🌹 13 NOVEMBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀🌹 13 NOVEMBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀
1) 🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 1వ భాగం 1 to 5 Short Videos 🌹  
2) 🌹. కార్తిక పురాణం - 12 🌹
🌻. 12వ అధ్యాయము - ద్వాదశి ప్రశంస - సాలగ్రామ దానమహిమ 🌻
3) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 573 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 573 - 2 🌹 
🌻 573. 'పరానిష్ఠా' - 2 / 573. 'Paranishta' - 2 🌻
4) 🌹 శ్రీ తులసీ మంత్రం / శ్రీ తులసీ ప్రదక్షిణ / ఉసిరిచెట్టు వద్ద ప్రార్థన 🌹
5) 🌹క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ 🌹
🍀 దీపదాన మహిమ / తులసి మహత్యం 🍀
6) క్షీరాబ్ధి ద్వాదశి దామోదర ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి మహత్వము 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు - 1వ భాగం 1 to 5 Short Videos 🌹*
*సబ్ స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి.*
*ప్రసాద్ భరద్వాజ*

🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు 1వ భాగం - శాశ్వతం వైపు ప్రయాణమే నిజమైన ఆత్మ సాధన. - 1. అంతరంగ అవగాహన 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు 1వ భాగం - శాశ్వతం వైపు ప్రయాణమే నిజమైన ఆత్మ సాధన. - 2. నేను ఉన్నాను అనే జ్ఞానం శాశ్వతమైనది 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు 1వ భాగం - శాశ్వతం వైపు ప్రయాణమే నిజమైన ఆత్మ సాధన. - 3. శుద్ధ చైతన్యం 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు 1వ భాగం - శాశ్వతం వైపు ప్రయాణమే నిజమైన ఆత్మ సాధన. - 4. అంతర్ముఖత 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు 1వ భాగం - శాశ్వతం వైపు ప్రయాణమే నిజమైన ఆత్మ సాధన. - 5. ఆత్మ యొక్క చైతన్యము 🌹
ప్రసాద్ భరద్వాజ

సబ్ స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి.
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కార్తిక పురాణం - 12 🌹*
*🌻. 12వ అధ్యాయము - ద్వాదశి ప్రశంస - సాలగ్రామ దానమహిమ 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*

"మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను"మని వశిష్ట మహాముని ఈవిధముగా తెలియచేసిరి.

కార్తీక సోమవారమునాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయవలయును. తరువాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసము౦డి, సాయంకాలము శివాలయమునకు గాని, విష్ణ్వాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి, నక్షత్ర దర్శనము చేసికొని పిమ్మట భుజింపవలయును. ఈవిధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక, మోక్షము కూడా పొందుదురు.

కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన యెడల నా వత్రమాచరించినచో నూరు రేట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ యేకాదశిరోజున, పూర్ణోపవాసముండి ఆ రాత్రి వివ్ష్ణ్వాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన, కోటి యజ్ఞముల ఫలితము కలుగును. ఈవిధముగా చేసిన వారాలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానముచేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన నెంత పుణ్యము కలుగునో దానికంటే నధికముగా ఫలము కలుగును. కార్తిక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయుణుడు శేషపానుపు నుండి లేచును గనుక, కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు యిష్టము. 

అరోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రహ్మణునకు దానమిచ్చిన యెడల ఆయావు శరీర ముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాములు యింద్ర లోకములో స్వర్గ సుఖములందుదురు. కార్తీకశుద్ధ పాడ్యమి రోజున, కార్తిక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశినాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టునుగాని, సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినయెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును.

దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు - శ్రద్దగా అలకింపుము.

🌻. సాలగ్రామ దానమహిమ 🌻

పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడా బెట్టుచు, తాననుభవించక, యితరులకు బెట్టక, బీదలకు దానధర్మములు చేయక, యెల్లప్పుడు పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విఱ్ఱ్వీగుచూ యేజీవికీ కూడా ఉపకారమైననూ చేయక "పరులద్రవ్యము నెటుల అపహరింతునా!"యను తలంపుతో కుత్సిత బుద్ది కలిగి కాలము గడుపుచుండెను.

అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున నున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుయిచ్చెను. మరి కొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మనిని అడుగగా ఆ విప్రుడు "అయ్యా! తమకీయవలసిన ధనము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను. మీ ఋణముంచుకోను. ఈజన్మలో తీర్చని యెడల మరుజన్మమున మీ యింట యేజంతువుగానో పుట్టి అయినా, మీ ఋణము తీర్చుకోగలను" అని సవినయముగా వేడుకోనెను. 

ఆ మాటలకు కోమటి మండిపడి" అట్లు వీలులేదు. నాసొమ్ము నాకిప్పుడే యీయవలయును. లేనియెడల నీక౦ఠమును నరికి వేయుదును" అని ఆవేశం కొలదీ వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కొసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి, అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసీ తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక, అప్పటి నుండి అ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలూ పడుచూ మరి కొనాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకోనిపోయి రౌరవాది నరకకూపముల బడద్రోసిరి.

ఆ వైశునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి స౦పాదించిన ధనమును దానదర్మాలు చేయుచు పుణ్యకార్యము లాచరించుచు, నీడకొరకై చెట్లు నాటించుచు, నూతులు, చెరవులు త్రవ్వించుచు, సకల జనులను సంతోషపెట్టుచు మంచికీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంత కాలమునకు త్రిలోకసంచారియగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి, త్రోవలో ధర్మవీరుని యింటికి వెంచేసిరి. 

ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి, విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి, చేతులు జోడించి "మహానుభావా! నాపుణ్యం కొలదీ నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నాజన్మ తరించినది. నాయిల్లు పావనమైనది. శక్తి కొలదీ నే జేయు సత్కారములను స్వీకరించి తమరువచ్చిన కార్యమును విశధీకరింపుడు" అని సవినయుడై వేడుకొనెను.

అంత నారదుడు చిరునవ్వు నవ్వి "ఓ ధర్మవిరా! నేను నీకోక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీమహావిష్ణువునకు కార్తీకమాసంలో శుద్ధద్వాదశి మహాప్రితికరమైన దినము. అరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును. 

నాలుగు జాతులలో నేజాతివారైననూ - స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా,  చోరుడైన, పతివ్రతమైనా, వ్యభిచారిణియైనా కార్తీకశుద్ద ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు వుండగా నిష్ఠగా ఉపవాసముండి,  సాలగ్రామదానములు చేసిన యెడల వెనుకటి జన్మలందూ, ఈ జన్మమందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకమనుభవించుచున్నాడు. అతనిని వుద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు. అట్లుచేసి నీతండ్రి ఋణం తిర్చుకోనుము." అని చెప్పెను. 

అంతట ధర్మవీరుడు "నారద మునివర్యా! మేడల వెనుకటి జనమలందు, ఈ జన్మ మందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలో కాంలో మహానరక మనుభ వించుచునాడు. అత నిని వుద్దరించుటకై నివు సాలగ్రమదానము చేయక తప్పదు. అట్లు చేసి ని తండ్రి ఋణం తిర్చుకోనుము, అని చెప్పెను. 

అంతట దర్మవిరుడు " నారద మునివర్యా! నేను గోదానము,  భూదానము,  హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని, అటువంటి దానములు చేయగా నాతండ్రికి మోక్షము కలుగనప్పుడీ "సాలగ్రామ" మనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన యెట్లు వుద్ధరింపబడునాయని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్నవాని ఆకలితీరునా! దాహంగొన్న వానికి దాహం తీరునా? కాక, యెందులకీ దానము చేయవలయును? నేనీ సాలగ్రామదానము మాత్రము చేయజాల"నని నిష్కర్షగా పలికెను.

ధర్మవీరుని అవివేకమునకు విచారించి "వైశ్యుడా! సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిలకాదు. శ్రీహరి యొక్క రూపము. అన్నిదానములకంటె సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తని గావింప నెంచితివేని, యీ దానముతప్ప మరొక మార్గము లేదు" అని చెప్పి నారదుడు వెడలిపోయాను.


ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు, దానసామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంత కాలమునకు అతడు చనిపోయెను. 

నారదుడు చెప్పిన హితభోధను పెడచెవిని పెట్టుటచేత మరణాంతర మేడు జన్మలయందు పులియై పుట్టి, మరి మూడు జన్మలందు వానరమై పుట్టి, ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి, పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి, పదిజన్మలు పందిగా జన్మించి యుండెను. అట్లు జరగిన తరువాత పదకొండవా జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టిగా ఆమెకు యౌవనకాలము రాగా ఆపేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను.

చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాల దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈవిపత్తు యెందువలన కలిగే నాయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే అమెచేత సాలగ్రామదానము చేయించి "నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక" యని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయిఒచెను. ఆరోజు కార్తీక సోమవారమగుట వలన అ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవిం, జన్మాంతరమున స్వర్గమున కరిగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యమూ సాలగ్రామదానము చేయుచు ముక్తినొందెను.

కావున, ఓ జనకా! కార్తీకశుద్ద ద్వాదశిరోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము యింతింత గాదు. ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ద్వాదశాధ్యాయము - పన్నె౦డో రోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 573 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 573 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 573. 'పరానిష్ఠా' - 2 🌻*

*క్రియ యందున్నప్పుడు జ్ఞాన మందుండ కుండుట జీవుల కెంత సహజమో, శ్రీమాతకు శివ జ్ఞానము నందుండుట అంత సహజము. శివజ్ఞానము నందు తిష్ఠవేసి ఆ నిష్ఠతో ఇచ్ఛా జ్ఞాన శక్తులను తన నుండి వ్యక్తము గావించి, మహదహంకారము నేర్పరచి, పంచ భూతముల నేర్పరచి ఈ మొత్తమునందు జీవులను ప్రవేశింప జేసి, సూర్యాది మండలములను నిర్వహించుచూ కూడ ఎల్లప్పుడును శివునితోనే కూడియుండును. ఇట్టి నిష్ఠ అనన్య సాధ్యము. ఆమె నిష్ఠకు కూడ పరమే. దీక్షలు, నిష్ఠలు స్వీకరించువారు శ్రీమాత ఆరాధనముననే వాని యందు నిలచి కృతకృత్యులు కావలెను. శ్రీమాత అనుగ్రహము లేనిచో దీక్షలు, నిష్ఠలు భంగమగు చుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 573 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 573. 'Paranishta' - 2 🌻*

*For beings, it is natural to be involved in action without constant knowledge. Similarly, for Shrimata, it is entirely natural to remain in Shiva's knowledge. Remaining established in Shiva's awareness, she expresses her will, knowledge, and power from herself, creating the great ego, the five elements, and introduces beings into this entirety. She sustains solar and other cosmic realms, always remaining united with Shiva. This steadfastness in Shiva is unique and unparalleled. Her devotion and dedication are directed entirely toward the Supreme. Those who accept disciplines and dedications must remain devoted to the worship of Shrimata to reach fulfillment. Without Shrimata's grace, disciplines and dedications may falter.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శ్రీ తులసీ మంత్రం / శ్రీ తులసీ ప్రదక్షిణ / ఉసిరిచెట్టు వద్ద ప్రార్థన 🌹*

మహాప్రసాద  జననీ  సర్వ సౌభాగ్య  వర్ధినీ
అధి వ్యాధి  జరా ముక్తం  తులసీ  త్వాం  నమోస్తుతే

🌸 శ్రీ తులసీ ప్రదక్షిణ 🙏

🌸 గోప ప్రదక్షిణ నీకిస్తినమ్మా
గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా! 🙏

🌸 ఒంటి ప్రదక్షిణ నీకిస్తినమ్మా
వైకుంఠసన్నిధి నాకియ్యవమ్మా! 🙏

🌸 రెండో ప్రదక్షిణ నీకిస్తినమ్మా
నిండైనసంపదలు నాకియ్యవమ్మా! 🙏

🌸 మూడో ప్రదక్షిణ నీకిస్తినమ్మా
ముత్తైదువతనం నాకియ్యవమ్మా! 🙏

🌸 నాల్గోప్రదక్షిణ నీకిస్తినమ్మా
నవధాన్య రాశులను నాకియ్యవమ్మా! 🙏

🌸 అయుదోప్రదక్షిణ నీకిస్తినమ్మా
ఆయువైదోతనం నాకియ్యవమ్మా! 🙏

🌸 ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
అత్తగల పుత్రుణ్ణి నాకియ్యవమ్మా! 🙏

🌸 ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా! 🙏

🌸 ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
యమునిచే బాధలు తప్పించవమ్మా! 🙏

🌸 తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
తోడుగా కన్యలను తోడియ్యవమ్మా! 🙏

🌸 పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
పద్మాక్షీ నీసేవ నాకియ్యవమ్మా! 🙏

🌸 ఎవ్వరు పాడినా ఏకాశి మరణం
పుణ్యస్త్రీలు పాడితే పుత్రసంతానం 🙏

🌸 రామతులసీ, లక్ష్మీతులసీ!  నిత్యం మా  ఇంట  కొలువై  విలసిల్లవమ్మా. 🙏

ఉసిరిచెట్టు వద్ద ప్రార్థన

ధాత్రీదేవి నమస్తుభ్యం
సర్వపాప క్షయంకరి
పుత్రాన్ దేహి మహా ప్రాజ్ఞే యశోదేహి బలంచమే

ప్రజ్ఞాం మేధాం సౌభాగ్యం
విష్ణు భక్తించ శాశ్వతీం
నిరోగం కురుమాం నిత్యం
నిష్పాపం కురు సర్వదా.

🌸 21 నామములు 🌸

ఓం ధాత్రై నమః
ఓం శాంత్యై నమః
ఓం కాంత్యై నమః
ఓం మేధాయై నమః
ఓం కళ్యాణ్యై నమః
ఓం విష్ణుపత్నై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం ప్రకృత్య నమః
ఓం ఇందిరాయై నమః
ఓం సుధ్యత్యై నమః
ఓం రమాయై నమః
ఓం లోకమాత్రై నమః
ఓం అబ్ధితనయాయై నమః
ఓం గాయత్రై నమః
ఓం సావిత్రై నమః
ఓం విశ్వరూపాయై నమః
ఓం సురూపాయై నమః
ఓం కమనీయాయై నమః
ఓం అవ్యక్తాయై నమః
ఓం కమలాయై నమః
ఓం జగద్ధాత్రై నమః
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ 🌹*
*🍀 దీపదాన మహిమ / తులసి మహత్యం 🍀*
*🌻 క్షీరాబ్ధి ద్వాదశి పూజ చేయలేని వాళ్లు భక్తి శ్రధ్దలతో ఈ ఒక్క కధ చదివినా చాలు. 🌻*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్ఛినః*
*యదిచ్ఛేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యంబ్రాహ్మణైస్సహ*
*విష్ణోః ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకథా*
*ద్వాదశ్యాం శ్రవణాత్తస్యాః పునర్జన్మ న విద్యతే*

*పాండవులు రాజ్యం పోగొట్టుకుని ద్వైతవనంలో ఉన్న సమయంలో అక్కడకు వచ్చిన వ్యాసమహర్షికి సకల ఉపచారాలు చేశారు. మనుషుల ధర్మబద్ధమైన కోర్కెలు ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవీయండి అని అడిగాడు. అప్పుడు వ్యాసమహర్షి రెండు వ్రతాలు సూచించారు. వాటిలో మొదటిది క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, రెండోది క్షీరాబ్ధి శయన వ్రతం. కార్తీకమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజు క్షీరాబ్ధి ద్వాదశీ వ్రతం చేస్తారు. ఆ వ్రతం గురించి వ్యాసమహర్షి ఇలా చెప్పారు*

పూర్వము దర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా, నచ్చటికి అనేక ఋషులతోఁ గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి యనుజ్ఞ బొంది కూరుచుడి కొంతతడువు మాటలాడి యాయనతో ‘స్వామీ! మీరు ఎల్లధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు దెలియని దర్మసూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ యుపాయము చేత సిద్దించునో సెలవిండు, అని యడుగగా వ్యాసుడు ‘నాయనా! మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయమునే పూర్వం నారదమహాముని బ్రహ్మనడుగగా నాతడు సర్వకామప్రదములగు రెండు వ్రతములు చెప్పినాడు.క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము, క్షీరాబ్ధి శయన వ్రతము అను నా రెండు వ్రతములలో క్షీరాబ్ధి ద్వాదశీవ్రతమును నీకు జెప్పెదను వినుము. కార్తిక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూఁకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును, మునులతోడును, లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చి యుండి, యొక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా – ఏ మానవుడైనను ఈ కార్తిక శుద్ద ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో గూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడ పూజించి తులసిపూజచేసి తులసికథను విని భక్తితో దీపదానము చేయునోవాడు సర్వపాపములు వీడి నా సాయుజ్యమును బొందును. అని శపథము చేసినాడు గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము, అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధాన మెట్టిదో నాకు జెప్పమని యడుగగా వ్యాసిడిట్లు చెప్పదొండగెను. ‘ 

దర్మరాజా! ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసికొని సాయంకాలమున మరల స్నానము చేసి శుచియై తులసికోట దగ్గర చక్కగా శుద్ది చేసి ఐదు వన్నెల మ్రుగ్గుల పెట్టి పలువిధముల నలంకరించి తులసీ మాలమందు లక్ష్మీసహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోను బూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెఱుకుముక్కలు సమర్పించి తాంబూలనీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యమును దీపదాన ఫలమును విని యనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తిచేయవలెను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టముంగాంచును. ధర్మరాజది విని దీపదాన మహిమను జెప్పుమని యడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. 

🔥 దీపదాన మహిమ 🔥

‘యుధిష్టిరా! దీపదానమహిమనెవడు చెప్పగల్గును ? కార్తిక శుద్ద ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉప పాతకములు పోవును. నూఱు చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగాఁ జేసిన నా ఫలములు నేను జెప్పలేను. భక్తితో నొకవత్తితో దీపము బెట్టిన బుద్దిశాలి యగును. నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును. పదివేసిన విష్ణుసాయుజ్యము నొందును. వేయివత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన యెడల కురుక్షేత్రమందు జేసినంత ఫలము గలుగును. దీనికి ఆవునేయి మంచిది. నూవులనూనె మధ్యమము. తేనె యదమము. ఇతరములైన అడవినూనెలు కనీసము, ఆవునేయి జ్ఞానమోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్పనూనె భోగప్రదము, అడవినూనె కామ్యార్థప్రదము, అందులో ఆవనూనె మిగుల కోరికలనిచ్చును. అవిసెనూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బఱ్ఱె నేయి పూర్వపుణ్యమును దొలగించును. వీనిలో కొంచమైన ఆవునేయి కలిసిన దోషపరిహారమగును. ఈ దీపదానములవలననే యింద్రాదులకు వారివారి పదవులు దొరకినవి. దీనివలన ననేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి యున్న నెవడు చూచి యానందపడునో వాని పాపములన్నియు నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు.’ అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును జెంది తులసీ మహత్మ్యమును జెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు.

*🍀 తులసి మహత్యం 🍀*

*తులసి శ్రీ మహాలక్ష్మిః, విద్యా విద్యా యశస్విని!*
*ధర్మా ధర్మనా దేవీ దేవ దేవ మనః ప్రియా!*
*లక్ష్మి! ప్రియ సఖీ దేవీ ద్యౌర్బమి రచలాచలా!*

*లక్ష్మీ నారాయణ స్వరూపిణి యైన తులసిని నమస్కరిస్తూ పైన 16నామాలను పఠించిన వారికి గృహంలో లక్ష్మి సుస్థిరంగా నిలిచి సుఖ, సౌభాగ్యాలు వృద్ధి పొందుతాయి.*

తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు జెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తికమాసమందు తులసిపూజ చేయువారుత్తమలోకమును బొందుదురు. తుదకు ఉత్థానద్వాదశినాడైనను తులసిపూజ చేయనివారు కోటిజన్మలు చండాలులై పుట్టుదురు. తులసిమొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు.

తులసీ దళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠమునకు బోవుదురు. బృందావనము వేసినవారు బ్రహ్మత్వము బొందుదురు. తులసి యున్న ఇంటిలో గాపురము చేయుట, తులసితోట వేసి పెంచుట, తులసిపేరులు దాల్చుట, తులసిదళము భక్షించుట, పాపహరములు. తులసి యున్న చోటునకు యమకింకరులు రారు.

*‘యాన్ములే సర్వతీర్దాని! యన్మధ్యే సర్వదేవతాః
యాదాగ్రే సర్వవేదాశ్చ! తులసిం త్వాం నమమ్యహమ్’’*

*ఐశ్వర్య ప్రదాయిని అయిన తులసిని పై శ్లోకం చదువుతూ ప్రదక్షిణం చేసినచో సర్వదేవతా ప్రదిక్షణం చేసిన ఫలితం దక్కుతుంది.*

ఈ పై తులసి మంత్రమును బఠించు వారికి నే బాధయు నంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవ యందే ఒక పూర్వకథను జెప్పెద వినుము. 

కాశ్మీరదేశ వాసులగు హరిమేధసుమేదులను నిద్దఱు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి యొక స్థలములో నొక తులసితోటను జూచిరి. చూచినతోడనే వారిలో సుమేధుడు భక్తితో బ్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడిదియే మని యడిగెను. సుమేధుడు ఇక్కడ నెండబాధగా నున్నదని యొక మఱ్ఱిచెట్టునండకుజేరి తులసికథ నిట్లు చెప్ప దొడఁగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా నెన్నియో యుత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృతకలశము పుట్టెను. ఆ యమృతకలశమును జేత బూని మహానందము నొంది విష్ణువు ఆ కలశముపై నానందబాష్పములు విడువగా నందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని, లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము జేయగలదానవగు మని ప్రేమ మీఱ బలికెను. 

అందువలన నారాయణునకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మ్రొక్కినాను. అని యా బ్రాహ్మణుండు పలుకుచుండగానే యామఱ్ఱి ఫెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొఱ్ఱలోనుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహధారులైన మీ రెవరిని యడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు నని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనియెను. ‘ నేను దేవలోకవాసిని, నాపేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతోగూడి నందనవనమున గామవికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనిబడి మా సందడివలన సమాధి చలించి యచ్చట తపస్సు చేయుచున్న రోమశమహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై యిట్లు నాకలజడి కలిగించితివి గావున బ్రహ్మ రాక్షసుడవగు మని శపించి తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతంత్రలు గనుక వారివలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. 

అంతట నేను శాపమునకు వెఱచి యా మునిని వేడి ప్రసన్నునిజేయగా నాయన యనుగ్రహము గలిగి నీవెప్పుడు తులసిమహిమను, విష్ణుప్రభావమును విందువో అప్పుడు శాపవిముక్తుడవుగుదువని అనిగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసునై యీ చెట్టు తొఱ్ఱలో జేరి మీ దయవలన నేడు శాపమోక్షణము నొందితిని’ అని జెప్పి , రెండవవాని వృత్తాంతము చెప్పసాగెను. ‘ ఈయన పూర్వమొక మునికుమారుడిగానుండి గురుsకులవాసము జేయుచుండి ఒక యపరాధము వలన బ్రహ్మరాక్షస్సువగు మని గురువు వలన శాపము బొంది యిట్లు నాతో గలసియుండెను. మేమిద్దఱమును మీదయ వలన బవిత్రులమైతిమి. ఇట్లు మమ్మనుగ్రహించినారు గాన మీతీర్థయాత్రాఫలము సిద్దించినది.’ అని చెప్పి వారిరువురు వారిత్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దఱు ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను బొగడుచు యాత్రముగించుకొని యిండ్లకేగిరి. 

ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదలి యుత్తమగతిని జెందుదురని బ్రహ్మ నారదునకు జెప్పెను.’ అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ! ఇట్లు క్షీరాబ్ధివ్రతము జేసి తులసికథ విన్నవారుత్తములగుదురు.
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 క్షీరాబ్ధి ద్వాదశి దామోదర ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి మహత్వము 🌹* 
*ప్రసాద్‌ భరధ్వాజ*

*కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయితే ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి (చిలుక ద్వాదశి) అత్యంత పవిత్రమైంది. కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా జరుపుకుంటారు*

*కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజును క్షీరాబ్ధి ద్వాదశి అని పిలుస్తారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరమథనం ప్రారంభించినది ఈ రోజే. అందుకే ఈ రోజుకి మధన ద్వాదశి అని, అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలికారు కనుక చిలుక ద్వాదశి అని అంటారు. ఈ రోజునే దామోదర ద్వాదశి, యోగీశ్వరద్వాదశి అని కూడా అంటారు. ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తన యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అనే పేరు.*

*ఉత్థాన ఏకాదశి(నిన్న) నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ధి ద్వాదశి నాడు దీపములు వెలిగించి పూజలను జరపడం అనాదిగా వస్తున్న ఆచారం. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఈ రోజున తులసి మొక్క వద్ద శ్రీమహావిష్ణువు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు. అయితే ఉసిరి కొమ్మ కాకుండా, చిన్న కుండీల్లో ఉసిరి చెట్టును తెచ్చుకుని తులసి చెట్టు పక్కన వుంచి కలిపి పూజ చేసుకుంటే మంచిది. కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఉసిరి చెట్టు కొమ్మలను విరవడం, నరకడం వంటి పనులు చేయకూడదని శాస్త్రవచనం. క్షీరసాగర మధనములో జన్మించిన తేజోభరితమైన అమృతకలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవ దానవ సమక్షములో వివాహమాడుతాడు. అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆచరమును బట్టి శ్రీ మహాలక్ష్మికి, శ్రీమన్నారాయుణునికీ వివాహము చేసెదరు. బృందా దేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగి శ్రీమహావిష్ణువు సాలగ్రామ రూపమును ధరించినది ఈ మహోత్కృష్టమైన రోజే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment