✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 29 🌴
🌻. శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతము - 4 🌻
ఓ మునీ! వత్సా! అపుడు పరాజయమును పొంది రాజ్యభ్రష్టులై యున్న దేవతాగణములందరు ఋషులతో కలిసి సంప్రదించి బ్రహ్మను దర్శించి ప్రణమిల్లి విశేషముగా స్తుతించి వృత్తాంతమునంతనూ ఆయనకు విన్నవించిరి (31, 33). అపుడు బ్రహ్మ దేవతలను, మునులను అందరినీ ఓదార్చి వారిని వెంటనిడుకొని లోకమునందలి సత్పురుషులకు సుఖమునొసంగు వైకుంఠమునకు వెళ్లెను (34). బ్రహ్మ దేవతాగణములతో గూడి అచట కిరీట కుండల వనమాలలతో అలంకరింపబడిన వాడు, శంఖచక్ర గదా పద్మములను ధరించిన వాడు, ప్రకాశస్వరూపుడు, నాల్గు భుజములు గలవాడు, సనందనాది సిద్ధులచే సేవింపబడువాడు, పచ్చని వస్త్రమను ధరించువాడు లక్ష్మీపతి (35, 36). అగు విష్ణువును గాంచెను. అపుడు బ్రహ్మాది సర్వదేవతలు, మునీశ్వరులతో గూడి సర్వేశ్వరుడగు విష్ణువును గాంచి ప్రణమిల్లి చేతులు జోడించి భక్తితో స్తుతించిరి (37).
దేవతలిట్లు పలికిరి - ఓ దేవదేవా! జగన్నాథా! వైకుంఠాధిపతీ! ప్రభూ! శ్రీహరీ! తరిభువనములకు తండ్రీ శరణు జొచ్చిన మమ్ములను రక్షింపుము (38). ఓ అచ్యుతప్రభూ! వక్షస్థ్సలమునందు లక్ష్మి గలవాడా! ఓ త్రిలోకాధిపతీ! జగత్తులను రక్షించువాడవు నీవే. ఓ గోవిందా! భక్తప్రియా! నీకు నమస్కారము (39). దేవతలందరు ఇట్లు స్తుతించి విష్ణువు యెదుట ఏడ్చిరి. విష్ణుభగవానుడు అది విని బ్రహ్మతో ఇట్లు పలికెను (40).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 838 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 29 🌴
🌻 The previous birth of Śaṅkhacūḍa - 4 🌻
31. O sage, although he was a Danava, his nature was different. He was born as a Danava due to a previous curse.
32. O dear, thereafter, the defeated gods, deprived of their kingdom, consulted among themselves and went to Brahma’s assembly chamber along with the sages.
33. They saw the creator and bowed to and eulogised him. With distress they explained to him everything in detail.
34. After consoling the gods and the sages, Brahmā accompanied by them went to Vaikuṇṭḥa that yields happiness to the good.
35. Accompanied by the gods, Brahmā saw the lord of Lakṣmī decorated with a crown, earrings and a garland of wild flowers.
36-37. On seeing Viṣṇu bearing Śaṅkha, Cakra, mace and the lotus, the lord with four arms, yellow garments, accompanied by Nandana, Siddhas, Brahmā and other gods bowed to the lord along with the great sages. They eulogised him with palms joined in reverence.
The gods said:—
38. “O lord of the universe, lord of the gods, O lord of Vaikuṇṭha, save us who have sought refuge in you, O illustrious Viṣṇu, O elderly one in the three worlds.
39. O lord Viṣṇu, O lord of the three worlds, you alone are the protector of the worlds. O supporter of Lakṣmī, O Govinda, O the vital air of the devotees, Obeisance be to you.”
40. After eulogising thus, all the gods cried in front of Viṣṇu. On hearing it lord Viṣṇu spoke to Brahmā thus.
Continues....
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment