గీతోపనిషత్తు -244
🌹. గీతోపనిషత్తు -244 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 23
🍀 22. కాల స్వరూపము 🍀
యత్ర కాలే త్వనావృత్తి మావృత్తించైవ యోగినః |
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరత్నభ || 23
తాత్పర్యము : భరత శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఏ కాలము నందు దేహము త్యజించిన యోగులు మరల తిరిగిరారో, అట్లే ఏ కాలమునందు మరణించిన యోగులు మరల తిరిగి వత్తురో వివరించెదను- శ్రద్ధగ వినుము.
వివరణము : భగవానుడు అపునరావృత్తి, పునరావృత్తి మార్గములలో వాని లక్షణములను ఈ తరువాతి శ్లోకములలో వివరించుచున్నాడు. ఈ కాలస్వరూపము నెరుగుట జిజ్ఞాసువులకు అవసరమై యున్నది. ఏ ఏ సమయములందు ప్రజ్ఞ సహజముగ వికాసము చెందుచు ఊర్ధ్వగతి చెందునో, ఏ యే సమయముల యందు వికాసమున కవరోధము కలుగునో తెలుయుట వలన జిజ్ఞాసువులు యుక్తి యుక్తముగ సాధనను కొనసాగించుకొన వచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment