శుభోదయం అందరికీ...
మీరు మీ గతముని పూర్తిగా వదిలేసినట్లు అయితే.. ఆలోచించoడి ఒక్క క్షణం కోసం.. ఒక మంత్ర దండముతో మీ గతం ను పూర్తిగా పోగొట్టితే ఎవరైనా అప్పుడు మీరు ఎవరు?? మీరు ఎవరి లా ఉంటారు?? అప్పుడు మీరు 'నేను' అని అనగలరా?? గతం మాయం అయితే దానితో పాటు 'నేను' అనేది కూడా మాయం అవుతుంది. మీరు ఉంటారు, కానీ 'నేను' అని మీరు అనలేరు. మీరు అప్పుడు ఒక మౌనము, ఒక చిత్రం వేయని ఖాళీ కాన్వాస్, ఒక ధ్యానము, ఒక ప్రశాంతత.. ఒక నిశబ్దం గా మాత్రమే మిగిలి ఉంటారు కానీ మీలో 'నేను' ఉండదు. ఒక్కసారి ఆలోచించoడి, నెమ్మది నెమ్మదిగా మీ గతం ను ఒక్క నిమిషం కోసం వదిలేసి చూడండి... అప్పుడు అక్కడ ఏమీ మిగిలి ఉండదు. నిజంగా ఏమి ఉండదు. ఆ ఏమీ లేకపోవడమే మీరు.. ఆ ఏమీ లేనిదే మీరు..ఆ శూన్యం మీరు... ఆ నిశబ్దం మీరే.. 'నేను' అనేది గతం లో జీవించడం వల్ల,' నేను' గా గుర్తించబడుతోంది...అంతే కానీ గతం ని మరిచిపోయి వర్ధమానములో జీవించ గలిగితె.. మీరు ఎవరో బోధ పడుతుంది... అదే ప్రతి వారి సారాంశం...
✍️. జ్యోతిర్మయి
No comments:
Post a Comment