వినాయక చవితి పూజలో వాడే ఏకవింశతి పత్రిలోని విశేష గుణాలు / Special qualities of Ekavinsati Patri used in Vinayaka Chaviti Puja


🌹 వినాయక చవితి పూజలో వాడే ఏకవింశతి పత్రిలోని విశేష గుణాలు / Special qualities of Ekavinsati Patri used in Vinayaka Chaviti Puja 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://youtu.be/A30Vh14FfZA


వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్షంలో హస్త నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు శుద్ధ చవితి రోజున వస్తుంది.

వర్షాకాలానికి, చలి కాలానికి వారధిగా ఈ పండుగ వస్తుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండి పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో సూక్ష్మజీవులు స్వైర విహారం చేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు అధికం. ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను చెట్లనుంచి త్రుంచి వాటిని దేవునికి సమర్పిస్తాం. ఈ సందర్భంగా ఆయా పత్రాల స్పర్శ, వాటి నుంచి వెలువడే సువాసన మనకు మేలు చేస్తాయి.

గణపతి పూజా విధాపంలోనే'పత్రం సమర్పయామి అని వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటు చేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే ఏకవింశతి (21) పత్రాలను పూజలో వినియోగిస్తాం. అదే విధంగా వినాయక చవితి ముందు రోజున 'తదియ గౌరి' వ్రతం గౌరి దేవికి చేస్తారు. ఈ పూజలో గౌరి దేవికి 16 రకాలైన పత్రాలు సమర్పిస్తారు. అందులో ముఖ్యమైనది 'అపామార్గ పత్రం' అంటే ఉత్తరరేణి ఆకు. దానికి ప్రాధాన్యం ఎక్కువ.

జ్యోతిర్‌ వైద్యం ఆధారంగా నక్షత్రాలకు, రాశులకు, గ్రహాలకు ఈ పత్రాలతో అవినాభావ సంబంధముంది. జ్యోతిషంలో ఆకుపచ్చరంగు బుధునిది. ఆకులన్నీ బుధ కారకత్వాన్ని కలిగి ఉంటాయి. అలాగే తత్వాలను పరిశీలిస్తే... అగ్నితత్వానికి రవి, కుజ, గురువు; భూతత్వానికి బుధుడు, వాయుతత్వానికి శని, చంద్ర, శుక్రులు; జలతత్వానికి, పిత్త తత్వానికి రవి, కుజ, గురువు; వాత తత్వానికి శని, కఫానికి చంద్ర శుక్రులుగా శాస్త్రం నిర్వచించినది. అయితే బుధునికి వాత, పిత్త, కఫతత్వం (త్రిగుణం) ఉంది.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment