2) 🌹. శివ మహా పురాణము - 379🌹
3) 🌹 Light On The Path - 128🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -7 🌹
5) 🌹 Seeds Of Consciousness - 326🌹
6) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 201🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 56 / Lalitha Sahasra Namavali - 56🌹
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 56 / Sri Vishnu Sahasranama - 56🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -179 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 21
*🍀 21 -1. హృదయ కేంద్రము - ఇంద్రియములకు గ్రహింప నలవికానిది, బుద్ధికి మాత్రమే తెలియదగినది, ఆద్యంతము సుఖము నిచ్చునది అగు నేనను వెలుగు నందు స్థితుడై ఏ మాత్రము చాంచల్యము లేక యోగి సుఖానుభూతిని తెలియుచున్నాడు. ఇంద్రియములచే పొందు సుఖానుభూతి తాత్కాలికము. అది సుఖము కలిగినట్లు భ్రమ కొలుపునే గాని, నిజమగు సుఖము నీయదు. తృప్తి నివ్వని సుఖము సుఖమే కాదు. జీవుని చిత్తము మనస్సు నుండి బాహ్యమును దర్శించ వచ్చును. దేహ పోషణమునకును, బాహ్య సౌందర్య అనుభూతికిని, తదానందమునకును జీవుడు మనస్సేంద్రియములను దైవమిచ్చిన సౌకర్యములుగ చూడవలెను. ఆ సౌకర్యము దుర్వినియోగము చేయరాదు. 🍀*
సుఖ మత్యంతికం యత్త ద్బుద్ధిగ్రాహ్య మతీంద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థిత శ్చలతి తత్త్వతః || 21
ఇంద్రియములకు గ్రహింప నలవికానిది, బుద్ధికి మాత్రమే తెలియదగినది, ఆద్యంతము సుఖము నిచ్చునది అగు నేనను వెలుగునందు స్థితుడై ఏ మాత్రము చాంచల్యము లేక యోగి సుఖానుభూతిని తెలియుచున్నాడు. ఇంద్రియములచే పొందు సుఖానుభూతి తాత్కాలికము. అదియును గాక సుఖము కలిగినట్లు భ్రమ కొలుపునేగాని, నిజ మగు సుఖము నీయదు.
ఉదాహరణకు రుచికరమగు వస్తువొకటి భుజించినపుడు తాత్కాలికముగ సుఖము నిచ్చును. కాని ఇంద్రియము ద్వారా మనస్సు ఆ వస్తువును పదే పదే కోరుచు నుండును. అట్లే కన్ను నుండి చూచినవి, చెవినుండి విన్నవి, ముట్టుకొన్నవి, వాసన చూసినవి మరల మరల జ్ఞప్తి చేయుచు, మరల మరల వానినే కోరుచు, వాని కొరకై జీవుని ఎడతెరిపి లేక త్రిప్పుచు నుండును.
తృప్తి నివ్వని సుఖము సుఖమే కాదు. తృప్తి కలిగినచో మరల కోరుట యుండదు కదా! కావున ఈ సుఖము తృప్తినీయక, తాత్కాలికముగ తృప్తి నిచ్చినట్లు భ్రాంతిని మాత్రమే కలిగించును. మరల మరల మనసు కోరుటకు కారణమిదియే. ఇంద్రియార్థముల వెంటబడుటకు జీవుడు మనస్సులోనికి దిగి, మనస్సునుండి ఇంద్రియములలోనికి మరింత దిగి, ఇంద్రియార్థముల వెనుక బాహ్యము లోనికి ఐదు దిశలుగ పరుగిడుతు అలసట చెంది మరణించుట జరుగును.
తృప్తి కలిగించని వాని వెంట, తృప్తి కలుగునని పరుగెత్తుట ఎంత అవివేకము! జీవుని చిత్తము మనస్సు నుండి బాహ్యమును దర్శించవచ్చును. దేహావ సరములను తీర్చుకొనవచ్చును. దేహపోషణము కూడ చేసుకొన వచ్చును. ఇవి యన్నియు వివేకముతో కూడి చేయు పనులు. వివేకము కోల్పోయిన జీవుడు మనస్సు నుండి కూడ దిగజారి పశువైపోవును.
అట్లని మనస్సను సౌకర్యమే లేనిచో, ఇంద్రియములే లేనిచో దేహ పోషణము జరుగదు. దేహ పోషణమునకును, బాహ్య సౌందర్య అనుభూతికిని, తదానందమునకును జీవుడు మనస్సేంద్రియములను దైవమిచ్చిన సౌకర్యములుగ చూడవలెను. ఆ సౌకర్యము దుర్వినియోగము చేయరాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 379🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 13
*🌻. పార్వతీ పరమేశ్వర సంవాదము - 2 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఆమె సాంఖ్య శాస్త్రాను సారముగా పలికిన ఈ మాటలను విని శివుడు వేదాంత సిద్ధాంతము నాశ్రయించి శివా దేవితో నిట్లు పలికెను (22).
శ్రీ శివుడు ఇట్లు పలికెను-
ఓ పార్వతీ! నీవు సాంఖ్య సిద్ధాంతమునను సరించి ఇట్లు పలుకుచుంటివా? ఓ అందమైన పలుకులు గలదానా! అట్లైనచో, నీవు ప్రతి దినము నా సేవను చేయుము. నాకు నిషేధము లేదు (23). నేను మాయా లేపము లేని వాడను, పరమేశ్వరుడను, వేదాంతములచే తెలియదగు పరబ్రహ్మను, మాయను వశము చేసుకున్నవాడను అయినచో, అపుడు నీవేమి చేయగలవు? (24)
బ్రహ్మ ఇట్లు పలికెను-
భక్తులను రంజింపజేసి, అనుగ్రహించు ఆ ప్రభుడు పార్వతితో నిట్లు పలికి, తరువాత హిమవంతునితో నిట్లనెను (25).
శివుడిట్లు పలికెను-
ఓ పర్వత రాజా! నేను ఇచట నీ ఈ అతి సుందర పీఠ భూమి యందు మహా తపస్సును చేసెదను. అనందఘనము, పరమతత్త్వము, సద్ఘనమునగు ఆత్మ స్వరూపమును దర్శించుచూ ఈ భూమి యందు సంచరించెదను (26). ఓ పర్వతరాజా! నేను ఇచట తపస్సును చేసుకొనుటకు అనుజ్ఞనిమ్ము అనుజ్ఞ లేకుండగా నీ ఈ స్థానమునందు ఏ విధమైన తపస్సునైననూ చేయుట సంభవము కాదు (27).
బ్రహ్మ ఇట్లు పలికెను-
దేవదేవుడు, త్రిశూలధారి యగు ఆ శివుని ఈ వచనమును విని, హిమవంతుడు శివునకు నమస్కరించి ఇట్లు పలికెను (28).
హిమవంతుడిట్లునెను-
దేవతలు, రాక్షసులు, మనుష్యులతో గూడిన జగత్తు అంతయూ నీదే. హే మహాదేవా! నేను అత్యల్పుడను. నీతో నేనేమి చెప్పగలను? (29)
బ్రహ్మఇట్లు పలికెను-
హిమవంతుడిట్లు పలుకగా, లోకములకు మంగళమునిచ్చే శంకరుడు నవ్వి హిమవంతునితో సాదరముగా 'నీవు వెళ్లుము' అని చెప్పెను (30). హిమవంతుడు శంకరుని అనుమతిని పొంది తన ఇంటికి వెళ్లెను. ఆయన ప్రతిదినము పార్వతితో గూడి శంకరుని దర్శించుచుండెను (31). భక్తి తత్పరురాలగు ఆ కాళి ప్రతి దినము తండ్రి రాకపోయిననూ, ఇద్దరు చెలికత్తెలతో గూడి సేవకొరకై శంకరుని సమీపమునకు వెళ్లుచుండెను (32). వత్సా! మహేశుని ఆజ్ఞను పాలించే పవిత్ర హృదయుడగు నందీశ్వరుడు, ఇతర గణములు శివుని ఆజ్ఞచే ఆమెను వారించలేదు (33).
జాగ్రత్తగా పరిశీలించినచో శివాశివుల మధ్య భేదమే లేదు. అట్టి వారిద్దరు క్రమముగా సాంఖ్యవేదాంత మతములననుసరించి చేసిన సుఖకరమగు సంవాదమును వివరించితిని. ఈ సంవాదము సర్వదా మంగళములను కలిగించును (34). జితేంద్రయుడగు శంకరుడు పర్వతరాజు నందు గల గౌరవముచే ఆతని మాట ప్రకారంగా ఆతని కుమార్తెను తన వద్దకు వచ్చుటకు అంగీకరించెను (35). జితేంద్రియుడగు శివుడిట్లు పలికెను. ఈ కాళి సఖరాండ్రిద్దరితోగూడి ప్రతిదినము నన్ను సేవించి వెళ్లవచ్చును. మరియు ఇచట నిర్భయముగా నుండవచ్చును (36). ఇట్లు పలికి, వికారములు లేనివాడు, మహాయోగీశ్వరుడు, అనేక లీలలను ప్రదర్శించువాడునగు శివ ప్రభుడుఆ దేవిని సేవకొరకై స్వీకరించెను (37).
ధీరులగు తపశ్శాలురకు విఘ్నములు వచ్చుచుండును. కాని అవి వారి తపస్సును భంగము చేయజాలవు. అదియే వారికి గల గొప్ప ఐశ్వర్యము (సామర్థ్యము) (38). ఓ మహర్షీ ! అపుడు పర్వతరాజు సేవకులతో గూడి తన పురమునకు మరలివచ్చెను. ఆతడు మనస్సులో గొప్ప ఆనందమును పొందెను (39). శివుడున్నూ విఘ్నముల పీడలేని తన మనస్సుతో ధ్యానయోగము నభ్యసించుచూ, ఆత్మ రూపమును ధ్యానించుచుండెను (40). కాళీ దేవి సఖురాండ్రిద్దరితో గూడి ప్రతిదినము అచటకు వచ్చి చంద్ర భూషణుడగు మహాదేవుని సేవించి మరలు చుండెను (41). ఆమె శంభుని పాదములను కడిగి ఆ పాదోదకమును త్రాగెడిది. మరిగించిన నీటిలో శుభ్రము చేయబడిన వస్త్రముతో శివుని శరీరమును తుడిచెడిది (42).
ఆమె ప్రతి దినము శివుని యథావిధిగా షోడశోపచారములతో పూజించి, మరల మరల నమస్కరించి తండ్రి గృహమునకు మరలుచుండెడిది (43).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 128 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 10 - THE Note on 20th RULE
*🌻 20. Seek it by testing all experiences - 4 🌻*
484. Suppose such persons did not exist; there would be no link between humanity and the Great Ones. They preserve a link, and in Their perfect purity They feel in Themselves the sufferings of others. This stage comes immediately before that of the Master; it is the last stage of the Arhat.
A Master cannot suffer pain, His consciousness is so perfect; He can image past experiences without suffering. The experience is to Him a perfect image, without pain. But in the advanced condition of the stage before that, though the man cannot sin, and the personality is pure, it yet transmits a sense of suffering.
485. In exoteric books this stage is sometimes confused with that of the Masters, and a feeling of suffering is attributed to Them. It is in the stage before that that there is suffering, where those in the stage of Arhatship are sharing the work of the Master, without having lost the susceptibility of feeling pain.
The Master transcends all suffering. The Arhats take part in building the “guardian wall”, but they build it with pain. People are apt to apply to the Master what is true of higher disciples only, who are still in a stage where sin is transcended, though the power to suffer is left.
486. At the lower level we may sympathize with friends until we lose all sense of difference, and we must suffer if we sympathize thus deeply. Until ahamkara is transcended sympathy and suffering must go hand in hand. If we go out of this stage too soon we lose our power of sympathy; that is one of the temptations on the Path.
Great Ones fall back even when they have reached the last stage, because if they lose suffering altogether, they lose sympathy, and if sympathy is not perfect, the wall of separateness is not thrown down.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 7 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : పవన్
📚. ప్రసాద్ భరద్వాజ
🌸. మహాపూర్ణవాణి 🌸
🌻. సాధనలో ఉన్న సాధకులు ముఖ్యంగా ఈ ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి. హృదయాన్ని పరమాత్మ సంకల్పానికి అభిముఖంగా ఉంచుకొన్నావా లేదా అని. 🌻
నీవు ఎంత జపం చేశావు అని చూడడు పరమాత్మ. ఎంత నామం చేశావు అని చూడడు- ఎలా చేశావు అని మాత్రమే చూస్తాడు.
