శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 5


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 5 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।
మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀

🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 5 🌻


అక్షరములు అనగా అక్ష + రములు అని కూడ పెద్దలు తెలుపుదురు. అనగా మూలమును అక్షముగ గొనువచ్చు శక్తి అని అర్థము. 'అ' అను పరతత్వమును మూలము లేక కేంద్రము లేక పరము నుండి అక్షముగ శ్రీమాత గొనివచ్చును. క్షరము కాని పరతత్వమును, అక్షముగా గొనివచ్చుచూ సృష్టి నిర్మాణము చేయును. ఆమె అక్షరి. ఇట్లు గొనివచ్చి ఏడు లోకముల సృష్టిని చేయును. కేంద్రము నుండి పరిధి వరకు లేక పరము నుండి పదార్థము వరకు సృష్టిని యేర్పరచు శ్రీమాతకు శబ్దములు, వర్ణములు, అర్థములు ఉపకరణములు. వానికి రూపము లేర్పరచునది కూడ ఆమెయే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 5 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini
madhvipanalasa matta matrukavarna rupini ॥116 ॥ 🌻

🌻 577. 'Mātr‌kā Varṇarūpiṇī' - 5 🌻


The term "Akṣaramulu" is explained by elders as "Akṣa + Ramulu". This means the power to manifest the source as something imperishable. The syllable "A" symbolizes the Supreme Principle (Paratattva) and represents the origin, center, or transcendence. From this Supreme Principle, Śrī Māta manifests creation in an imperishable form (Akṣa). She draws the eternal Supreme Principle into an accessible form and constructs creation. Thus, she is called Akṣarī. Through this manifestation, she creates the seven worlds, extending from the center to the periphery, or from the transcendental realm to the material realm. For Śrī Māta, sounds (śabdas), letters (varṇas), and meanings (arthas) serve as tools, and she herself gives form to them.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment