విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 914 / Vishnu Sahasranama Contemplation - 914


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 914 / Vishnu Sahasranama Contemplation - 914 🌹

🌻 914. శర్వరీకరః, शर्वरीकरः, Śarvarīkaraḥ 🌻

ఓం శర్వరీకరాయ నమః | ॐ शर्वरीकराय नमः | OM Śarvarīkarāya namaḥ


సంసారిణామాత్మా శర్వరీవ శర్వరీ । జ్ఞానినాం పునః సంసారః శర్వరీ । తాముభయేషాం కరోతీతి శర్వరీకరః ॥

రాత్రికి కారకుడు. ఇచట శర్వరీ పదమునకు 'రాత్రి వంటిది' అని అర్థము. చేష్టలను, క్రియాప్రవృత్తులను హింసించును - అను వ్యుత్పత్తులచే జీవులను ప్రవృత్తిరహితులను చేయు కాలవిశేషమును 'శర్వరీ' అనదగును. సంసారులకు తమ విషయమున ఆత్మ తత్త్వ వివేక ప్రకాశమును కలుగనీయక మరుగుపడుచుండును కావున 'శర్వరీ' అనదగును.

మరి జ్ఞానులకో? వారికి తమ విషయమున ప్రవృత్తిని ఏమాత్రమును కలిగించజాలకయున్న అవిద్యాకల్పిత సంసారము 'శర్వరీ' అనదగును. సంసారులపై తన మాయను క్రమ్మజేసియు, జ్ఞానులనుండి దానిని తొలగించియు - ఇరువురకును ఈ స్థితిని కలిగించువాడు పరమాత్ముడే కావున అతడు 'శర్వరీకరుడు.'


:: శ్రీమద్భగవద్గీత సాఙ్ఖ్య యోగము ::

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥ 69 ॥

సామాన్య జనులకును ఏది (పరమార్థతత్త్వము) రాత్రియై (దృష్టికి గోచరము కాక) యున్నదో, దానియందు ఇంద్రియనిగ్రహపరుడు యోగి మేలుకొనియుండును (ఆత్మావలోకనము చేయుచుండును). దేనియందు (ఏ శబ్దాది విషయములందు) ప్రాణులు మేలుకొనియున్నారో (ఆసక్తితో ప్రవర్తించుచున్నారో) అది (విషయజాలము) పరమార్థ తత్త్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా నుండును (దృష్టిగోచరముకాక యుండును).


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 914🌹

🌻914. Śarvarīkaraḥ🌻

OM Śarvarīkarāya namaḥ


संसारिणामात्मा शर्वरीव शर्वरी । ज्ञानिनां पुनः संसारः शर्वरी ।
तामुभयेषां करोतीति शर्वरीकरः ॥

Saṃsāriṇāmātmā śarvarīva śarvarī, Jñānināṃ punaḥ saṃsāraḥ śarvarī, 
Tāmubhayeṣāṃ karotīti śarvarīkaraḥ.


The Maker of night. For those caught in worldly existence of saṃsāra, the ātman is dark as the night as they have no light or knowledge of the ātman. But to the jñāni, saṃsāra is night as they ever dwell in the light of ātmajñāna. The Lord creates these two kinds of nights and hence He is Śarvarīkaraḥ.


:: श्रीमद्भगवद्गीत साङ्ख्य योगमु ::

या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥ ६९ ॥


Śrīmad Bhagavad Gīta - Chapter 2

Yā niśā sarvabhūtānāṃ tasyāṃ jāgarti saṃyamī,
Yasyāṃ jāgrati bhūtāni sā niśā paśyato muneḥ. 69.


The self-restrained man keeps awake during that which is night for all creatures. That during which creatures keep awake, it is night to the seeing sage.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥




Continues....

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment