🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 569 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 569 -2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀
🌻 569. ‘నిఖిలేశ్వరీ’ - 2 🌻
తమను తాము పరిపాలించుకొనువారు ఈశ్వరులు. ఇతరులను పరిపాలించు వారు ప్రభువులు. తమను తాము పరిపాలించుకొనుచూ యితరులను స్వయం పాలకులుగ తీర్చిదిద్దువారు గురువులు. అందరి యందు తానే నిండియుండి వారిపై ఈశ్వరత్వము నెఱపుట సర్వవ్యాపకమగు చైతన్యమునకే సాధ్యము. శ్రీమాత ఇట్టి చైతన్య స్వరూపిణి అని తెలియ వలెను. మనలో నుండియే మనలను పరిపాలించును. మన కోరికల నెఱిగి తీర్చును. లోతృప్తి కలిగించును. ఈశ్వరత్వము వహించి తీర్చిదిద్ది తనంత వారినిగా చేయును. ఇట్టి తల్లిని ఎంత ప్రశంసించిననూ అది అల్పమే అగును కదా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 569 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari
maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻
🌻 569. 'Nikhileshwari' - 2 🌻
Those who govern themselves are divine, those who rule others are lords, and those who nurture others to govern themselves are teachers. Only the omnipresent consciousness can pervade all beings and establish divinity within them. Shri Mata is the embodiment of this consciousness. She governs us from within, fulfilling our desires, and providing deep satisfaction. She nurtures us, bestowing divinity upon us, and elevating us to her level. No amount of praise for such a divine mother is ever sufficient!
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment