సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
🍀 60. చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా ।
పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా ॥ 60 ॥ 🍀
🌻 245. 'చక్రరాజనికేతనా' 🌻
శ్రీ చక్రరాజము నివాసముగా గలది శ్రీదేవి అని అర్థము. శ్రీ చక్రరాజము సృష్టి సంకేతము. అందు నాలుగు త్రికోణములు దిగువకును, ఐదు త్రికోణములు ఎగువకును వుండును. మొత్తము
తొమ్మిది త్రికోణములతో యుండునది శ్రీ చక్రము. మూల ప్రకృతితో కలిపి ప్రకృతి స్థానములు తొమ్మిది. కేంద్రమున బిందువుండును. అది శ్రీమాత ఉద్భవస్థానము.
పరతత్త్వమునుండి ఉద్భవించి మూల ప్రకృతియే త్రిగుణములను, పంచతత్త్వ సృష్టిని వ్యక్తపరచి వాని యందామె వసించు చుండును. ఆమె యందు పరతత్త్వము వశించి యుండును. పరతత్త్వము మూలధనముగ నవావరణ సృష్టి నిర్మాణము గావించి అందు పరుని (పరమశివుని)తో గూడివశించి యుండును. చరాచరమగు జగత్తు మొత్తము శ్రీమాత నివాస స్థానము.
రూపము లన్నియూ ఆమె నుండేర్పడునవే. స్థూలము, సూక్ష్మము సూక్ష్మతరము, సూక్ష్మతమము అగు రూపములన్నియూ ఆమె నుండేర్పడునవే. వెలుగు శబ్దముకూడ ఆమె రూపములే. తెలియబడున దంతయూ ఆమెయే. పరమశివుడు కూడా ఆమె రూపముననే తెలియబడును. మరియొక మార్గము లేదు. ఆమె శివరూపి మరియు విశ్వరూపి.
శివుని ప్రధాన రూపమామె. సృష్టి ఆమె విశ్వరూపము. నవతత్త్వము శ్రీదేవి. తొమ్మిది ఆమెను గూర్చిన అంకె. శాశ్వతముగ శివునితో కూడియుండును గనుక పది యగుచున్నది. పూర్ణత్వమునకు పది సంకేతము. అట్టి పూర్ణత్వమును కూడ ఆమెయే అనుగ్రహించును. ఆమె అనుగ్రహముననే శివ సాయుజ్యము కలుగును. పరమ శివునికి శ్రీదేవి నివాసము. శ్రీదేవికి నవావరణములతో కూడిన సృష్టి నివాసము. శ్రీ చక్రమును గూర్చి వివరణము తదుపరి నామములలో తెలియగలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 245 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Cakra-rāja-niketanā चक्र-राज-निकेतना (245)🌻
Śrī Cakra is known as Cakra rājam, the supreme of all cakra-s. She resides in this Śrī Cakra along with all Her ministers, warriors, etc.
The sahasrāra is often referred as Śrī Cakra. By activating the sahasrārā, one will be able to control his physical and mental activities. This is called siddhi and often bound to be misused causing the spiritual down fall.
The ministers and assistants, who are referred as yogini-s, mean different level of human consciousness. The point driven home in these nāma-s is that one has to bring the mind under his control to make significant progress in spirituality. This mind control automatically happens when kuṇḍalinī reaches sahasrāra.
Practicing meditation on full moon days will enable the kuṇḍalinī to ascend to sahasrāra with ease. Not even a single nāma in this Sahasranāma is without secretive interpretation. Such meanings are not discussed openly due to various reasons and continue to remain as hidden treasures.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
01 Apr 2021
No comments:
Post a Comment