శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 587. 'శ్రీ షోడశాక్షరీ విద్యా' - 1 🌻


పదహారు అక్షరముల విద్యగా నుండునది శ్రీమాత అని అర్థము. ముందు శ్లోకములలో శ్రీమాత పంచదశిగా పేర్కొనబడినది. పదిహేను అక్షరములతో కూడిన విద్యగా పేర్కొనబడినది. ఈ పదిహేను అక్షరములకు ముందు శ్రీ అను అక్షరము చేర్చినపుడు పంచదశి షోడశి అగుచున్నది. శ్రీమాత పూర్ణకళలు పదహారు. అమావాస్య నుండి చతుర్దశి వరకు పదిహేను తిథులలో పదిహేను కళ లేర్పడును. ఏమీ లేనట్లున్న స్థితి నుండి పౌర్ణమి ప్రారంభము వరకు పదిహేను తిథులుగా ఆమె వ్యాప్తి చెందును. పదహారవ కళగా పౌర్ణమి తిథి వుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 587. 'Shree Shodashakshari Vidya' - 1 🌻


The term Śrī Mātā signifies the knowledge of sixteen syllables. In earlier verses, Śrī Mātā was referred to as Pañcadaśī, meaning the knowledge composed of fifteen syllables. When the syllable "Śrī" is prefixed to these fifteen syllables, Pañcadaśī becomes Ṣoḍaśī. Śrī Mātā is associated with sixteen complete Kalās (phases or aspects). From Amāvāsya (new moon) to Chaturdaśī (fourteenth lunar day), fifteen Kalās emerge. From a state of apparent nothingness to the beginning of Pūrṇimā (full moon), she expands through these fifteen lunar phases. The sixteenth Kalā is fully manifested on the full moon day (Pūrṇimā).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment