శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।
మహనీయా, దయామూర్తీ, మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀
🌻 582. 'మహాసామ్రాజ్యశాలినీ' - 2 🌻
ఎవ్వరికైననూ వారి అంగ బలము, ధనబలము, యశోబలము పెరుగుట వారియందలి నిగూఢమై యున్న శ్రీమాత శక్తి సామర్థ్యములే. తన నుండి వ్యాప్తి చెందుచున్న రాజ్యము, బలము, వైభవము శ్రీమాత అనుగ్రహమే అని భావింపవలెను గాని తనదిగా భావింపరాదు. చిన్న బీజము మహా వృక్షమై శాఖోప శాఖలతో విస్తరించుట బీజము గొప్పతనము గాదు. బీజమున అంతర్హితముగ నున్న అంకుర శక్తి. అది అనంతశక్తి. బీజము వాహికగ అంకుర శక్తి వ్యాప్తి చెందుచూ మహా వృక్షమై నిలచినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata
mahaniya dayamurti Mahasamrajya shalini ॥117 ॥ 🌻
🌻 582. 'Mahasamrajya shalini' - 2 🌻
For anyone, their physical strength, financial power, and fame are nothing but manifestations of the latent power and capabilities of Sri Mata within them. The spread of their dominion, strength, and splendor originates from the grace of Sri Mata. One must recognize that these are gifts from her and not assume them to be their own achievements. A small seed growing into a mighty tree with branches spreading far and wide is not due to the greatness of the seed itself but due to the latent germinating energy within it. That energy is infinite. The seed acts as a medium, and the germinating energy spreads to become a great tree.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment