1) 🌹 శ్రీమద్భగవద్గీత - 583 / Bhagavad-Gita - 582🌹
2) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 31🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 354, 355/ Vishnu Sahasranama Contemplation - 354, 355🌹
4) 🌹 Daily Wisdom - 91🌹
5) 🌹. వివేక చూడామణి - 54🌹
6) 🌹Viveka Chudamani - 54🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 65🌹
8) 🌹. జీవితం పట్ల నిర్ణయాత్మకంగా ఉండండి 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 245 / Sri Lalita Chaitanya Vijnanam - 245🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 583 / Bhagavad-Gita - 583 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 22 🌴*
22. ఆదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే |
అసత్ర్కుతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ||
🌷. తాత్పర్యం :
అపవిత్రత ప్రదేశమునందు తగని సమయమున అపాత్రులకు ఒసగబడునటువంటిది లేదా తగిన శ్రద్ధ మరియు గౌరవము లేకుండా ఒసగబడునటువంటిదైన దానము తమోగుణప్రధానమైనదని చెప్పబడును.
🌷. భాష్యము :
మత్తుపదార్థములను స్వీకరించు నిమిత్తముగాని, జూదము నిమిత్తముగాని చేయబడు దానములు ఇచ్చట ప్రోత్సాహింపబడుటలేదు.
అటువంటి దానము తమోగుణ ప్రధానమై లాభదాయకము కాకుండును. పైగా అటువంటి దానము చేయుటవలన పాపులను ప్రోత్సాహించినట్లే యగును.
అదే విధముగా పాత్రుడైనవానికి శ్రద్ధ మరియు గౌరవము లేకుండా దానమొసగుటయు తమోగుణమును కూడినట్టి దానముగా భావింపబడును
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 583 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 17 - The Divisions of Faith - 22 🌴*
22. adeśa-kāle yad dānam
apātrebhyaś ca dīyate
asat-kṛtam avajñātaṁ
tat tāmasam udāhṛtam
🌷 Translation :
And charity performed at an impure place, at an improper time, to unworthy persons, or without proper attention and respect is said to be in the mode of ignorance.
🌹 Purport :
Contributions for indulgence in intoxication and gambling are not encouraged here.
That sort of contribution is in the mode of ignorance. Such charity is not beneficial; rather, sinful persons are encouraged.
Similarly, if a person gives charity to a suitable person but without respect and without attention, that sort of charity is also said to be in the mode of darkness.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్గీత యథాతథం - 1 - 031 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 1, శ్లోకం 31
31
న చ శ్రేయో నుపశ్యామ్
హత్వా స్వజనమాహవే |
న కాంక్షే విజయం కృష్ణ
న చ రాజ్యం సుఖాని చ ||
తాత్పర్యము : ఓ కృష్ణా ! ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను చూడలేకున్నాను. తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంచింపలేకున్నాను.
భాష్యము :
జీవుడు తన స్వార్థగతి, శ్రేయస్సు విష్ణువు లేదా కృష్ణున్ని ప్రసన్నము చేసుకొనుట అని తెలియనపుడు భౌతికసంబంధాలలో ఆనందమునకు ప్రాకులాడును. అలా అంధకారంలో కూరుకునిపోయి తమకు భౌతికముగా కూడా ఏది ఆనందాన్ని సమకూర్చగలదో గుర్తంచలేకపోతారు. అలాగే ఇక్కడ అర్జునుడు కూడా తన కర్తవ్యాన్ని మరచిపోవుచున్నాడు. కృష్ణుని ఆజ్ఞ మేరకు యుద్ధములోసంహరింపబడిన వారందరూ కనీసము స్వర్గలోకానికి ప్రత్యేకించి తేజోవంతమైన సూర్యలోకానికీ వెళ్ళే అవకాశము ఉంటుంది. కానీ అర్జునుడు దీనిని కూడా గమనించక యుద్ధము వలన అందరినీ కోల్పోతానని దు:ఖమే మిగులుతుందని యుద్ధము చేయననే నిర్ణయానికి వచ్చుచున్నాడు. యుద్ధము చేయకపోతే, రాజ్యము లేక భిక్షాటన తప్పదు. కాబట్టి అర్జునుడు అడవికి వెళ్ళి ఏకాంతములో జీవితాన్ని వెళ్ళదీయుటే మంచిదని భావించెను.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 354, 355 / Vishnu Sahasranama Contemplation - 354, 355 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻354. గరుడధ్వజః, गरुडध्वजः, Garuḍadhvajaḥ🌻*
*ఓం గరుడధ్వజాయ నమః | ॐ गरुडध्वजाय नमः | OM Garuḍadhvajāya namaḥ*
గరుడాంకో ధ్వజో యస్య స ఏవ గరుడధ్వజః గరుడుడు అంకముగా లేకా గురుతుగా గల ధ్వజము ఈతనికి కలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 354🌹*
📚. Prasad Bharadwaj
*🌻354. Garuḍadhvajaḥ🌻*
*OM Garuḍadhvajāya namaḥ*
Garuḍāṃko dhvajo yasya sa eva garuḍadhvajaḥ / गरुडांको ध्वजो यस्य स एव गरुडध्वजः He whose flag bears the emblem of a Garuḍa.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
पद्मनाभोऽरविन्दाक्षः पद्मगर्भश्शरीरभृत् ।महर्धिरृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः ॥ ३८ ॥
పద్మనాభోఽరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్ ।మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ ౩౮ ॥
Padmanābho’ravindākṣaḥ padmagarbhaśśarīrabhr̥t ।Mahardhirr̥ddho vr̥ddhātmā mahākṣo garuḍadhvajaḥ ॥ 38 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 355 / Vishnu Sahasranama Contemplation - 355 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻355. అతులః, अतुलः, Atulaḥ🌻*
*ఓం అతులాయ నమః | ॐ अतुलाय नमः | OM Atulāya namaḥ*
తులా ఉపమానం అస్య న విద్యతే ఈతనికి తుల - ఉపమానము - ఈతనితో పోల్చదగినది ఏదియు లేదు. 'న తస్య ప్రతిమాఽస్తి యస్య నామ మహ దృశః' (శ్వేతా 4.19) 'ఎవని నామమే గొప్ప యశమో లేదా కీర్తియో అట్టి ఆ పరమాత్మునకు సాటియగునది ఏదియు ఉండదు గదా?' అను శ్రుతియు 'న త్వత్సమోస్త్యభ్యధికః కుతోఽన్యః' (గీతా 11.43) 'నీతో సమానుడే లేడు; నీ కంటె మిక్కిలి గొప్పవాడు ఎక్కడినుండి యుండును?' అను గీతావచనము ఇందు ప్రమాణములు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 355🌹*
📚. Prasad Bharadwaj
*🌻355. Atulaḥ🌻*
*OM Atulāya namaḥ*
Tulā upamānaṃ asya na vidyatē / तुला उपमानं अस्य न विद्यते There is no comparison, tulā, for Him. Hence Atulaḥ. vide the śruti 'Na tasya pratimā’sti yasya nāma maha dr̥iśaḥ' (śvētā 4.19) / 'न तस्य प्रतिमाऽस्ति यस्य नाम मह दृशः' (श्वेता ४.१९) Of Him there is no likeness, Whose Name and fame are great' and the smr̥iti 'Na tvatsamōstyabhyadhikaḥ kutō’nyaḥ' (Gītā 11.43) / 'न त्वत्समोस्त्यभ्यधिकः कुतोऽन्यः' (गीता ११.४३) There is non equal to Thee and how can there be another who excels Thee?'
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अतुलश्शरभो भीमस्समयज्ञो हविर्हरिः ।सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः ॥ ३९ ॥
అతులశ్శరభో భీమస్సమయజ్ఞో హవిర్హరిః ।సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః ॥ ౩౯ ॥
Atulaśśarabho bhīmassamayajño havirhariḥ ।Sarvalakṣaṇalakṣaṇyo lakṣmīvān samitiñjayaḥ ॥ 39 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 91 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 31. Objects are Inert, and it is the Subject that is Consciousness 🌻*
Being and consciousness go together; they cannot be separated. Our consciousness is tied to our body, so that whatever we know is limited to this little body. We cannot go beyond.
The consciousness of our ‘being’ is the same as consciousness of our body. There is nothing else in us. And the body is so limited, as we know very well. Hence, the expansion of ‘being’, or the dimension of our ‘being’, includes simultaneously consciousness, because ‘being’ and consciousness are one.
This is indicated by the other prayer: Tamaso ma jyotir gamaya: Lead me from darkness to light. This world is a world of darkness. It is not a world of light. The light that we see in this world is really a form of darkness, as we studied in an earlier portion of this Upanishad that all forms of life are forms of death only. They are not realities.
The sunlight is not real light, because it is not intelligent. It is another intelligence that is responsible for apprehending the value of even sunlight. Mere sunlight cannot understand, because it is an object outside. Objects are inert, and it is the subject that is consciousness. Any object that is bereft of a relationship with the subject is equivalent to darkness. It is lifeless.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 54 / Viveka Chudamani - 54🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 17. విముక్తి - 1 🍀*
193. జీవుడు తనను తాను శాశ్వతమైన ఆత్మగా భావిస్తుంటాడు. అట్లైన జీవాత్మకు విముక్తి ఎలా లభిస్తుంది. ఈ విషయాన్ని వివరించవలసినదిగా పరమ గురువులను కోరుచున్నాను.
194. గురువు సమాదానము చెప్పుచున్నాడు:- నీ ప్రశ్న సక్రమముగా ఉన్నది. జ్ఞానివైన నీవు శ్రద్దగా వినవలసినది. మాయ వలన ఏర్పడిన ఊహలు నిజమని నమ్మరాదు.
195. మాయకు ఆత్మకు ఎట్టి సంబంధము లేదు. ఆత్మ దేనికి బంధింపబడదు, ఏ పని చేయదు. దానికి ఏ ఆకారము లేదు. ఈ ప్రపంచముతో ఎట్టి సంబంధము లేదు. ఆకాశానికి నీలి రంగు ఉన్నట్లు మనం భావిస్తూ ఉంటాము. నిజానికి దానికి ఏ రంగు లేదు. మనస్సుకు మాత్రమే హద్దులున్నాయి. కాని పూర్ణాత్మకు ఎట్టి హద్దులు లేవు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 54 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 Liberation - 1 🌻*
193. Therefore the Jivahood of the soul also must have no end, and its transmigration must continue for ever. How then can there be Liberation for the soul ? Kindly enlighten me on this point, O revered Master.
194. The Teacher said: Thou hast rightly questioned, O learned man ! Listen therefore attentively: The imagination which has been conjured up by delusion can never be accepted as a fact.
195. But for delusion there can be no connection of the Self – which is unattached, beyond activity and formless – with the objective world, as in the case of blueness etc., with reference to the sky.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 65 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 46. విచక్షణ 🌻*
సద్గురువు పై పూర్తిగ భారము వైచి కర్తవ్యము నిర్వర్తింపని వాడు భ్రష్టుడగును. అట్టివానికి స్వశక్తి తగ్గును. నీపై నీవాధారపడుట పెంచుకొనుచు అత్యవసర విషయములనే సద్గురువుకు నివేదించుట నీ పెరుగుదలకు తోడ్పడును. సద్గురువున్నాడు కదా! అను మితిమీరిన విశ్వాసముతో బాధ్యతలను మరచుట అవివేకము. దీని వలన సాధారణ బాధ్యతలు కూడ నిర్వర్తించలేని స్థితి కలుగును.
వేలు పట్టుకొని నడిపించుట ధీమంతులకు తగదు. నీకుగ నీవు నడువుము. కర్తవ్యములను, బాధ్యత లను నీకుగ నీవు మోయుము. కష్ట నష్టముల నోర్చుకొనుము. వేలు పట్టుకొని నడచువాడవు మహత్కార్యము లేమి చేయగలవు? ప్రతిదినము ప్రార్థన సమయమునందు నీకు వలసిన మానసిక సహాయము అందింపబడ గలదు. ధృతి గలిగి నీవే సమస్త బాధ్యతలను నిర్వర్తించుము.
తన సమస్యలను తను స్ఫూర్తివంతముగ పరిష్కరించుకొను వానికి సద్గురువు సహాయము కూడ వెన్నంటి యుండగలదు. అర్జునుడు స్వయముగ యుద్ధము చేసినాడు. శ్రీకృష్ణుడు తోడ్పడినాడు. మిక్కుటముగ గురువుపై నాధారపడు వాడు ఏమియును చేయజాలడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. జీవితం పట్ల నిర్ణయాత్మకంగా ఉండండి 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్,
📚. ప్రసాద్ భరద్వాజ
40
మీ లోలోపల ఎదిగిన దానిని మీ నుంచి ఎవరూ దోచుకోలేరు. మనిషి జీవితం చాలా చిన్నది. కాబట్టి, దాని పట్ల చాలా నిర్ణయాత్మకంగా ఉండండి. మీరు మీ ఆత్మలో స్వేచ్ఛగా ఉండాలి. అదే అసలైన స్వేచ్ఛ.
మనిషి ఆత్మతో జన్మించాడు కానీ, వ్యక్తిత్వంతో జన్మించలేదు. ఆత్మకు (సోల్), వ్యక్తిత్వానికి (సెల్ఫ్) నిఘంటువులలో ఒకే అర్థం చెప్పడం జరిగింది. కానీ, అది నిజం కాదు. మీరు మీ ఆత్మను మీతో పాటు తెచ్చుకుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా సమాజం మీకు ఒక వ్యక్తిత్వాన్ని సృష్టిస్తుంది.
అందువల్ల మీకొక గుర్తింపు లేదని భావించ వలసిన అవసరం లేదు. ఎందుకంటే, ఆత్మాన్వేషణకు అనేక సంవత్సరాల తీర్థయాత్ర చెయ్యాల్సి వస్తుంది. అంతవరకు మీరు ‘‘ఒక ఊరు, పేరు లేని, ఎవరో ఏమిటో తెలియని బికారిలా, ఏమీ లేకుండా ఉండడాన్ని’’ ఏ మాత్రం భరించలేరు.
కేవలం ప్రేమ వల్లనే వ్యక్తిత్వాన్ని సృష్టించడం జరిగింది. అందుకే ఆది నుంచి మీరొక వ్యక్తిగా భావించడం ప్రారంభించారు. లేకపోతే, మీరెలా జీవిస్తారు? మిమ్మల్ని ఎలా సంబోధించాలి? వ్యక్తిత్వ భావనను సృష్టించిన వారందరూ సదభిప్రాయాలున్న వారే. ఎందుకంటే, వారి ఆత్మల గురించి వారికి ఏ మాత్రం తెలియదు. అందుకే వారు అవాస్తవ వ్యక్తిత్వాన్ని సృష్టించి అలాంటి వ్యక్తిత్వంతోనే మరణించారు. అందుకే ఈ అస్తిత్వం వారిని ఎందుకు అలా తయారు చేసిందో వారు ఎప్పటికీ తెలుసుకోలేక పోయారు.
మీ ఆత్మ ఈ అస్తిత్వంలో ఒక భాగం. మీ వ్యక్తిత్వం ఒక సామాజిక వ్యవస్థ. కాబట్టి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎప్పటికీ పూడ్చలేమని ముందుగా మీరు గుర్తుంచుకోవాలి. మీరెవరో నిజంగా తెలుసుకోవాలనుకుంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు సమూలంగా నాశనం చెయ్యాల్సిందే.
అలా కాకుండా, ఏదో యాదృచ్ఛికంగా మీరు ఆత్మను కనుక్కున్నట్లైతే మీరు విభజించ బడతారే కానీ, అస్తిత్వంతో ఏకమవలేరు. దానినే మానసిక వైకల్యమంటారు మనస్తత్వ శాస్తవ్రేత్తలు. అందువల్ల మీరు ఒక్కొక్కప్పుడు ఆత్మగానూ, ఒక్కొక్కప్పుడు వ్యక్తిత్వంగానూ ప్రవర్తిస్తారు. అలా విభజించ బడడం వల్ల మీరు నిరంతర ఒత్తిడిలో ఉంటారు. అందువల్ల మీ జీవితం చాలా ఆదుర్దాగా, బాధాకరంగా తయారవుతుంది. అలాంటి జీవితాన్ని మీరు ఎప్పటికీ జీవించలేరు, భరించలేరు.
అందుకే తల్లిదండ్రులు, విద్యావిధానం, పూజారులు- సమాజం- ఇలా మీ చుట్టూ ఉన్నవన్నీ మీరు మీ లోపల దాగి ఉన్న ఆత్మను ఎప్పటికీ తెలుసుకోకుండా ఉండేందుకు కావలసిన దృఢమైన వ్యక్తిత్వాన్ని సృష్టించేందుకు అన్ని రకాల మార్గాలలో ప్రయత్నిస్తారు.
ఆ ప్రయాణం ఏమంత దూరం కాకపోయినా, అది కచ్చితంగా చాలా ప్రయాసతో కూడుకున్న ప్రయాణమే. వ్యక్తిత్వమనేది చిన్న విషయం కాదు. అది చాలా క్లిష్టమైనది. మీరొక వైద్యుడు, న్యాయవాది, రాష్టప్రతి, ధనవంతులు, అందమైన వారు, అనుభవజ్ఞులు, తెలివైనవారు- ఇలా ఏదైనా కావచ్చు. అవన్నీ వ్యక్తిత్వ పార్శ్వాలే. అలాంటి వ్యక్తిత్వం అధిక ధనాన్ని, అధికారాన్ని, పరువు, ప్రతిష్టలను పోగుచేస్తూనే ఉంటుంది. దాని ఆశలకు అంతుండదు.
అలా మీరు మీ వ్యక్తిత్వానికి అనేక హంగులు తగిలిస్తూనే ఉంటారు. మనిషిని ముఖ్యంగా బాధపెట్టేది అదే. తానెవరో మనిషికి తెలియదు. అయినా ‘‘తాను ఇది, తాను అది’’ అని మనిషి నమ్ముతూనే ఉంటాడు. ఉదాహరణకు, మీరొక వైద్యుడు, న్యాయవాది, చెప్పులు కుట్టేవారు, ప్రధానమంత్రి, చివరికి రాష్టప్రతి అయినా అవి మీరు చేసే పనులే తప్ప మీ వాస్తవాలు కాదు.
ఎందుకంటే, ఎవరు ఎవరైనప్పటికీ వారికి వారి వాస్తవ స్వరూపాలు తెలియవు. మీరు పుట్టిన మరుక్షణం నుంచే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వారికి కావలసినట్లుగా తయారు చేయడం ప్రారంభిస్తారు. అలా అవాస్తవ అహం, అవాస్తవ వ్యక్తిత్వాలు మీలో ప్రవేశించి మిమ్మల్ని అలాగే తయారుచేస్తాయి. అందువల్ల మీరు మీ వాస్తవాన్ని మరచిపోవడం జరుగుతుంది.
మీ వ్యక్తిత్వాన్ని బానిసగా చెయ్యగలము కానీ, మీ ఆత్మను బానిసగా చెయ్యలేము. ఎందుకంటే, మీ వ్యక్తిత్వాన్ని అమ్మగలం కానీ, ఆత్మను అమ్మలేము. కాబట్టి, ఆధ్యాత్మికపరమైన స్వేచ్ఛను ఎవరూ ఏమీ చెయ్యలేరు.
ఇంకా వుంది...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
#ఓషోబోధనలు #OshoDiscourse
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 245 / Sri Lalitha Chaitanya Vijnanam - 245 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*🍀 60. చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా ।*
*పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా ॥ 60 ॥ 🍀*
*🌻 245. 'చక్రరాజనికేతనా' 🌻*
శ్రీ చక్రరాజము నివాసముగా గలది శ్రీదేవి అని అర్థము. శ్రీ చక్రరాజము సృష్టి సంకేతము. అందు నాలుగు త్రికోణములు దిగువకును, ఐదు త్రికోణములు ఎగువకును వుండును. మొత్తము
తొమ్మిది త్రికోణములతో యుండునది శ్రీ చక్రము. మూల ప్రకృతితో కలిపి ప్రకృతి స్థానములు తొమ్మిది. కేంద్రమున బిందువుండును. అది శ్రీమాత ఉద్భవస్థానము.
పరతత్త్వమునుండి ఉద్భవించి మూల ప్రకృతియే త్రిగుణములను, పంచతత్త్వ సృష్టిని వ్యక్తపరచి వాని యందామె వసించు చుండును. ఆమె యందు పరతత్త్వము వశించి యుండును. పరతత్త్వము మూలధనముగ నవావరణ సృష్టి నిర్మాణము గావించి అందు పరుని (పరమశివుని)తో గూడివశించి యుండును. చరాచరమగు జగత్తు మొత్తము శ్రీమాత నివాస స్థానము.
రూపము లన్నియూ ఆమె నుండేర్పడునవే. స్థూలము, సూక్ష్మము సూక్ష్మతరము, సూక్ష్మతమము అగు రూపములన్నియూ ఆమె నుండేర్పడునవే. వెలుగు శబ్దముకూడ ఆమె రూపములే. తెలియబడున దంతయూ ఆమెయే. పరమశివుడు కూడా ఆమె రూపముననే తెలియబడును. మరియొక మార్గము లేదు. ఆమె శివరూపి మరియు విశ్వరూపి.
శివుని ప్రధాన రూపమామె. సృష్టి ఆమె విశ్వరూపము. నవతత్త్వము శ్రీదేవి. తొమ్మిది ఆమెను గూర్చిన అంకె. శాశ్వతముగ శివునితో కూడియుండును గనుక పది యగుచున్నది. పూర్ణత్వమునకు పది సంకేతము. అట్టి పూర్ణత్వమును కూడ ఆమెయే అనుగ్రహించును. ఆమె అనుగ్రహముననే శివ సాయుజ్యము కలుగును. పరమ శివునికి శ్రీదేవి నివాసము. శ్రీదేవికి నవావరణములతో కూడిన సృష్టి నివాసము. శ్రీ చక్రమును గూర్చి వివరణము తదుపరి నామములలో తెలియగలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 245 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Cakra-rāja-niketanā चक्र-राज-निकेतना (245)🌻*
Śrī Cakra is known as Cakra rājam, the supreme of all cakra-s. She resides in this Śrī Cakra along with all Her ministers, warriors, etc.
The sahasrāra is often referred as Śrī Cakra. By activating the sahasrārā, one will be able to control his physical and mental activities. This is called siddhi and often bound to be misused causing the spiritual down fall.
The ministers and assistants, who are referred as yogini-s, mean different level of human consciousness. The point driven home in these nāma-s is that one has to bring the mind under his control to make significant progress in spirituality. This mind control automatically happens when kuṇḍalinī reaches sahasrāra.
Practicing meditation on full moon days will enable the kuṇḍalinī to ascend to sahasrāra with ease. Not even a single nāma in this Sahasranāma is without secretive interpretation. Such meanings are not discussed openly due to various reasons and continue to remain as hidden treasures.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment