శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 579 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 579 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 579 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 579 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।
మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀
🌻 579. 'మృణాల మృదుదోర్లతా' - 1 🌻
తామర తూడువంటి మెత్తనైన భుజములు కలది శ్రీమాత అని అర్దము. తామరతూడు మెత్తనైన దారములతో సున్నితముగ నుండును. ముట్టుకుంటే కందిపోవు నట్లుండును. మృదువైన భుజములు స్త్రీకి సౌందర్య కారకములు. బలమైన భుజములు పురుషునికి సౌందర్య కారకములు. భుజ బలము శౌర్యమునకు చిహ్నము. సుకుమారమగు భుజములు సౌందర్యమునకు చిహ్నములు. శ్రీమాత ఎంత శక్తివంతురాలో అంత సౌందర్యరూపిణి కూడను. సౌందర్యము, శౌర్యము రెంటి యందును అత్యధికురాలైన శ్రీమాత రూపము మాత్రము సౌమ్యముగనే యుండును. లలితముగనే యుండును. భుజములు సుకుమారమైనంత మాత్రమున బలహీన అనుకొన రాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 579 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata
mahaniya dayamurti rmahasamrajya shalini ॥117 ॥ 🌻
🌻 579. 'Mrunala Mrududorlata' - 1 🌻
It means that Śrī Māta has shoulders as soft and delicate as lotus stalks. A lotus stalk is tender and smooth, exuding a subtle softness that seems as if it might disintegrate at the slightest touch. Gentle shoulders enhance the beauty of a woman, just as strong shoulders enhance the beauty of a man. The strength of shoulders is a symbol of valor, while delicate shoulders signify grace. Śrī Māta, despite being immensely powerful, is also supremely beautiful. She excels in both beauty and valor. Yet, her form remains serene and graceful, embodying a harmonious blend of these qualities. Delicate shoulders should not be mistaken for weakness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment