శ్రీ శివ మహా పురాణము - 875 / Sri Siva Maha Purana - 875


🌹 . శ్రీ శివ మహా పురాణము - 875 / Sri Siva Maha Purana - 875 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 37 🌴

🌻. స్కందశంఖచూడుల ద్వంద్వయుద్ధము - 3 🌻


శంఖచూడుడు పర్వతములను, సర్పములను, కొండచిలువలను, మరియు వృక్షములను వర్షరూపములో కురిపించెను. భయంకరమగు ఆ వర్షమును నివారించుట సంభవము కాదు (22). ఆ వర్షముచే కొట్టబడిన శివపుత్రుడగు స్కందుడు దట్టమగు మంచుచే కప్పబడిన సూర్యుని వలె నుండెను (23). ఆతడు మయుడు నేర్పించిన వివిధరకముల మాయను ప్రదర్శించెను. ఓ మహర్షీ! దేవతలలో మరియు గణములలో ఒక్కరైననూ ఆ మాయను తెలియలేకపోయిరి (24). అదే సమయములో మహామాయావి, మహాబలశాలి యగు శంఖచూడుడు ఒక దివ్యమగు బాణముతో స్కందుని ధనస్సును విరుగ గొట్టెను (25). ఆతడు స్కందుని దివ్యరథమును విరుగగొట్టి, రథమును లాగు గుర్రములను సంహరించి దివ్యమగు అస్త్రముతో నెమలిని కూడ నిష్క్రియముగా చేసెను (26). ఆతడు సూర్యకాంతి కలిగిన ప్రాణములను తీసే శక్తితో స్కందుని వక్షఃస్థలముపై కొట్టగా, ఆతడు ఆ దెబ్బచే వెంటనే క్షణకాలము మూర్ఛిల్లెను (27). శత్రువీరులను సంహరించే స్కందుడు మరల తెలివిని పొంది, గొప్ప రత్నమును పొదిగి దృఢముగా నిర్మింపబడిన తన వాహనము నెక్కెను (28).

పార్వతీ సమేతుడైన శివుని ఘనకార్యాన్ని స్మరించుకుంటూ, ఆయుధాలు, క్షిపణులు తీసుకుని, ఆరుముఖాల దేవత భయంకరంగా పోరాడాడు.(29) తన దివ్య క్షిపణులతో, శివపుత్రుడు సర్పాలు, పర్వతాలు, చెట్లు మరియు రాళ్లను, అన్నిటినీ ఆవేశంతో చీల్చాడు. (30) అతను ఆకాశ క్షిపణి ద్వారా మంటలను నిరోధించాడు. అతను శంఖచూడు యొక్క రథాన్ని మరియు విల్లును సరదాగా చీల్చాడు. (31) అతను తన కవచాన్ని, కిరీటాన్ని మరియు వాహనాలను విభజించాడు. యోధుడిలాగా గర్జిస్తూ పదే పదే అరిచాడు. (32)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 875 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 37 🌴

🌻 Śaṅkhacūḍa fights with the full contingent of his army - 3 🌻

22. The king of Dānavas showered mountains, serpents, pythons and trees so terrifyingly that it could not be withstood.

23. Oppressed by that shower Kārttikeya, the son of Śiva, looked like the sun enveloped by thick sheets of frost.

24. He exhibited many types of illusions in the manner indicated by Maya. O excellent sage, none of the gods or Gaṇas understood it.

25. At the same time, the powerful Śaṅkhacūḍa of great illusion split his bow with a divine arrow.

26. He split his divine chariot and the horses pulling it. With a divine missile he shattered the peacock too.

27. The Dānava hurled his spear as refulgent as the sun fatally on his chest whereat he fell unconscious by the force of the blow.

28. Regaining consciousness, Kārttikeya the destroyer of heroic enemies, mounted his vehicle of sturdy build, set with gems.

29. Remembering the feat of lord Śiva accompanied by Pārvatī, and taking up weapons and missiles, the sixfaced deity fought terrifically.

30. With his divine missiles, the son of Śiva split the serpents, mountains, trees and rocks, everything furiously.

31. He prevented a conflagration by the missile of cloud. He split the chariot and the bow of Śaṅkhacūḍa playfully.

32. He split his armour, coronet and the vehicles. He roared like a hero and shouted again and again.


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment