దేవాపి మహర్షి బోధనలు - 63
🌹. దేవాపి మహర్షి బోధనలు - 63 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 44. సూచనలు-2 🌻
1. సద్గురువు బోధనలను త్రికరణ శుద్ధిగా ఆచరించువారు ముగ్గురు కలసినచో మహత్కార్యములను సాధింపవచ్చును. అట్టి కార్యమునకు పతనముండదు.
2. ప్రతి మనిషికిని హృదయము కలదు. కేవలము సత్కార్యముల తోనే దానిని స్పందింప చేయగలవు. భాషణము మాత్రమున ఎవనికిని లోతైన స్పందనము కలుగదు.
3. నిజమైన శక్తి సామర్థ్యములు ఇతరులతో కలిసి పని చేయునపుడు మాత్రమే తెలియనగును. స్వంతముగ పని చేయుటకన్న కలిసి పనిచేయుటకు ఎక్కువ సామర్థ్యము కావలెను. ఈ విషయమున నీవు సమర్థుడవో కావో నీకుగ నీవే ప్రయోగాత్మకముగ తెలుసుకొనుము.
4. మీ సంఘమున నూతన సభ్యులు ప్రవేశించినపుడు వారి యెడల నీ ప్రవర్తన మెట్లున్నదో గమనించుము. నీకు తెలిసిన విషయములు సానుభూతితో వారికి తెలుపుట నీ ప్రథమ కర్తవ్యము. వారి యందు ఉదాసీనుడవై యుండుట నీ అహంకారమునకు చిహ్నము.
5. పరహిత కార్యము వ్యాప్తి చెందుట సహజము. పనులు పెరుగుచున్నచో వాని నాచరించుచు నీవును పెరుగుము. వాని పెరుగుదలకు నీవు అడ్డుపడినచో నీవు తొలగింప బడుదువు. ఈ విషయమును గూర్చి ఆలోచింపుము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
28 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment