శ్రీ శివ మహా పురాణము - 848 / Sri Siva Maha Purana - 848


🌹 . శ్రీ శివ మహా పురాణము - 848 / Sri Siva Maha Purana - 848 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 31 🌴

🌻.బ్రహ్మవిష్ణువులకు శివుని ఉపదేశము - 3 🌻


సనత్కుమారుడిట్లు పలికెను- శివుడు ఈ తీరున బ్రహ్మ విష్ణువుల యెదుట వృత్తాంతమును చెప్పుచుండగనే, అచట మరియొక ఘటన జరిగినది. ఓ మునీ! దానిని వినుము (18). ఇదే సమయములో శ్రీకృష్ణుడు రాధతో మరియు మంచి గోపాలకులైన అనుచరులతో గూడి శంభుప్రభుని ప్రసన్నునిగా చేయుట కొరకై విచ్చేసెను (19). ఆతడు మంచి భక్తితో ప్రభునకు ప్రణమిల్లి, హరిని ఆదరముతో కలుసుకొని, విధిచే ప్రీతిపూర్వకముగా ఆదరింపబడిన వాడై, శివుని యాజ్ఞచే నిలబడి యుండెను (20). తొలగిన మోహము గల శ్రీకృష్ణుడు శివుని తత్త్వము నెరింగి, అపుడు చేతులు జోడించి మరల శంభునకు నమస్కరించి ఇట్లు స్తుతించెను (21).

శ్రీకృష్ణుడిట్లు పలికెను- ఓ దేవదేవా! మహాదేవా! సత్పురుషులకు గతియైన వాడా! నా అపరాధమును క్షమించుము. ఓ పరమేశ్వరా! ప్రసన్నుడవు కమ్ము (22). ఓ శర్వా! సర్వము నీనుండి పుట్టుచున్నది. ఓ మహేశ్వరా! సర్వము నీయందు ఉన్నది. ఓ నిఖిలాధీశ్వరా! సర్వము నీవే. ఓ పరమేశ్వరా! ప్రసన్నుడవు కమ్ము (23). నీవు సాక్షాత్తుగా పరమజ్యోతిస్స్వరూపుడవు. సనాతనుడవగు నీవు సర్వవ్యాపివి. ఓ గౌరీపతి! నాథుడవగు నీ చేత మాత్రమే మేము అందరము సనాథులమగు చున్నాము (24). నేనే సర్వమునకు ఆధీశ్వరుడననే మోహమును పొంది విహరిస్తూ దాని ఫలమును పొంది యుంటిని. తప్పుదారిలో నడచిన వాడు శాపమును పొందినాడు (25).

ఓ స్వామీ! నా అనుచరులలో ప్రముఖుడు, గోపాలకుడు అగు సుదాముడు రాధయొక్క శాపముచే దానవుడై జన్మించినాడు (26). ఓ దుర్గాపతీ! మమ్ములను ఉద్ధరించుము. శరణు జొచ్చిన మమ్ములను రక్షింపుము (27). రాధా సమేతుడైన శ్రీకృష్ణుడిట్లు పలికి విరమించెను. అపుడు శరణాగత వత్సలుడగు శివుడు ప్రసన్నుడాయెను (28).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 848 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 31 🌴

🌻 Śiva’s advice to Viṣṇu and Brahmā - 3 🌻



Sanatkumāra said:—

18. O sage, by the time Śiva completed this expatiation in front of Viṣṇu and Brahmā, another event happened there. Listen to it.

19. In the meantime Kṛṣṇa came there along with Rādhā and his attendant cowherds in order to propitiate Lord Śiva.

20. Devoutly bowing to the lord, meeting Viṣṇu with respect and honoured by Brahmā with love he stood there awaiting Śiva’s behest.

21. Then he bowed again to Śiva with palms joined in reverence. Realising the principle of śiva and getting rid of his delusion Kṛṣṇa eulogised Śiva.



Lord Kṛṣṇa said:—

22. O supreme God, lord of gods, Supreme Brahman and the goal of the good, forgive me my guilt. O supreme god, be pleased.

23. O Śiva, everything originates from you. O supreme lord, everything merges in you. O lord of all, you are everything. O supreme lord, be pleased.

24. You are the greatest splendour. You are the eternal being directly pervading everything. O lord of Gaurī, with you as leader, we are well-guided.

25-26. Considering myself above all, I sported about, under the delusion. I reaped the fruit thereof. He who went astray was cursed. O lord, my leading comrade Sudāmā the cowherd is born as a Dānava.

27. O lord of Pārvatī, uplift us. O supreme lord, be pleased. Please redeem us from the curse. Save us who have sought refuge in you.

28. After saying this, Lord Kṛṣṇa, accompanied by Rādhā, stopped. Śiva was delighted thereat, Śiva who is favourably disposed to those who seek refuge in him.


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment