శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 299 / Sri Lalitha Chaitanya Vijnanam - 299


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 299 / Sri Lalitha Chaitanya Vijnanam - 299 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀

🌻 299. 'నాదరూపా' 🌻

నాదరూపము గలది శ్రీదేవి అని అర్థము. సృష్టి సంకల్పింప బడినపుడు ఆ సంకల్పము నాదరూపముగ వ్యక్తమగును. నాదమే తత్త్వమునకు మొదటి శరీరముగ వేదములు కీర్తించుచున్నవి. నాదమున్నంత వరకు సృష్టి యుండును. నాదము నిష్క్రమించిన సృష్టి తిరోధానము చెందును. నాదమే ప్రాణము; నాదమే తెలివి, నాదమే ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులుగ ప్రకటిత మగును. నాద మాధారముగనే సమస్త లోకము లేర్పడి గుత్తిగ కలిసియున్నవి. దైవము నాద స్వరూపము. జీవులును నాద స్వరూపులే. సృష్టికూడ నాద స్వరూపమే.

నాదము కాని దేమియూ లేదు. తత్త్వము నుండి వెలువడిన నాదము అవరోహణ క్రమమున వాక్కై దిగివచ్చును. సృష్టి కాధారమైన ఈ నాద రూపమే పరదేవతయైన శ్రీమాత ప్రథమ రూపము. పరమ శివుని గూడ నాద తనువు గలిగినవాడని ఋషులు కీర్తించిరి. ఈ నాద మొక ఝంకారమువలెనూ, ఓంకారమువలెనూ మనయందు నిత్యము జరుగుచున్నది. అది ఆధారముగనే మన ప్రాణము, తెలివి, మనస్సు, ఇంద్రియములు, శరీరము పనిచేయు చున్నవి.

మన ముండుట యనగా నాద ముండుటయే. నాదము ననుసరించి దేహమును స్వచ్ఛందముగా వీడుట, మరల దేహమందు ప్రవేశించుట "అక్షర పరబ్రహ్మ యోగము” నందు శ్రీకృష్ణుడు బోధించి నాడు. నాదమును అనుస్మరణ చేయుట వలన ఇది సిద్ధించునని తెలిపినాడు.

అవరోహణమునకు, ఆరోహణమునకు నాదమే ఆధారము. సృష్టి మొత్తము నాదమను దారమున కెక్కించిన పూసలగుత్తి వంటిది. దారము ఊడినచో పూసలు రాలినట్లు, నాదమాగినచో సృష్టి నాటక మదృశ్యమగును. శ్రీకృష్ణుని గానము నాదగానమే. అతడు

ఆ గానము ద్వారా జీవులయందలి నాదమును మేల్కొలిపి తనలోనికి ఆకర్షించెడివాడు. అట్టి సమయమున పశుపక్ష్యాదులతో సహా మొత్తము ప్రకృతి తన్మయత్వము చెందెడిది. ఇక మానవుల మాట చెప్పనేల?

శ్రీదేవిని నాదరూపగ ఉపాసించుట మహత్తరమగు యోగము. నాదోపాసనమున సర్వసిద్ధి కలుగును. అది శ్రీమాత అనుగ్రహముగ సాగవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 299 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |
hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀

🌻 299. Nāda-rūpā नाद-रूपा (299) 🌻


She is in the form of sound. Varivasyā Rahasya, the text that explains Pañcadaśi mantra (I.12 and 13) says, “The form of hrīṃ (ह्रीं) is composed of twelve letters: vyoman (h), agni (r), vāmalocanā (ī), bindu (ṃ), ardhacandra, rodhinī, nāda, nādānta, śaktī, vyāpikā, samanā and unmanī.” The aggregate of the last eight is known as nāda. Out of the last eight, the subtlest is unmanī and they are placed above the bindu (dot).

{Further reading on sound: The supreme divine energy is called Parā-Śaktī. Parā-Śaktī is the divine Mother and naturally has concern for the universe. In the state of parā (nāma 366), Śaktī is in the initial stage of manifestation. The next higher stage of parā is paśyantī (nāma 368) where there are questions and answers. Questions and answers leads to knowledge. In stage of paśyantī, there exists no difference between the word and the object of reference. The next stage is madhyamā (nāma 370) where the difference begins to arise between the word and the object of reference, but only in the levels of antaḥkaraṇa.

In other words, the difference between the paśyantī and madhyamā is only subtle and not reflected at the gross level (meaning delivery of speech). In the last and final stage called vaikharī (nāma 371), the difference becomes gross and the sound is deciphered. But it should be understood that Parā-Śaktī Herself does not undergo these changes, but such changes happen at Her command in the inward psychic apparatus of an individual.

She is known by these names during the different stages of evolution of speech. These stages are discussed in the subsequent nāma-s. The transition between madhyamā and vaikharī contains eight stages and the third stage is called nāda and their samaṣṭi (aggregate) is also known as nāda. In general this nāma says that She is in the form of sound. She is Śabda Brahman. Further details are discussed in the respective nāma-s.}

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం

Join and Share

🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹

https://t.me/srilalithachaitanyavijnanam

http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


10 Aug 2021

No comments:

Post a Comment