శ్రీ శివ మహా పురాణము - 873 / Sri Siva Maha Purana - 873
🌹 . శ్రీ శివ మహా పురాణము - 873 / Sri Siva Maha Purana - 873 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 37 🌴
🌻. స్కందశంఖచూడుల ద్వంద్వయుద్ధము - 1 🌻
సనత్కుమారుడిట్లు పలికెను- అపుడు దేవగణములన్నియు దానవులచే ఓడింపబడి శస్త్రాస్త్రములచే గాయపడిన దేహములు గలవారై భయభీతులై పారిపోయిరి (1). వారు విశ్వేశ్వరుడగు శంకరుని వద్దకు తిరిగి వచ్చి దుఃఖముతో నిండిన వాక్కుతో 'ఓ సర్వేశ్వరా! రక్షింపుము, రక్షింపుము'అని పలుకుతూ శరణుజొచ్చిరి (2). ఆ దేవాదుల పరాజయమును గాంచి భయపూరితములగు వారి మాటలను విని ఆ శంకరుడు గొప్ప క్రోధమును పొందెను (3). ఆయన దేవతలపై దయాదృష్టిని బరపి అభయమునిచ్చి తన తేజస్సుతో తన గణముల బలమును వర్ధిల్ల జేసెను (4). అపుడు మహావీరుడు, శివపుత్రుడు అగు స్కందుడు శివుని ఆజ్ఞను పొంది యుద్ధములో భయములేని వాడై దానవగణములతో పోరు సలిపెను (5). తారకాంతకుడగు ఆ స్కందుడు సింహనాదమును చేసి కోపించినవాడై యుద్ధములో వంద అక్షౌహిణీల సైన్యమును మట్టుబెట్టెను (6). పద్మములవంటి కన్నులు గల కాళి వారి శిరస్సులను దునిమి శీఘ్రమే రక్తమును త్రాగి మాంసమును భక్షించెను (7).
ఆమె అన్నివైపుల నుండి ఆ దానవుల రక్తమును త్రాగుచూ, దేవతలకు దానవులకు కూడ భయమును గొల్పు వివిధరకముల యుద్ధమును చేసెను (8). ఆమె కోటి శ్రేష్ఠమగు ఏనుగులను మరియు కోటి మంది మానవులను ఒకే చేతితో పట్టుకొని అవలీలగా నోటిలో పారవైచుకొనెను (9).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 873 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 37 🌴
🌻 Śaṅkhacūḍa fights with the full contingent of his army - 1 🌻
Sanatkumāra said:—
1. Then the gods were defeated by the Dānavas. Their bodies were wounded by weapons and missiles. Terrified, they took to flight.
2. Returning to Śiva, the lord of the universe, they sought refuge in him. In agitated words they cried “O Lord of all, save, O save us.”
3. On seeing the defeat of the gods and others and on hearing their cries of fear, Śiva was greatly infuriated.
4. He glanced at the gods sympathetically and assured them of his protection. With his brilliance he enhanced the strength of his Gaṇas.
5. Commanded by śiva, the great hero Kārttikeya, son of Śiva fought fearlessly with the hosts of Dānavas in the battle.
6. Shouting angrily and roaring like a hero, the lord, the slayer of Tāraka killed a hundred Akṣauhiṇīs[1] in the battle.
7. Clipping off their heads, Kālī with eyes like a red lotus, drank off the blood and devoured the flesh rapidly.
8. She fought in diverse ways terrifying both the gods and the Dānavas. She drank the blood of the Dānavas all round.
9. Seizing ten million elephants and an equal number of men with a single hand she playfully thrust them into her mouth.
Continues....
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment