శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 578 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 578 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 578 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 578 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।
మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀

🌻 578. 'మహాకైలాస నిలయా' - 1 🌻


మహాకైలాసము నందుండునది శ్రీమాత అని అర్ధము. కైలాసము ఉత్తరము నందుండెడి శిఖరము. ఆర్యావర్తమునకు ఉత్తరమున, బ్రహ్మ మానస సరోవరమునకు కూడ ఉత్తరమున కైలాస శిఖర మున్నది. “శ్రీ చక్ర మేరువు" వలె లేక 'పిరమిడ్' వలే యేర్పడు శిఖరమును కైలాస మందురు. అచ్చట తత్త్వమొక్కటే యుండును. ఆ తత్త్వము యొక్క లాస్యముగ ఉత్తరము నుండి దిగువకు క్రమ పద్ధతిలో రూప మేర్పడును. ఇట్లు ఒకే తత్త్వము నుండి అనేకత్త్వ మేర్పడుటకు సూచనగ శ్రీచక్ర మేరువు నుండి శ్రీ చక్ర మేర్పడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 578 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata
mahaniya dayamurti rmahasamrajya shalini ॥117 ॥ 🌻

🌻 578. 'Mahakailasa Nilaya' - 1 🌻


The term "Mahakailasa Nilaya" means that Sri Mata resides in the great Kailasa. Kailasa is a peak located in the northern direction. It lies north of Aryavarta (ancient India) and even north of Brahma's Manasa Sarovara. Kailasa is a pyramid-shaped peak, resembling the structure of the "Sri Chakra Meru." It symbolizes the principle of oneness. This principle gradually manifests into form, descending from the north in an orderly manner. Similarly, from the singular principle, the multiplicity of creation emerges, as seen in the Sri Chakra evolving from the Sri Chakra Meru.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment