1) 🌹 శివ సూత్రాలు 1 - 13వ సూత్రం: ఇచ్ఛాశక్తి ఉమా కుమారి - యోగి సంకల్పం శివుని తేజో శక్తి. తేజస్సు అంటే ఉమ మరియు సంకల్పం అంటే కుమారి 🌹
2) 🌹 Shiva Sutras 1 - 13th Sutra. - Ichhaa Shakti Umaa Kumari. - The yogi's will is the radiant energy of Lord Shiva. Radiance is Umaa, and willpower is Kumari. 🌹
3) 🌹 शिव सूत्र -1 - 13वां सूत्र - इच्छा शक्ति उमा कुमारी. - योगी की इच्छा शक्ति भगवान शिव की तेजस्वी ऊर्जा है। तेजस्विता उमा है, और संकल्प शक्ति कुमारी है। 🌹
4) 🌹. కార్తిక పురాణం - 28 🌹
🌻. 28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 6 🌹
🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 6 / 577. 'Mātrkā Varṇarūpiṇī' - 6 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 శివ సూత్రాలు 1- 13వ సూత్రం: ఇచ్ఛాశక్తి ఉమా కుమారి - యోగి సంకల్పం శివుని తేజో శక్తి. తేజస్సు అంటే ఉమ మరియు సంకల్పం అంటే కుమారి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*శివ సూత్రాలు - శంభవోపాయలోని 13వ సూత్రం "ఇచ్ఛాశక్తి ఉమా కుమారి" లోని ఆధ్యాత్మిక సత్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనిలో ఇచ్ఛాశక్తి అనేది శివుని తేజోమయ శక్తిగా వివరించబడింది. ఈ సూత్రంలో ఉమ అనే పదం స్వతంత్ర శక్తిని, కుమారి నిర్మలమైన సంకల్ప శక్తిని సూచిస్తుంది. సాధారణ చైతన్య స్థితి నుండి యోగిగా మారడానికి మరియు అంతిమంగా శివ చైతన్యాన్ని సాధించడానికి కావలసిన ముఖ్యమైన అర్హతలను, ఆచరణాత్మక విధానాలను ఈ సూత్రం వివరిస్తుంది. త్రిక తత్వశాస్త్రంలో వివరించిన విధంగా శివునితో ఐక్యత సాధించే మార్గాన్ని ఈ సూత్ర వివరణ ద్వారా తెలుసుకోండి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Shiva Sutras -1 13th Sutra. - Ichhaa Shakti Umaa Kumari. - The yogi's will is the radiant energy of Lord Shiva. Radiance is Umaa, and willpower is Kumari. 🌹*
*Prasad Bhardwaj.*
*Explore the spiritual truths of the 13th Sutra, "Icchā Shakti Umā Kumārī", from Shiva Sutras - Shambhavopaya, in this video. Here, Icchā Shakti is described as the radiant energy of Lord Shiva. The term Umā signifies independent energy, while Kumārī represents pure willpower. This Sutra explains the essential qualities and practical methods needed to transition from an ordinary state of consciousness to becoming a yogi and ultimately attaining Shiva consciousness. Discover the path to unity with Shiva as described in Trika philosophy through this Sutra's insights.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 शिव सूत्र - भाग 1 - शम्भवोपाय. - 13वां सूत्र - इच्छा शक्ति उमा कुमारी. - योगी की इच्छा शक्ति भगवान शिव की तेजस्वी ऊर्जा है। तेजस्विता उमा है, और संकल्प शक्ति कुमारी है। 🌹*
*प्रसाद भारद्वाज.*
*शिव सूत्रों के शंभवोपाय में 13वें सूत्र "इच्छा शक्ति उमा कुमारी" के आध्यात्मिक सत्य को इस वीडियो में जानिए। यहां, इच्छा शक्ति को भगवान शिव की तेजोमय ऊर्जा के रूप में वर्णित किया गया है। उमा स्वतंत्र ऊर्जा को, जबकि कुमारी शुद्ध इच्छाशक्ति को दर्शाता है। यह सूत्र एक सामान्य चेतना अवस्था से योगी बनने और अंततः शिव चेतना प्राप्त करने के लिए आवश्यक गुणों और व्यावहारिक विधियों को समझाता है। त्रिक दर्शन के अनुसार शिव के साथ एकत्व प्राप्त करने के मार्ग को इस सूत्र की व्याख्या से जानें।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కార్తిక పురాణం - 28 🌹*
*🌻. 28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ 🌻*
*ప్రసాద్ భరధ్వాజ*
జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.
అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి "అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"మని అనేక విధాల ప్రార్ధఒచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,
"ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మన:పూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు, నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.
నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి
"ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు యెకమైకూడ - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.
ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.
ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో, బ్రాహ్మణాదుల యుందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను.
నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా యభిలాష. కాన, శరణుగోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నీకివే నా మన:పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను.
అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి "అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో, యెవరో పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసౌఖ్యములతోడ తులతూగుదురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 6 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*
*🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 6 🌻*
*మాతృకా వర్ణములు ఆమె నుండియే పుట్టును. నాదముగ జనించి శబ్దములుగ వ్యాప్తిచేయును. శబ్దముల నుండి వెలుగులు వ్యాప్తి యగును. అటుపైన రూపములుగ యేర్పడును. ఇట్లు శబ్దము, రంగు, రూపముగ సృష్టి నేర్పరచును. తత్సంబంధిత శక్తులు, సామర్థ్యములు కూడ పుట్టుచుండును. అక్షరములు అనగా 'అ' నుండి 'క్ష' వరకు కొనిరాబడినవి అని మరియొక అర్థము. దేవ భాషయైన సంస్కృతము నందు 'అ' మొదటి అక్షరము. 'క్ష' చివరి అక్షరము. అట్లు 'అ' నుండి 'క్ష' వరకు సృష్టి నిర్మాణము చేయు శ్రీమాత ఆ మొత్తము రూపముగ తానే యుండును. ఆమెయే అక్షరమాల. స్కందుని పుట్టించుటచే ఆమె మాతృక అయినది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 6 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini ॥116 ॥ 🌻*
*🌻 577. 'Mātrkā Varṇarūpiṇī' - 6 🌻*
*The Mātrkā Varṇas (letters) originate from her alone. They are born as Nāda (primordial sound) and expand into Śabdas (audible sounds). From these sounds, light spreads forth, and subsequently, forms emerge. In this way, creation is manifested through sound, color, and form, along with the associated powers and capabilities. Another interpretation of Akṣaras (letters) is that they extend from "A" to "Kṣa". In the divine language of Sanskrit, "A" is the first letter and "Kṣa" is the last. Thus, Śrī Māta creates the entire universe, spanning from "A" to "Kṣa", and she herself embodies this totality. She is the very garland of letters (Akṣaramālā). She is called Mātrkā because she gave birth to Skanda (Lord Kārttikeya).*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube channel Facebook WhatsApp Channel 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment