sahasra is all-powerful and luminous. A place where the union of nature and man can develop to perfection. The word 'saha' has been denoted as purusha and prakruti. The status of their union is Sahasra. All sounds originate here


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment