🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 583 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 583 - 4 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀
🌻 583. 'ఆత్మవిద్యా’ - 4 🌻
అట్టి వెలుగు అపరిమితము. అట్టి అపరిమితము, అప్రమేయము వెలుగు నందు తాను బిందువై (నామ మాత్రమై) గోచరించును. ఆ అపరిమితమగు చైతన్యమే శ్రీమాత. ఆమె యందలి ఒక బిందువే తానని తెలియును. ఈ మొత్తమును తెలియబరచుటకు తెలివి యుండవలెను గదా! అట్టి తెలివిగ శ్రీమాతయే యున్నది. తెలివికి మూలముగ కూడ ఆమెయే యున్నది. ఆమె నెఱిగినవాడు ఆత్మవంతుడు. ఆమె నెఱుగు ప్రయత్నము ఆత్మవిద్య. శ్రీమాతయే విద్యగ జీవులను తమ మూలమునకు చేర్చును. ఈ కారణముగ శ్రీమాత 'ఆత్మవిద్య' అని ప్రశంసింపబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 583 - 4 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻
🌻 583. 'Atma Vidya' - 4 🌻
This light is boundless and immeasurable. Within this limitless radiance, the individual perceives themselves as a tiny dot, a mere name or symbol. This infinite consciousness is Srimata. One comes to understand that they are but a single point within her infinite being. To comprehend this entirety, intelligence is essential. Srimata herself embodies this intelligence. She is also the ultimate source of all wisdom. One who realizes her becomes self-aware. The effort to know her is the essence of Atma Vidya (self-knowledge). Srimata, as the embodiment of knowledge, leads beings back to their true source. For this reason, she is glorified as Atma Vidya.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment