వివేక చూడామణి - 109 / Viveka Chudamani - 109


🌹. వివేక చూడామణి - 109 / Viveka Chudamani - 109🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 24. సమాధి స్థితి - 5 🍀


365. నిర్వికల్ప సమాధి స్థితి వలన బ్రహ్మ జ్ఞానము యొక్క సత్యము ఖచ్చితముగా తెలుసుకొనవచ్చు. ఇంకొక మార్గమేమిలేదు. అలా కాకుండా మనస్సు యొక్క స్వభావము అస్థిరమగుటచే అది ఎల్లప్పుడు ఇతర భావనలలో నిమగ్నమై ఉంటుంది.

366. అందువలన మనస్సును స్థిరపర్చి, ఇంద్రియాలను అదుపులో ఉంచి, దానిని సత్యమైన ఆత్మ స్థితిలో నిమగ్నము చేయాలి. అపుడు ఆత్మను గ్రహించి ఆ సత్యముతో మాయ ద్వారా సృష్టించబడిన మాలిన్యమును ద్వంసము చేయును.

367. యోగా యొక్క మొదటి అడుగులు:- వాక్‌ను అదుపులో ఉంచాలి, బహుమతులను స్వీకరించరాదు, ఏవిధమైన కోరికలకు అవకాశము ఇవ్వరాదు, కర్మల నుండి స్వేచ్ఛను పొందాలి, ఎల్లప్పుడు విశ్రాంతి ప్రదేశములో జీవించాలి.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 109 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj


🌻 24. Samadhi State - 5 🌻


365. By the Nirvikalpa Samadhi the truth of Brahman is clearly and definitely realised, but not otherwise, for then the mind, being unstable by nature, is apt to be mixed up with other perceptions.

366. Hence with the mind calm and the senses controlled always drown the mind in the Supreme Self that is within, and through the realisation of thy identity with that Reality destroy the darkness created by Nescience, which is without beginning.

367. The first steps to Yoga are control of speech, non-receiving of gifts, entertaining of no expectations, freedom from activity, and always living in a retired place.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం

Join and Share

🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹

www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam


29 Jul 2021

No comments:

Post a Comment