✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 46. విచక్షణ 🌻
సద్గురువు పై పూర్తిగ భారము వైచి కర్తవ్యము నిర్వర్తింపని వాడు భ్రష్టుడగును. అట్టివానికి స్వశక్తి తగ్గును. నీపై నీవాధారపడుట పెంచుకొనుచు అత్యవసర విషయములనే సద్గురువుకు నివేదించుట నీ పెరుగుదలకు తోడ్పడును. సద్గురువున్నాడు కదా! అను మితిమీరిన విశ్వాసముతో బాధ్యతలను మరచుట అవివేకము. దీని వలన సాధారణ బాధ్యతలు కూడ నిర్వర్తించలేని స్థితి కలుగును.
వేలు పట్టుకొని నడిపించుట ధీమంతులకు తగదు. నీకుగ నీవు నడువుము. కర్తవ్యములను, బాధ్యత లను నీకుగ నీవు మోయుము. కష్ట నష్టముల నోర్చుకొనుము. వేలు పట్టుకొని నడచువాడవు మహత్కార్యము లేమి చేయగలవు? ప్రతిదినము ప్రార్థన సమయమునందు నీకు వలసిన మానసిక సహాయము అందింపబడ గలదు. ధృతి గలిగి నీవే సమస్త బాధ్యతలను నిర్వర్తించుము.
తన సమస్యలను తను స్ఫూర్తివంతముగ పరిష్కరించుకొను వానికి సద్గురువు సహాయము కూడ వెన్నంటి యుండగలదు. అర్జునుడు స్వయముగ యుద్ధము చేసినాడు. శ్రీకృష్ణుడు తోడ్పడినాడు. మిక్కుటముగ గురువుపై నాధారపడు వాడు ఏమియును చేయజాలడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
01 Apr 2021
No comments:
Post a Comment