నీ హృదయాన్ని పరమాత్మ సంకల్పానికి అభిముఖంగా ఉంచుకొని చేశావా లేదా అని మాత్రమే చూస్తాడు.
ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగినా, అది పరమాత్మ సంకల్పం వల్లే జరుగుతుంది.
మనం మంచి అనుకున్న దానికి విరుద్ధంగా జరిగినా, అది కూడా మన మనస్సు అందుకోలేని మరొక మంచికి ప్రాతిపదిక అన్న సత్యాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి.
పరమాత్మ సంకల్పాలు ఎప్పుడు ఎక్కడ ఎలా కార్యరూపంగా పరిణమిస్తాయో ఎవరూ గ్రహించలేరు.
పరమాత్మ సంకల్పాలు బాహ్యానికి సుఖదుఃఖ రూపములుగా పరిణమించనీ, అధర్మరూపంగా అనిపించనీ, నీవు ధర్మం అనుకుంటూ చేసే ప్రచారానికి ఆటంకరూపంగా ఉండనీ -జరిగిన ప్రతిదీ ఆయన సంకల్పమే అని గుర్తించి, నీ హృదయాన్ని దానికి అభిముఖంగా ఉంచుకో!
అయ్యో, భగవంతుడు ఇలా ఎందుకు చెయ్యాలీ అనీ, విఘ్నాలు ఎందుకు కలిగించాలి అనీ అనుకోబోకు!
అయితే నీ శక్తి మేరకు ఆ ఆటంకములను నివారించడానికి ప్రయత్నం చేయకుండా మాత్రం ఊరుకోబోకు! విసుగు లేకుండా, ప్రసన్నచిత్తంతో, నా బాధ్యత నేను చెయ్యాలి అనే భావంతో నీ యత్నం నువ్వు చెయ్యి.
కర్తృత్వం నీ మీద వేసుకోకుండా చెయ్యి. పరమాత్మ ఇచ్ఛయే నెరవేరాలి, పరమాత్మ ఇచ్ఛయే మనకు క్షేమం కలిగిస్తుంది, అనే భావంతో విశ్వాసంతో చెయ్యి.
నీ మనస్సును రాగద్వేషాలకు పాల్పడకుండా ఉంచుకొని ఇలా చేస్తే, నీవు తలపెట్టిన మంచిపని- క్రతువు-బాహ్యానికి చెడిపోయినట్టు కనిపించినా, నిర్విఘ్నంగా నెరవేరినట్టే. అందువల్ల పరమాత్మ సంతోషిస్తాడు.
అలాకాక, నీ మనస్సు రాగద్వేషాలకు పాల్పడితే, ఆ క్రతువు- మంచిపని- బాహ్యానికి ఎంత వైభవంగా జరిగినట్టు కనపడినా, అది చెడిపోయినట్టే.
కాబట్టి నీ మనస్సును పరమాత్మ సంకల్పాలకు అభిముఖంగా ఉంచుకొని చెయ్యి ఏమి చేసినా!
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకెసందేశములు
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 326 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 175. Prior to the appearance of form in the womb, the food stuffs take the form 'I am' and that appears in nine months.🌻*
As said earlier, the 'I am' is distributed everywhere in nature. The food stuffs that the food-body consumes also contain the 'I am' which moves on to the male or female gametes.
The process of conception is the perpetuation of the 'I am' in the fetus. From birth till the age of three or so the 'I am' remains dormant and then spontaneously surfaces. So it is the 'I am' that appears and disappears, which we take as birth and death.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 201 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. హల్ - ముకామ్ -అంతరానుభవము - 1 🌻*
743. హల్ అనుపదమునకు సాధారణ అర్థము అంతరానుభవము.
744. మొదటి భూమిక నుండి ఆరవ భూమిక వరకు 'హల్ ' ఆయా ఉనికికి సంబంధించి యుండును.
745. ఈ అంతరికానుభవము హర్షోన్మత్తతతో కూడి యుండును. ఈ హర్షోన్మత్తత స్వాధీన మందుడును. స్వాధీనములో లేక యుండును.
