🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 571 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 571 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀
🌻 571. 'మహాప్రళయ సాక్షిణీ' - 2 🌻
సృష్టి ప్రళయమునకు చిట్టచివర, సృష్టి ఆరంభమునకు మొట్టమొదట శ్రీమాతయే యుండును. లయము నుండి సృష్టి వరకు గల కాలమున ఆమె పరమై యుండును. అపుడామెను పరాదేవి అందురు. పరాశక్తి అందురు. ఆ స్థితి సమస్తమునకు పరము అయినది. నిద్రకు ముందు, నిద్రకు తరువాత మనము ఎట్లుందుమో గమనించుట, నిద్రలోనికి ఎట్లు ప్రవేశించు చున్నామో, నిద్ర నుండి ఎట్లు మేల్కాంచు చున్నామో గమనించుట విశేషమైన సాధనగ ఋషులు తెలుపుదురు. ఈ సాధన వలన జనన మరణ రహస్యములు కూడ తెలియగలవు. శ్రీమాత అగ్రగణ్యా మరియు ప్రళయ సాక్షిణి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 571 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari
maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻
🌻 571. 'Maha Pralaya Sakshini' - 2 🌻
At the end of dissolution and at the very beginning of creation, it is Śrī Māta who stands alone. During the period from dissolution to creation, she exists in her supreme state. In this state, she is known as "Parādevi" or "Parāśakti," the Ultimate Goddess, embodying the supreme power beyond all. Observing how we are before sleep, how we enter sleep, and how we awaken from it is considered a profound spiritual practice by sages, revealing the mysteries of birth and death. Śrī Māta is regarded as the foremost and the witness of dissolution.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment