శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 559 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 559 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 559 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 559 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀

🌻 559. 'తాంబూలపూరిత ముఖీ' - 3 🌻


సామాన్య రతి నుండి శివానుభూతి వరకు కూడ తాంబూలమునకు ప్రాముఖ్యత గలదు. తాంబూలమునకు ప్రధానమగు వస్తువులు తమలపాకు, సున్నము, వక్క, యాలకులు, లవంగములు, పచ్చ కర్పూరము యిత్యాదులు. కొనుగోలు చేయు మిఠాయి కిళ్లీలు తాంబూలము కాజాలదు. తాంబూలమును ఆహార స్వీకరణమునకు తదుపరియే గైకొనవలెను గాని తోచినప్పుడెల్ల తినరాదు. అట్లు జేసినచో జీర్ణావయవముల యందు పుండ్లు పడు అవకాశ ముండును. తాంబూలము గూర్చి తర్కించుటకన్న శ్రీమాతకు ప్రియము గనుక తాంబూలము గైకొనుట భక్తులు చేయవలసిన పని.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 559 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 114. Tanbulapuritamukhi dadimikusumaprabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻

🌻 559. 'Tāmbūlapūrita Mukhi' - 3 🌻


From ordinary intimacy to spiritual union with Śiva, tāmbūla holds significance. The primary ingredients of tāmbūla include betel leaves, lime, areca nut, cardamom, cloves, and edible camphor. Commercially available sweet paan cannot be considered true tāmbūla. Tāmbūla should be consumed after meals but not frequently, as excessive use can lead to ulcers in the digestive system. Instead of debating about tāmbūla, devotees should offer it to Śrī Mātā as it is dear to her.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment