🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀
🌻 588. 'త్రికూటా' - 1 🌻
మూడు కూటములుగ నుండునది శ్రీమాత అని అర్థము. వాగ్భవ కూటము, మధ్య కూటము, శక్తి కూటములుగా తాను వ్యాప్తి చెందును. ప్రజ్ఞ, శక్తి, పదార్థముగ వ్యాప్తి చెందును. మహేశ్వరుడు, విష్ణువు, బ్రహ్మగ వ్యాప్తి చెందును. పార్వతి, లక్ష్మి, సరస్వతిగ వ్యాప్తి చెందును. సువర్లోకము, భువర్లోకము, భూలోకము, ఆదిత్యులుగను, సవితృలుగను, సూర్యులుగను యేర్పడునది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియలుగ యేర్పడునది. సృష్టి యంతయూ ఈ విధముగ మూడు కూటములుగ యేర్పడుచున్నది. అణువు నందు కూడ ధన సంజ్ఞ ఋణ సంజ్ఞగ, తటస్థ సంజ్ఞగా యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻
🌻 587. 'Trikuta' - 1 🌻
The meaning of Trikuta is that Sri Mata exists in three clusters (triads). She expands as Vāgbhava Koota, Madhya Koota, and Shakti Koota. She pervades intellect (Prajñā), power (Shakti), and matter (Padārtha). She manifests as Maheshwara (Shiva), Vishnu, and Brahma. She also expands as Parvati, Lakshmi, and Saraswati. She is present in the Suvarloka (heavenly realm), Bhuvarloka (intermediate realm), and Bhuloka (earthly realm). She manifests as Adityas (solar deities), Savitrs (radiant energies), and Suryas (suns). She embodies the three divine energies – Icchā (will), Jñāna (knowledge), and Kriyā (action). The entire creation is formed in this threefold manner. Even in an atom, there exist positive charge, negative charge, and a neutral state.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment