🌹 *Power of positive thinking - పాజిటివ్ థింకింగ్ పవర్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు...*🌹
మనం చేయాల్సిన అన్ని పనులూ బాధ్యతగా, ఎవరికీ ఇబ్బందీ లేకుండా సకాలంలో పూర్తి చేసినప్పుడు లభించే సంతృప్తి ముందు ఏదీ సాటిరాదు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈరోజు చెయ్యాల్సిన పనులు సక్రమంగా పూర్తి చేశాను అనే ఫీలింగ్ ఒక్కటి చాలు, అలసిపోయి కంటి నిండా నిద్రపోవడానికి! వర్క్ పట్ల గౌరవం లేనప్పుడే టెన్షన్లు, ప్రెజర్, రకరకాల సైకలాజికల్ ఇష్యూస్ మొదలవుతాయి. మార్నింగ్ 4.30 నుండి రకరకాల పనుల మీద అలసిపోయి మూతలుబడుతున్న కళ్లతో రాసిన రైటప్ ఇది!
మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు.. బయటి ప్రపంచపు ఆలోచనలన్నీ ఒకటొకటిగా మాయమైపోయి.. శరీరం, జ్ఞానేంద్రియాలూ అన్నీ ఉనికిని కోల్పోయి.. ఓ ప్రత్యేకమైన స్థితి వస్తుంది. నిశ్చల స్థితి! అదంటే నాకు చాలా ఇష్టం. బయటకు రాబుద్ధి కాదు.
ఊగిసలాడే ఆలోచనలు, దానికి తగ్గట్లే ఉండే శ్వాస volume నుండి అసలు శ్వాస తీసుకుంటున్నామా లేదా అన్నది కూడా డౌట్‌గా ఉండే అలౌకిక స్థితి వరకూ ప్రయాణానికి పట్టేది నాకు ఐదు నిముషాలు మాత్రమే. ఆ స్థితిలోకి వెళ్లినప్పుడు ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటే తప్పించి ఏ ఆలోచనా రాదు. చుట్టూ మనుషులు, సమాజం, ఈ గొడవలు, మన అనవసరమైన ఎమోషన్స్ అన్నీ పక్కన పడేసి.. చివరకు మన శరీరాన్ని కూడా మర్చిపోయే స్థితిలో ఒకటే అన్పిస్తుంది.. "కాస్త పట్టించుకోవడం మానేస్తే మాయమయ్యే ఈ ప్రపంచం గురించి ఇంతగా ఆలోచించడం, ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం అవసరమా" అని!
మనమెంత, మన జ్ఞానమెంత, మన డబ్బెంత.. ఇవన్నీ ఆలోచనల్లోంచి తుడిచేస్తే క్షణాల్లో మాయమయ్యే టెంపరరీ థింగ్స్. ఇవన్నీ జీవితాంతం ఆలోచనల్లో మనం మోస్తున్నామంటే ఇగో పెరగక ఏమవుతుంది? కళ్లు మూసుకుంటే మాయమయ్యే ప్రపంచంలో నీ ఆరణ్య రోదనలు, ఆవేశాలూ ఏమాత్రం అర్థం పర్థం లేనివీ! నేను చాలాసార్లు నేను చేసిన పనులన్నీ అప్డేట్ చేస్తుంటాను. కానీ మరుక్షణమే నా మనస్సు వాటి నుండి డిటాచ్ అవుతుంది. అది నాకూ, నాతో క్లోజ్‌గా ఉండే కొంతమందికే తెలుసు. మనం అనుకుంటున్నట్లు ఇక్కడేమీ లేదు. ఓ ప్రవాహం మాత్రమే. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయే ఓ ఫ్లవర్ లాంటోళ్లం. బ్రతికున్నన్నాళ్లూ మంచిగా ఉంటూ సువాసనలు వెదజల్లి వెళ్లిపోవాలి తప్పించి ఇదే శాశ్వతం అనుకుంటే కష్టం. ధ్యానం, ఫిలాసాఫికల్ థాట్స్ నాకు నేర్పిన సత్యం అది!!
నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని తొందరగా బ్లాక్ చేసేయండి. లేదంటే వాళ్ళ నెగటివ్ కామెంట్స్ గురించి ఆలోచిస్తే బ్రెయిన్ పవర్ తగ్గుతుంది. అంతే కాకుండా మానసికంగా
కృంగిపోతారు . నెగటివ్ గా మాట్లాడే మనుషులతో స్నేహం చేయకూడదు. ఆరోగ్యానికి కూడా చేటు. పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల , మానసిక ప్రశాంతత దొరుకుతుంది, జీవితం ఆనందమయం
అవుతుంది. పాజిటివ్ గా ఆలోచించడం అలవడుతుంది. ప్రతి రోజు కాసేపు యోగా చేస్తే పాజిటివ్ ఆలోచన అలవడుతుంది.
పాజిటివ్ గా ఆలోచిస్తే ఉన్నత స్థాయికి వెళ్ళగలం. అదే నెగటివ్ గా ఆలోచిస్తే .. జీవితం నెగటివ్ గా మిగిలిపోతుంది.
🌹🌹🌹🌹🌹🌹
ధన్యవాదములు
🙏 ప్రసాద్
No comments:
Post a Comment