శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 4


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 4 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।
స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀

🌻 539. 'శ్రుతిః' - 4 🌻


తత్త్వమును వివరించ లేమని, దానిని గూర్చి తర్కించ లేమని, దాని నుండి దిగి వచ్చిన వారిని గూర్చి తెలియుట, వివరించుట నుండునని పెద్దలు పలుకుదురు. దాని యందు యిమిడి యుండుట సాధ్యమని అంతకు మించి ఏదియూ సాధ్యము కాదని కూడ తెలుపుదురు. అట్టి అనిర్వచనీయము, అవిజ్ఞేయము, అప్రతర్క్యము, అనామకము, అరూపకము, అయిన తత్త్వమునకు రూప మిచ్చునది శ్రీమాత. అనగా ఆ తత్త్వమే తన రూపముగా గలది శ్రీమాత అని తెలియవలెను. సృష్టి యందు దైవము ఆమెయే. సృష్టికావలి దైవము వెలుగై రూపము ధరించినపుడు శ్రీమాతగ దర్శన మిచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 4 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini
svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻

🌻 539. 'Shrutih' - 4 🌻


Elders say that there is no explanation of philosophy, no reasoning about it, but knowledge and explanation could be given of those who descend from it. They also say that it is possible to be immersed in it and nothing beyond that is possible. Srimata is the personification of such indefinable, unknowable, irrational, anonymous, and abstract. In other words, it should be known Srimata has this tattva itself as her form. She is the God in the universe. The God beyond this creation takes a form of light and reveals as Sri Mata


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment