🌹 కాలబైరవ అష్టమి.. చాలా శక్తిమంతమైన రోజు..! అనుకున్న కోరిక నెరవేరాలంటే ఇలా చేయండి..! 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Kalabhairava Ashtami.. A very powerful day..! Do this if you want your wish to come true..! 🌹
Prasad Bharadwaja
నవంబర్ 28.. అష్టమి.. శుక్రవారం.. కాలబైరవ అష్టమి.. ఇది చాలా విశేషమైన రోజు. జీవితంలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఈ సమస్య ఇక తీరదు, దీనికి పరిష్కారం లేదు, ఇది ఇక అవ్వదు అనే సమస్య లేదా కోరికా ఏదైనా ఉన్నా..
అలాంటివి అవ్వాలని మనసార కోరుకుంటూ ఇలా చేయండి. సంధ్యా సమయంలో శివాలయం లేదా కాలబైరవుడి ఆలయానికి వెళ్లాలి. బూడిద గుమ్మడి కాయను సగం చేయాలి.
దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. అందులో నల్ల నువ్వుల నూనె వేసి తోక మిరియాలు వేసి వత్తి వేసి దీపాన్ని వెలగించాలి. ఆ దీపం వద్ద కూర్చుని కాలబైరవ అష్టకాన్ని 8సార్లు జపం చేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతందని.. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి తప్పకుండా ఊరట దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
నవంబర్ 28.. కాలబైరవ అష్టమి.. చాలా శక్తిమంతమైన రోజు అని.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుందని పండితులు చెబుతున్నారు. అలాంటి ఈ రోజున మీరు ఏమనుకున్నా జరుగుతుందని వెల్లడించారు.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment