🌹 22 NOVEMBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 22 NOVEMBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀
1) 🌹. కార్తిక పురాణం - 21 🌹
🌻. 21వ అధ్యాయము - పురంజయుడు కార్తీక ప్రభావం 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 575,576 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 575,576 - 4 🌹 
🌻 575, 576. 'మాధ్వీపానాలసా, మత్తా'- 4 / 575, 576. 'madhvipanalasa, matta' - 4 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కార్తిక పురాణం - 21 🌹*
*🌻. 21వ అధ్యాయము - పురంజయుడు కార్తీక ప్రభావం 🌻*
*ప్రసాద్ భరద్వాజ*

అలా యుద్ధానికి సిద్ధమైన పురంజయుడికి, కాంభోజాది భూపాలురకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రథికులు రథికుడితో, అశ్వసైనికుడు అశ్వసైనికుడితో, గజ సైనికుడు గజ సైనికుడితో, పదాతులు పదాతి దళాలతో, మల్లులు మల్లయుద్ధనిపుణులతో, ఖడ్గ, గద, బాణ, పరశు మొదలు ఆయుధాలు ధరించినవారు అవే ఆయుధాలు ధరించినవారితో ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నారు. ఒకరినొకరు ఢీకొంటూ.. హూంకరించుకుంటూ.. దిక్కులు దద్దరిల్లేలా సింహనాదాలు చేశారు. శూరత్వం, వీరత్వం ప్రదర్శించేందుకు భేరీ దుందుబులను వాయిస్తూ, శంఖాలను పూరిస్తూ, విజయకాంక్షతో పోరాడారు.

ఆ రణ భూమి అంతా ఎక్కడ చూసినా… విరిగిన రథాల గుట్టలు, తెగిపడిన మొండాలు, ఏనుగుల తొండాలు, సైనికుల తలలు, చేతులతో నిండిపోయింది. యుద్ధభూమిలో హాహాకారాలు, ఆక్రందనలు మిన్నంటాయి. పర్వాతాల్లా పడి ఉన్న ఏనుగులు, గుర్రాల కళేబరాల దృశ్యాలతో అతి గంభీరంగా, భయంకరంగా రణస్థలి కనిపించింది. యుద్ధవీరుల్ని వీరస్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పకవిమానంపై వచ్చిన దేవదూతలు అక్కడకు చేరుకున్నారు. సూర్యాస్తమయం వరకు యుద్ధం కొనసాగింది. కాంబోజాది భూపాలురకు చెందిన సైన్యం భారీగా నష్టపోయింది. అయినా.. మూడు అక్షౌహిణులున్న పురంజయుడి సైన్యాన్ని అతి నేర్పుతో ఓడించారు. పెద్ద సైన్యమున్నా… పురంజయుడికి అపజయం కలిగింది. దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేలైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో, సిగ్గుతో దు:ఖించుచుండెను.

ఆ సమయంలో వశిష్ట మహర్షి వచ్చి, పురంజయుడిని ఊరడించారు. ”రాజా! ఇంతకు ముందు ఒకసారి నీ వద్దకు వచ్చాను. నువ్వు ధర్మాన్ని తప్పావు. నీ దురాచారాలకు అంతులేదు. నిన్ను సన్మార్గంలో వెళ్లమని హెచ్చరించాను. అప్పుడు నా మాటల్ని వినలేదు. నీవు భగవంతుడిని సేవింపక అధర్మప్రవర్తుడవైనందునే… ఈ యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు. ఇప్పటికైనా నామాటలు విను. జయాపజయాలు దైవాదీనాలు. నీవు చింతతో కృంగిపోవడం మాని, శత్రురాజులను యుద్ధంలో జయించి, నీ రాజ్యం నీవు తిరిగి పొందాలని సంకల్పించు. ఇది కార్తీకమాసం. రేపు కృత్తికా నక్షత్ర యుక్తంగా పౌర్ణమి ఉంది. కాబట్టి స్నాన, జపాది నిత్యకర్మలు ఆచరించి, గుడికి వెళ్లి, దేవుడి సన్నిధిలో దీపారాధన చేయి. భగవన్నామ స్మరణంతో నాట్యం చేయి. ఇంట్లో అర్చించినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు… శ్రీమన్నారాయణుడిని సేవించడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై… నీ శత్రువులను దునిమాడేందుకు చక్రాయుధాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి… రేపు అలా చేసినట్లయితే… పోయిన నీ రాజ్యం తిరిగి పొందగలుగుతావు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసాలు చేయడం వల్లే ఈ అపజయం కలిగింది. శ్రీహరిని మదిలో తలచి, నేను చెప్పినట్లు చేయి…” అని ఉపదేశించాడు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే, ఏకవింశోద్యాయ సమాప్తం. ఇరవయొక్కటో రోజు పారాయణం సమాప్తం
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 575, 576 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam  - 575, 576 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 575, 576. 'మాధ్వీపానాలసా, మత్తా'- 4 🌻*

*స్వాధ్యాయము గతి తప్పకుండ కాపాడును. ఈ మూడు ఉపాయములు జీవుని మధురమగు భక్తియందు చేర్చగలవు. దైవీతత్వము నందుగల రుచి క్రమముగ వృద్ధి చెందుచు భక్తి అనురక్తిగ మారును. అట్టి అనురక్తియే దైవము నందలి ప్రేమ కారణముగ అనన్య భక్తి యేర్పడును. అపు డన్యభావము లేర్పడవు. గోపిక లట్టివారు. వారి ప్రార్థన లన్నియూ భ్రమర గీతికలే. అట్టి ఆత్మసమర్పణ బుద్ధితో హృదయములు నర్పించు విశేష భక్తులు హృదయముల నుండి పుట్టు భక్తిరసమును గ్రోలుటయందు శ్రీమాత అమితాసక్తితో యుండును. అట్టి మధువును గ్రోలి గ్రోలి మత్తెక్కి సోలిన కన్నులు గలదిగా గోచరించును. ఇట్టి మత్తు ఇతర పానీయముల నుండి లభింపదు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 575, 576 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 575, 576. 'madhvipanalasa, matta' - 4 🌻*

*Regular self-study (swadhyaya) ensures that one remains on the right path. These three practices—selfless living, study, and devotion—lead a soul toward pure and sweet devotion. Gradually, one's taste for the divine essence deepens, and devotion transforms into attachment (anurakti). This attachment, born out of love for the Divine, gives rise to ananya bhakti (exclusive devotion). At this stage, no other thoughts arise. Just like the Gopis of Vrindavan, whose prayers were like the hum of bees (bhramara geetikas), these devotees, with an attitude of complete surrender, offer their hearts to the Divine. The Mother Divine, with immense eagerness, relishes the bhakti rasa (nectar of devotion) that emerges from their hearts. As she drinks and relishes this nectar, her eyes appear intoxicated and dreamy, reflecting her blissful absorption. This intoxication cannot be attained from any worldly beverages.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube channel Facebook WhatsApp Channel 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
*Like, Subscribe and Share 👀*
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment