శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।
మహనీయా, దయామూర్తీ, మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀

🌻 582. 'మహాసామ్రాజ్యశాలినీ' - 3 🌻


అట్లే ఎవరి నుండి ఎట్టి మహా కార్యములు జరిగిననూ వారు బీజప్రాయులే. అందుండి వికాసము చెందునది శ్రీమాత యొక్క ఇచ్ఛా జ్ఞాన శక్తులే. ఎవ్వరి కేమి కలిగిననూ, అవి అన్నియూ ఆమె సమకూర్చినవే. ఆమెయే 'దాయిని', అనగా ఇచ్చునది. రాజ్యదాయిని కూడ ఆమెయే. సామ్రాజ్యదాయిని కూడ ఆమెయే. ఆమె దయ లేక ఎవ్వరునూ ఏమియూ పొందలేరు. ఆమె దాయిత్వమూర్తి. దానము లిచ్చు చేయి మాత్రమే కాదు, ఆమె మూర్తి మొత్తము అట్టి దాయిత్వ గుణముతో ప్రకాశించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata
mahaniya dayamurti Mahasamrajya shalini ॥117 ॥ 🌻

🌻 582. 'Mahasamrajya shalini' - 3 🌻


Similarly, no matter what grand deeds are accomplished by anyone, they are merely like seeds. The expansion and realization come only through the will and knowledge energies of Sri Mata. Whatever anyone possesses is granted by her alone. She is the Bestower—the one who gives. She is also the Bestower of Kingdoms and the Bestower of Empires. Without her compassion, no one can attain anything. She is the embodiment of generosity. She is not just a hand that grants; her entire being radiates the quality of benevolence.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment