శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 163 / Sri Lalitha Chaitanya Vijnanam - 163


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 163 / Sri Lalitha Chaitanya Vijnanam - 163 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖



🌻163. ' మోహనాశినీ '🌻

జీవుల మోహము నాశనము చేయునది శ్రీదేవి అని అర్థము.

నేను, ఇతరము అను భావము ద్వైత బుద్ధి. ఇది యున్నంత కాలము అజ్ఞానముండును. ఇతరుల రూపమున ఉన్నది కూడ నేనే అను భావము అద్వైత బుద్ధి. అపుడే ప్రేమ అవగాహన కలుగును. అందరి యందున్నదీ శివ శక్తులే. శివము, సత్యము, శక్తి, చైతన్యము. వీని నుండి పుట్టినవాడే జీవుడు. అందరి మూలము ఒకటే. కావున జీవు లందరూ, ఒకే ఉదరము నుండి పుట్టినవారనీ, సహోదరులని జ్ఞానము తెలుపును. ఇట్టి జ్ఞానము కలగనంత కాలము మోహముండును.

సృష్టియందు మోహము సహజము. మోహము వలన దుఃఖము తప్పనిసరి యగును. దుఃఖమువలన జీవుడు విచారమున పడును. దుఃఖమును దాటుటకు ప్రయత్నించును. కానీ ద్వైత బుద్ధి యున్నంత కాలము దుఃఖముండును. ఈ సత్యము తెలియుటకు కొన్ని జన్మ పరంపరలు సాగును. అనుభవైక జ్ఞానమే జ్ఞానము కాని అధ్యయనము, శ్రవణము వలన జ్ఞానము జీవునియందు స్థితిగొనదు.

తెలిసినది ఆచరించినపుడే తత్ఫలముగ జ్ఞానముదయించును. శ్రీమాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారిని శ్రీమాతయే ఉద్దరించుకొనును. క్రమముగా జ్ఞానోదయము గావించును. జీవుని ఆర్తిని బట్టి ఉధారణ ఉండును. సురులైనను, అసురులైనను, మానవులైనను, ఆమె అనుగ్రహమునకు పాత్రులే. జ్ఞానమును ప్రసాదించుటకు శ్రీమాత రకరకములైన ఉపాయములను వినియోగించును.

ఎట్లైనను జీవుని ఉద్ధరించుటయే ఆమె లక్ష్యము. సామ దాన భేద దండోపాయములను జీవులపై ప్రయోగించుచు వారి ఉద్ధణకు తగు తోడ్పాటు గావించుచుండును. సృష్టియందు జీవులకు మోహము సహజము. మోహము దాట యత్నము చేయు జీవులకు శ్రీమాత ఆరాధనము శరణ్యము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 163 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Mohanāśinī मोहनाशिनी (163) 🌻

She destroys such confusions in the minds of Her devotees. When a devotee is without confusion, he moves forward in the spiritual path. Īśa upaniṣad (7) says, ‘ekatvam anu pashyataḥ’ which means seeing everywhere the same thing, the Brahman.

It was seen earlier that Śakthī alone is capable of taking one to the Brahman. When Śakthī, who is also called māyā moves away, leaving a person before the Brahman (Śiva) She enables him to realize the Brahman by himself. Self illuminating Brahman is realized only when illusion (māyā) is destroyed.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


29 Dec 2020

No comments:

Post a Comment