శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 588. 'త్రికూటా' - 3 🌻


మూడింటిని తెలియవచ్చును. నాలుగవది తెలియుట యుండదు. అందు కలియుట యుండును. మన యందు మన దేహముగను, మనముగను, మన యందలి దైవముగను శ్రీమాతే యున్నది. అన్నిటి యందును ప్రజ్ఞగను, శక్తిగను, పదార్థముగను యున్నది. ఇట్లు మూడుగ నున్ననూ మూడింటిని అతిక్రమించి కూడ యుండును. వాని యందు తానున్ననూ నిజమునకు తనయందే అవి యున్నవి. రహస్య మేమనగా తానే యున్నది. అవిగా నుండుట ఆమె మాయ. ఇదియే రాజ విద్యయని, రాజ గుహ్యమని శ్రీకృష్ణుడు పలికినాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 588. 'Trikuta' - 3 🌻

One can perceive the three, but the fourth remains unknown. However, it is present within everything. Within us, Śrīmāta exists as our body, mind (self), and the divine presence within us. She pervades everything as intellect (Prajñā), power (Shakti), and matter (Padārtha). Though she manifests in these three forms, she also transcends them. Even though they appear to exist within her, in reality, she alone exists. The secret is that she is the ultimate truth. The perception of these three as separate entities is merely her illusion (Māyā). This is what Śrī Krishna referred to as Rāja Vidyā (the supreme knowledge) and Rāja Guhya (the supreme secret).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment