శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 536 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 536 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 536 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 536 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।
స్వాహా, స్వధా,ఽమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀
🌻 536. 'స్వాహా స్వధా' - 2 🌻
స్వాహా అనగా స్వర్గానుభూతి అనియు, ఆత్మానుభూతి అనియు అర్థము. 'స్వ' అనగా ఆత్మ. 'హా' అనగా ఉచ్చారణము. ఆత్మ నుండి సంకల్ప రూపముగ దిగివచ్చునది స్వాహాదేవి అని మరియొక అర్థము. అగ్నితత్త్వమైన శివునకు అగ్ని రూపమగు దేవి స్వధా అని లింగ పురాణమందు, స్వాహా అని అగ్ని పురాణమందు తెలిపియున్నారు. కావున స్వాహా అన్నను స్వధా అన్ననూ ఒకే శ్రీమాత తత్త్వమునకు గల రెండు నామములుగ తెలియవలెను. వీరి కుమారుడే షణ్ముఖుడగు స్కంధుడు. పద్మ పురాణమందు, మహేశ్వర పురమునకు అధిష్టాత్రి అగు శ్రీమాత స్వాహాదేవి అని తెలుపబడెను. ఈమెనే మహేశ్వరి అని అందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 536 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini
svahasvadha mati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻
🌻 536. 'Swaha Swadha' - 2 🌻
Swaha means feeling of heaven and feeling of self. 'Swa' means soul. 'Ha' means pronunciation. Another meaning is Swaha Devi who can descend into the form of will from the soul. In Linga Purana, the devi in the form of fire to the Siva in the spirit of fire is called Swadha devi and she is called Swaha devi in Agni purana. Therefore Swaha and Swadha should be known as two names of the same spirit of Srimata. Skanda who is Shanmukha is their son. In the Padma Purana, it is stated that the Goddess of Maheswara Puram is Srimata Swahadevi. She is called Maheshwari.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment