🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 20 🍀
నామ సంకీర్తన్ వైష్ణవాంచీ జోడీ!
పాపే అనంత్ కోడీ గేలీ త్యాంచీ!!
అనంత్ జన్మాంచే తప్ ఏక్ నామ్!
సర్వ మార్గ్ సుగమ్ హరిపార్!!
యోగ యాగ క్రియా ధర్మాధర్మ్ మాయా!
గేలేతే విలయా హరి పాఠీ!!
జ్ఞానదేవీ యజ్ఞ యాగ్ క్రియా ధర్మ్!
హరివిణ నేమ్ నాహీ దుజా!!
భావము:
వైష్ణవులకు నామ సంకీర్తన మూలధనము. నామ జపము చేసే వారి అనంత కోటి పాపాలు తొలిగి పోతాయి.
ఒక్క హరి నామ జపము అనంత జన్మల తపస్సుతో సమానము. హరి పాఠము అన్ని మార్గాలలో సుగమము. యోగ, యాగ, క్రియ, మరియ ధర్మాధర్మ మాయ, మోహము అన్నియు నామ సాధనతో పాఠకునిలో విలయమై పోతాయి.
యజ్ఞము, యాగము, క్రియలు, ధర్మాలు అన్నియూ నాకు హరినామమే. హరి నామము తప్ప ఇతర అన్య నేమములు ఏమియు లేవని జ్ఞానదేవులు తెలిపినారు.
🌻. నామ సుధ -20 🌻
నామ సుధా సంకీర్తనము
వైష్ణవులకు మూల ధనము
అనంత కోటి పాప సమూహము
అయిపోయినది అంతా మాయము
అనంత జన్మలు చేసిన తపము
సమానము ఒక్క హరినామము
సర్వ మార్గములలో సుగమము
హరిపాఠ నామ సంకీర్తనము
యోగ యాగ క్రియలు సర్వము
ధర్మాధర్మ మాయ మోహము
నామ సాధనతో అవును విలయము
హరి పాఠ మహిమ అమోఘము
జ్ఞానదేవునికి నామమే యజ్ఞము
యాగము క్రియ మరియు ధర్మము
అన్నియు నాకు హరినామము
హరిని విడిచి లేదు అన్యనేమము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
29 Dec 2020
No comments:
Post a Comment