746. ప్రత్యేక అర్ధములో హల్, దివ్య హర్షోన్మత్తత, ఇది. అది నిలిచియున్న స్థానబలిమిని బట్టి తర తమ భేదములలో అనుభవింపబడు చుండును.
హాల్=భావము. ముకామ్=స్థానము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
🌹 Meher Baba అవతార్ మెహర్ బాబా 🌹
www.facebook.com/groups/avataarmeherbaba/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 56 / Sri Lalita Sahasranamavali - Meaning - 56 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 56. మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా ।*
*మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా ॥ 56 ॥🍀*
🍀 226. మహాతంత్రా -
గొప్పదైన తంత్ర స్వరూపిణి.
🍀 227. మహామంత్రా -
గొప్పదైన మంత్ర స్వరూపిణి.
🍀 228. మహాయంత్రా -
గొప్పదైన యంత్ర స్వరూపిణి.
🍀 229. మహాసనా -
గొప్పదైన ఆసనము గలది.
🍀 230. మహాయాగ క్రమారాధ్యా -
గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడునది.
🍀 231. మహాభైరవ పూజితా -
ఆదిత్య మండలంలో మధ్యనవుండే మహాభైరవుడు (నారాయణుడు) చేత పూజింపబడింది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 56 🌹*
📚. Prasad Bharadwaj
🌻*🌻 56. mahātantrā mahāmantrā mahāyantrā mahāsanā |*
*mahāyāga-kramārādhyā mahābhairava-pūjitā || 56 ||🌻*
🌻 226 ) Mahathanthra -
She who has the greatest Thantra sasthras
🌻 227 ) Mahamanthra -
She who has the greatest manthras
🌻 228 ) Mahayanthra -
She who has the greatest yanthras
🌻 229 ) Mahasana -
She who has the greatest seat
🌻 230 ) Maha yaga kramaradhya -
She who should be worshipped by performing great sacrifices( Bhavana yaga and Chidagni Kunda yaga)
🌻 231 ) Maha bhairava poojitha -
She who is being worshipped by the great Bhairava
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 56 / Sri Vishnu Sahasra Namavali - 56 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*🌻 56. అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః |*
*ఆనందోఽనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః ‖ 56 ‖ 🌻*
*చిత్త నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*
🍀 521) అజ: -
పుట్టుకలేనివాడు.
🍀 522) మహార్హ: -
విశేష పూజకు అర్హుడైనవాడు.
🍀 523) స్వాభావ్య: -
నిరంతరము స్వరూపజ్ఞానముతో విరాజిల్లువాడు.
🍀 524) జితమిత్ర: -
శత్రువులను జయించినవాడు.
🍀 525) ప్రమోదన: -
సదా ఆనందమునందుండువాడు.
🍀 526) ఆనంద: -
ఆనందమే తన స్వరూపముగా గలవాడు.
🍀 527) నందన: -
సర్వులకు ఆనందము నొసగువాడు.
🍀 528) నంద: -
విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు.
🍀 529) సత్యధర్మా -
సత్య, ధర్మ స్వరూపుడు.
🍀 530) త్రివిక్రమ: -
మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 56 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Chitta 4th Padam*
*🌻 56. ajō mahārhaḥ svābhāvyō jitāmitraḥ pramōdanaḥ |*
*ānandō nandanō nandaḥ satyadharmā trivikramaḥ || 56 || 🌻*
🌻 521. Ajaḥ:
'A' means Mahavishnu. So the word means one who is born of Vishnu i.e. Kama Deva.
🌻 522. Mahārhaḥ:
One who is fit for worship.
🌻 523. Svābhāvyaḥ:
Being eternally perfect He is naturally without a beginning.
🌻 524. Jitāmitraḥ:
One who has conquered the inner enemies like attachment, anger, etc. as also external enemies like Ravana, Kumbhakarna etc.
🌻 525. Pramōdanaḥ:
One who is always joyous as He is absorbed in immortal Bliss.
🌻 526. Ānandaḥ:
One whose form is Ananda or Bliss.
🌻 527. Nandanaḥ:
One who gives delight.
🌻 528. Nandaḥ:
One endowed with all perfections.
🌻 529. Satyadharmā:
One whose knowledge and other attributes are true.
🌻 530. Trivikramaḥ:
One whose three strides covered the whole world.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment