🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 108 / Osho Daily Meditations - 108 🌹
✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 108. గజిబిజి తల 🍀
🕉 లావోట్జు ఇలా అంటాడు: నేను అయోమయం మనిషిని. అందరూ స్పష్టంగా ఉన్నప్పుడు, నేను మాత్రమే అస్పష్టంగా ఉంటాను; అందరూ మేధావులుగా అనిపించినప్పుడు, నేను మూర్ఖుడిని. 🕉
లావోట్జు ఉద్దేశ్యం ఏమిటంటే, అతను తన జీవితం గురించి లెక్కలెయ్యడు. జీవిస్తాడు. ఏ జంతువులాగానో, ఏ చెట్టులాగానో, ఏ పక్షిలాగానో జీవిస్తాడు. అతను అది ఏమిటో మరియు ఎక్కడికి దారితీస్తుందో అని లెక్కలెయ్యకుండా సరళంగా జీవిస్తాడు. ఎక్కడైనా మంచిదే; ఎక్కడా కాకపోయినా మంచిదే. నీ మనసును పక్కన పెట్టు. ఇది కష్టం, కానీ సాధ్యమే. ఆధునిక మనస్సుకు ఇది కీలకమైన సమస్యలలో ఒకటి - తెలివిని పక్కన పెట్టడం. మీరు కొంచెం విశృంఖలంగా ఉండాలి. అది మీకు గొప్ప అమాయకత్వాన్ని తెస్తుంది; అది మిమ్మల్ని గొప్ప ప్రేమలోకి దూకడానికి సిద్ధం చేస్తుంది.
ఇది ప్రత్యేకంగా ఎవరి మీదా ఉండవలసిన అవసరం లేదు, కేవలం జీవితం పట్ల, ఉనికి పట్ల లేదా ఒక మనిషి పట్లా ఉద్వేగభరితమైన ప్రేమగా ఉండాలి. ఇది చిత్రలేఖనం, కవిత్వం, నృత్యం, సంగీతం, నాటకం, ఏదైనా కావచ్చు--కానీ మీ జీవితమంతా గొప్ప, ఉద్వేగభరితమైన ప్రేమగా మారుతుంది, దీనిలో మీరు ఏమీ మిగలకుండా పూర్తిగా నిమగ్నమైపోతారు: కాబట్టి మీరూ మీ ప్రేమ ఒకటి అవుతుంది. అది మీకు పరివర్తన అవుతుంది. భయం ఉంది, కానీ భయాన్ని ఎంచుకోవద్దు. భయాన్ని ఎంచుకునే వారు తమను తాము నాశనం చేసుకుంటారు. భయం ఉండనివ్వండి; అయినప్పటికీ, ప్రేమలోకి వెళ్లండి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 108 🌹
📚. Prasad Bharadwaj
🍀 108. MUDDLE-HEADED 🍀
🕉 Lao Tzu says: I am a muddle-headed man. When everybody is clear, only I am unclear; when everybody seems to be intelligent, I am stupid. 🕉
What Lao Tzu means is that he does not calculate about his life--he lives it. He lives like any animal, like any tree, like any bird. He lives it simply, without figuring out what it is and where it is leading. Anywhere is good; even nowhere is good. Put your mind aside. It will be difficult, but it can be done. This is one of the crucial problems for the modern mind--putting cleverness aside. You need to be a little more wild. That will bring great innocence to you; that will make you ready to jump into a great love.
It need not be with anybody in particular, but it should be just a passionate love-for life, for existence, or for any human being. It could be for painting, poetry, dance, music, drama, anything--but a great, passionate love that becomes your whole life, in which you are so totally absorbed that nothing is left outside: so you and your love become one. That will be the transformation for you. Fear is there, but don't choose fear. Those who choose fear destroy themselves. Let the fear be there; in spite of it, go into love.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment