🌹 సౌందర్య లహరి 1 🌹*

*🌹 సౌందర్య లహరి 🌹*
*✍ మంత్రాల పూర్ణచంద్రరావు*
*1 వ భాగము*

గం గణపతయే నమః
ఓమ్ శ్రీ గురుభ్యోనమః
గురుఃబ్రహ్మ  గురుఃవిష్ణు - గురుఃదేవో మహేశ్వరః
గురుఃసాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువేనమః

శారదా శారదాంభోజ
వదనా వదనాంబుజే !
సర్వదా సర్వదాస్మాకం
సన్నిధిః సన్నిధిం క్రియాత్ ll

మాలా సుధాకుంభ విభోధముద్రా
విద్యా విరాజత్కర వారిజాతామ్
అపారకారుణ్య సుధాంబురాశిం
శ్రీ శారదాంబాం ప్రణతోస్మినిత్యం‌ ll

నమస్తే శారదా దేవీ
కాశ్మీరపురవాసిని !
త్వాం మహం ప్రార్ధయే నిత్యం
విద్యాదానం చ దేహి మే ll

సదాశివ సమారంభాం - శంకరాచార్య మధ్యమామ్ I
అస్మదాచార్యపర్యంతాం - వందే గురుపరంపరామ్II

శ్లోII 1.  శివశ్శక్త్యా  యుక్తో యది భవతి శక్తః  ప్రభవితుం
           న  చేదేవం దేవో న ఖలు కుశలః  స్పందితుమపి I
           అత స్త్వామారాధ్యాం  హరి హర విరించాదిభిరపి
           ప్రణంతుం స్తోతుం  వా కధ మక్రుతపుణ్యః  ప్రభవతిII

*తా;    అమ్మా నీ శక్తితో కూడినప్పుడే పరమ శివుడు అధినాయకుడు అగుచున్నాడు, అట్లు కాని నాడు ఆ దేవ దేవుడు  సమర్ధుడు కాదు. అందువలననే హరి హర బ్రహ్మాదులచే పొగడబడుచున్న నిన్ను పూజించుటకు గానీ పొగడుటకు గానీ పుణ్యము చేయనివాడు ఎట్లు సమర్ధుడు అగును.*

శ్లో II 2. తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవం
           విరించిః సంచిన్వన్ విరచయతి  లోకానవికలమ్I
           వాహ త్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
           హరః సంక్షుద్య్తెనం భజతి బసితోద్ధూళనవిధిమ్II

*తా;   అమ్మా ! బ్రహ్మ దేవుడు నీయొక్క పాదములందు కలిగి ఉన్న అణుమాత్రము అయిన ధూళినే గ్రహించి సకల లోకములను సృష్టి చేయుచున్నాడు, ఆ సూక్ష్మ కణమునే సహస్ర శిరములతో విష్ణు మూర్తి అతి కష్టముగా మోయు చున్నాడు,శివుడు దానినే భస్మము చేయుచూ భస్మధారణము చేయుచున్నాడు కదా !*

శ్లోII 3. అవిద్యానా మంత స్తిమిరమిహిరద్వీపనగరీl
          జడానాం చైతన్య స్తబకమకరందస్రుతిఝరీl
          దరిద్రాణాం చింతా మణిగుణనికా జన్మజలధౌ
         నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతిll

*తా ll అమ్మా !నీ చరణ పద్మ రేణువు అజ్ఞానము అను చీకటితో ఉన్న వానికి సూర్యోదయము జరుగు పట్టణము వంటిది, మంద బుద్ధులకు చైతన్యము అను పుష్పముల నుండి వెలువడిన మధుర ధార వంటిది,దరిద్రముతో ఉన్న వానికి చింతామణుల హారము వంటిదియు, సంసార సముద్రమున మునిగిన వానికి వరాహావతారము అగు  విష్ణు మూర్తి  యొక్క కోర వంటిది కదా !*
🌹 🌹 🌹 🌹 🌹
*🙏 ప్రసాద్*

No comments:

Post a Comment