🌹 21, AUGUST 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀🌹 21, AUGUST 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀
1) 🌹 శివ సూత్రాలు - భాగం 1: శంభవోపాయ - 5వ సూత్రం: ఉద్యమో భైరవః - నిర్మలమైన ప్రశాంత స్పృహలో ఒక కాంతి మెరుపులా శివుని దైవీ చైతన్యం ఆవిష్కృతం అవుతుంది. 🌹
🌹 Shiva Sutras - Part 1: Shambhavopaya - 5th Sutra: Udyamo Bhairavaḥ - Shiva is realized like a flash of light in within the stillness of serene consciousness. 🌹
🌹शिव सूत्र - भाग 1: शम्भवोपाय - 5वां सूत्र: उद्यमो भैरवः शिव को शांत और दिव्य चेतना की स्थिरता में प्रकाश की चमक की तरह अनुभव किया जाता है। 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 567 / Bhagavad-Gita - 567 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 16 / Chapter 15 - Purushothama Yoga - 16 🌴
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 5 🌹 
🌻 555. 'కలికల్మష నాశినీ'- 5 / 555. 'Kalikalmasha Nasini' - 5 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శివ సూత్రాలు - 1-5వ సూత్రం: ఉద్యమో భైరవః - నిర్మలమైన ప్రశాంత స్పృహలో ఒక కాంతి మెరుపులా శివుని దైవీ చైతన్యం ఆవిష్కృతం అవుతుంది. 🌹*
*✍️ ప్రసాద్ భరద్వాజ*

*శివ సూత్రాలలోని 5వ సూత్రం "ఉద్యమో భైరవః" శివుడి అనుభవం శాంతమైన మరియు కేంద్రీకృతమైన చైతన్యంలో అకస్మాత్తుగా, లోతైన ప్రకాశమయమైన కాంతి రూపంలో ప్రగతిస్తుంది అని బోధిస్తుంది. ఈ అనుభవాన్ని "ప్రతిభా" అని పిలుస్తారు, ఇది మన యొక్క అవగాహనను మరియు విశ్వాన్ని మార్చివేసే స్వతఃస్ఫూర్తి ప్రబోధన. ఈ సూత్రం లోతైన ధ్యానం మరియు ఆత్మపరిశీలన యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది, మరియు నిజమైన ఆధ్యాత్మిక మేల్కొలుపు కేవలం అంతర్గత కేంద్రీకరణ మరియు మానసిక సమతుల్యత ద్వారా సాధ్యమవుతుందని సూచిస్తుంది.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Shiva Sutras - 1- 5th Sutra: Udyamo Bhairavaḥ - Shiva is realized like a flash of light in within the stillness of serene consciousness. 🌹*
*✍️ Prasad Bharadwaj*

*The 5th Sutra of Shiva Sutras, "Udyamo Bhairavaḥ," teaches that the realization of Shiva occurs as a sudden, profound flash of light within a serene and focused consciousness. This realization, termed pratibhā, is a spontaneous revelation that transforms one's understanding of the self and the universe. The sutra emphasizes the importance of deep meditation and introspection, highlighting that true spiritual awakening is attainable only through internalized focus and mental attunement.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹शिव सूत्र - 1- 5वां सूत्र: उद्यमो भैरवः शिव को शांत और दिव्य चेतना की स्थिरता में प्रकाश की चमक की तरह अनुभव किया जाता है। 🌹*
*✍️ प्रसाद भारद्वाज*

*शिव सूत्रों के 5वें सूत्र "उद्यमो भैरवः" में बताया गया है कि शिव का अनुभव एक शांत और केंद्रित चेतना में अचानक, गहरे प्रकाश की चमक के रूप में होता है। इस अनुभव को "प्रतिभा" कहा जाता है, जो आत्मा और ब्रह्मांड की समझ को परिवर्तित कर देता है। यह सूत्र गहन ध्यान और आत्मनिरीक्षण के महत्व पर जोर देता है, और यह बताता है कि सच्चा आध्यात्मिक जागरण केवल आंतरिक एकाग्रता और मानसिक समस्वरता के माध्यम से ही प्राप्त किया जा सकता है।*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 567 / Bhagavad-Gita - 567 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 16 🌴*

*16. ద్వావిమౌ పురుషా లోకే క్షరశ్చాక్షర ఏవ చ |*
*క్షర: సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ||*

*🌷. తాత్పర్యం : నశ్వరులు మరియు అనశ్వరులని జీవులు రెండు రకములు, భౌతికజగమునందలి ప్రతిజీవియు నశ్వరము (క్షరుడు) కాగా, ఆధ్యాత్మికజగమునందు ప్రతిజీవియు అనశ్వరమని(అక్షరుడని) చెప్పబడినది.*

*🌷. భాష్యము : పూర్వమే వివరింపబడినట్లు దేవదేవుడైన శ్రీకృష్ణుడు వ్యాసదేవుని అవతారమున వేదాంతసూత్రములను రచించెను. అట్టి వేదాంతసూత్రములందలి అంశముల సారాంశమును అతడిచ్చట తెలియజేయుచు అసంఖ్యాకములుగా నున్న జీవులను క్షరులు మరియు అక్షరులుగా విభజింపవచ్చునని పలుకుచున్నాడు. వాస్తవమునకు జీవులు శ్రీకృష్ణ భగవానుని విభిన్నాంశములు. వారే భౌతికజగత్తుతో సంపర్కమును పొందినప్పుడు “జీవభూతులు” అని పిలువబడుదురు. ఈ శ్లోకమున తెలుపబడిన “క్షర:సర్వాణి భూతాని” యను పదము ననుసరించి వారు నశ్వరులు.*

*కాని దేవదేవుడైన శ్రీకృష్ణునితో ఏకత్వమున నిలిచినవారు మాత్రము అనశ్వరులుగా లేదా అక్షరులుగా పిలువబడుదురు. ఇచ్చట ఏకత్వమనగా అక్షరపురుషులకు వ్యక్తిత్వము ఉండదని భావము కాదు. భగవానుడు మరియు ఆ అక్షరపురుషుల నడుమ అనైక్యత లేదని మాత్రమే అది సూచించును. అనగా అక్షరులు సృష్టిప్రయోజనమునకు అనుకూలురై యుందురు. వాస్తవమునకు సృష్టి యనెడి విషయము ఆధ్యాత్మిక జగమునందు లేకున్నను వేదాంతసూత్రములందు తెలుపబడినట్లు దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వవ్యక్తీకరణములకు మూలమైనందున అటువంటి భావము ఇచ్చట వ్యక్తపరుపబడినది.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 567 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 15 - Purushothama Yoga - 16 🌴*

*16. dvāv imau puruṣau loke kṣaraś cākṣara eva ca*
*kṣaraḥ sarvāṇi bhūtāni kūṭa-stho ’kṣara ucyate*

*🌷 Translation : There are two classes of beings, the fallible and the infallible. In the material world every living entity is fallible, and in the spiritual world every living entity is called infallible.*

*🌹 Purport : As already explained, the Lord in His incarnation as Vyāsadeva compiled the Vedānta-sūtra. Here the Lord is giving, in summary, the contents of the Vedānta-sūtra. He says that the living entities, who are innumerable, can be divided into two classes – the fallible and the infallible. The living entities are eternally separated parts and parcels of the Supreme Personality of Godhead. When they are in contact with the material world they are called jīva-bhūta, and the Sanskrit words given here, kṣaraḥ sarvāṇi bhūtāni, mean that they are fallible.*

*Those who are in oneness with the Supreme Personality of Godhead, however, are called infallible. Oneness does not mean that they have no individuality, but that there is no disunity. They are all agreeable to the purpose of the creation. Of course, in the spiritual world there is no such thing as creation, but since the Supreme Personality of Godhead, as stated in the Vedānta-sūtra, is the source of all emanations, that conception is explained.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 555 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam  - 555 - 5 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*

*🌻 555. 'కలికల్మష నాశినీ'- 5 🌻*

*ఆధునిక కాలమున కల్మషములు బాగుగా పెరుగుచున్నట్లు గమనింపవచ్చును. ఆహారము నందు, నీటియందు, పాలయందు, ఫలములందు, తినెడి పదార్థము లందు, పీల్చు గాలియందు, వసించు ప్రదేశములందు అంతటనూ కల్మషములే పెరుగుచున్నవి. తదనుగుణముగ మానవుల చేష్ఠలయందు, భాషయందు, భావములందు కూడ కల్మషమే పెరుగుచున్నది. అన్ని విధముల అపరిశుద్ధము తీవ్రముగ పెరుగుచుండుట గమనింప వచ్చును. విద్వేషములు, కలహములు, యుద్ధములు, మారణకాండ దినచర్యగ మానవజీవితము సాగుచున్నది. ఒకరినొకరు చంపుకొనుట, హింసించుకొనుట పరిపాటియైనది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 555 - 5 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini*
*katyayani kalahantri kamalaksha nishevita  ॥113 ॥ 🌻*

*🌻 555. 'Kalikalmasha Nasini' - 5 🌻*

*It can be observed that the sins are growing high in modern times. Impurities are growing in food, water, milk, fruits, food material, breathing air and living places. Accordingly, there is increasing impurity in human behavior, language and feelings. It can be observed that all kinds of impurities are increasing. Human life is going on as a daily routine of enmities, conflicts, wars and carnage. Killing and torturing each other has become common.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment