11-AUGUST-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 238 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 439🌹 
3) 🌹 వివేక చూడామణి - 114 / Viveka Chudamani - 114🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -66🌹  
5) 🌹 Osho Daily Meditations - 55🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 114🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -238 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 19-1
 
*🍀 18-1. నిద్ర - మెలకువ - ప్రాణి సమూహము లన్నియు కూడ పరాధీనమై పగటి యందు మేల్కొని, వర్తించి మరల పరాధీనమై రాత్రియందు నిదురలోనికి చనుచున్నవి. ప్రతి మెలకువ మరియొక నిద్రవరకే. ప్రతి జననము రాబోవు మరణము వరకే. మేల్కాంచుట యనగా అవ్యక్తము నుండి వ్యక్తము లోనికి వచ్చుట. నిద్రించుట యనగా వ్యక్తము నుండి అవ్యక్తము లోనికి చనుట. వ్యక్తము నందు జ్ఞానము కలుగుట, అవ్యక్తమున జ్ఞానము కోల్పోవుట, మరల వ్యక్తమున జ్ఞానము కలుగుట అనంతముగ జరుగుచున్నది. 🍀*

భూత గ్రామ స్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే2 వశః పార్థ ప్రభవ త్యహరాగమే || 19

తాత్పర్యము : ప్రాణి సమూహము లన్నియు కూడ పరాధీనమై పగటి యందు మేల్కొని, వర్తించి మరల పరాధీనమై రాత్రియందు నిదురలోనికి చనుచున్నవి. బ్రహ్మపగలు యందు కూడ ప్రాణి సమూహము అట్లే అవశులై పుట్టుచు చచ్చుచు, మరల పుట్టుచు జీవించి బ్రహ్మరాత్రి యందు లయమందు చున్నది. 

వివరణము : బ్రహ్మపగలు, బ్రహ్మరాత్రి సుదీర్ఘ కాల పరిమాణము. అందు బ్రహ్మపగలు యందు జీవులు లక్షలాది జన్మలెత్తుచు నుందురు. అందు మానవులు కలియుగమున వంద సంవత్సరముల ఆయుఃపరిమాణము గలవారు. వారు పుట్టి, పెరిగి, జీవించి, మరల చనిపోవుచు యుందురు. ఈ మానవ జన్మ పరిమాణము వంద సంవత్సరములు. 

జన్మించి మరణించు లోపల అనేకమార్లు నిద్రలోనికి చనుట, మరల మెలకువలోనికి వచ్చుట జరుగుచుండును. ప్రతి మెలకువ మరియొక నిద్రవరకే. ప్రతి జననము రాబోవు మరణము వరకే. ప్రతి బ్రహ్మపగలు, బ్రహ్మరాత్రి వరకే. అట్లే ప్రతి సృష్టి మరల లయము వరకు. లయము చెందిన సృష్టి మరల పుట్టును. బ్రహ్మరాత్రికి మరల పగలేర్పడును. ప్రతి మరణించిన జీవికి మరల పుట్టుక ఏర్పడును. నిద్రించిన ప్రతి జీవి మరల మేల్కాంచును. కాల పరిమాణము చిన్నదియైనను పెద్దదియైనను, మేల్కాంచుట నిద్రించుట గోచరించుచునే యున్నది. 

మేల్కాంచుట యనగా అవ్యక్తము నుండి వ్యక్తము లోనికి వచ్చుట. నిద్రించుట యనగా వ్యక్తము నుండి అవ్యక్తము లోనికి చనుట. వ్యక్తము నందు జ్ఞానము కలుగుట, అవ్యక్తమున జ్ఞానము కోల్పోవుట, మరల వ్యక్తమున జ్ఞానము కలుగుట జీవులకు ఒక దినమునందు, ఒక జనన మరణమందు, ఒక బ్రహ్మ పగలు రాత్రియందు, ఒక సృష్టి ఆరంభ అంతము లందు అనంతముగ జరుగుచున్నది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 437🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 27

*🌻. బ్రహ్మచారి శివుని నిందించుట - 4 🌻*

బ్రాహ్మణుడిట్లు పలికెను-

ఆయన వద్ద ధనమున్నచో దిగంబరుడై ఉండనేల? ఎద్దు ఆయనకు వాహనము. ఆయన వద్ద సామగ్రి ఏమియూ లేదు (31). వరులయందలి ఏయే గుణములు స్త్రీలకు సుఖమునిచ్చునవి చెప్పబడినవో, వాటిలో ఒక్క గుణమైననూ ఆ ముక్కంటి యందు లేదు (32). నీకు అప్తుడగు మన్మథుని ఆ హరుడు దహించివేసినాడు. మరియు ఆయన చూపిన అనాదరమును నీవు ఎరుగుదువు. ఆయన నిన్ను విడిచి ఎక్కడికో వెళ్లినాడు (33).

ఆయనకు జాతిగాని, విద్యగాని జ్ఞానముగాని ఉన్నట్లు కానరాదు. ఆయనకు పిశాచములు తోడు కంఠములో విషము స్పష్టముగా కనబడుచుండును (34). ఆయన సర్వదా ఒంటరిగా నుండును. ఆయన నిత్యవైరాగ్యము దృఢముగా గలవాడు. కావున నీవు శివుని మనస్సులో కోరుకొనుట ఎంతయూ తగని విషయము (35) నీ హారమెక్కడ; ఆయన యొక్క నరకపాలములమాల యెక్కడ? నీ దివ్యమగు శరీరలేపనమెక్కడ? ఆయన శరీరమందలి చితాభస్మము ఎక్కడ? (36) 

ఓ దేవీ! నీకు శివునకు రూపము మొదలగు వాటియందు సర్వమునందు విరోధము గలదు. కావున నాకీ వివాహము నచ్చుబాటు అగుటలేదు. నీకు తోచినట్లు చేయుము(37). నీవు ఈ సృష్టిలోని చెడు వస్తువుల నన్నిటినీ పొందగోరుచున్నావు. మనస్సును శివునినుండి మళ్ళించుము. లేనిచో, నీకు తోచినట్లు చేసుకొనుము(38) 

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ భ్రాహ్మణుని ఈ మాటలను విని మనస్సులో క్రోధమును పొందిన పార్వతి శివుని నిందించుటలో ఉత్సాహముగల బ్రాహ్మణునితో నిట్లనెను (39)

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో బ్రహ్మచారి మోసపు మాటలను వర్ణించే ఇరువది ఏడవ అద్యాయము ముగిసినది (27).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 114 / Viveka Chudamani - 114🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 1 🍀*

380. బుద్దిని స్థిరముగా ఆత్మపై ఉంచినప్పుడు అది శాశ్వతముగా ప్రకాశమును వెదజల్లుతూ స్వయం ప్రకాశమైన సాక్షిగా అన్నింటిని దర్శిస్తుంది. ఈ ఆత్మ అసత్య వస్తు సముదాయము కంటే వేరుగా ఉంటూ, లక్ష్యమును చేరుటకు ఆత్మపై ధ్యానము చేయుము. ఇతర ఆలోచనలను వదలివేయుము. 

381. నిరంతరముగా ఆత్మపై స్పందిస్తూ ఏవిధమైన ఇతర ఆలోచనలు మధ్యలో అడ్డుపడకుండా, ప్రతి వ్యక్తి ఖచ్చితముగా బ్రహ్మామే తన నిజమైన ఆత్మ అని తెలుసుకోవాలి. 

382. ప్రతి వ్యక్తి తన గుర్తింపును ఆత్మతో జోడించి, అహమును ఇతర భౌతిక వస్తువులను వదలి, వాటితో ఎట్టి సంబంధమును పెట్టుకోకుండా, (ఎందువలనంటే అవి చిక్కులతో కూడినవి, పగిలిన కుండ ముక్కల వంటివి.) అలా ఆత్మను దర్శించాలి. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 114 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 26. Self is Unchangeable - 1 🌻*

380. Here shines eternally the Atman, the Self-effulgent Witness of everything, which has the Buddhi for Its seat. Making this Atman which is distinct from the unreal, the goal, meditate on It as thy own Self, excluding all other thought.

381. Reflecting on this Atman continuously and without any foreign thought intervening, one must distinctly realise It to be one’s real Self.

382. Strengthening one’s identification with This, and giving up that with egoism and the rest, one must live without any concern for them, as if they were trifling things, like a cracked jar or the like.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 65 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. సప్త స్వరములు - సప్త వర్ణములు 🌻*

అక్షరములుచ్చరించు నపుడు ధ్యానమున రంగులు పుట్టును. ఆ రంగుల నుండియే నారాయణుని రూపము ‌దిగి వచ్చెను.  

యజ్ఞమున అక్షరములు ఉచ్చరించుట వలన రంగులు వ్యక్తమగుట సుప్రసిద్ధము.  

ఏడు స్వరములలో అక్షరములు ఉచ్చరించునపుడు ఏడు రంగులు పుట్టును. వానిని మూడు స్థాయిలలో ఉచ్చరించునపుడు ఇరువది యొక్క వెలుగులు పుట్టును. 

 కనుకనే వేదోచ్చారణమున వర్ణములు అను పదము పుట్టెను. వర్ణమనగా అక్షరము లేక రంగు.  

ఋక్కు అను పదమున‌ రెండర్థములును కలవు.

దీనిని బట్టియే దేవుని రూపము సువర్ణమయ విగ్రహమని అగమశాస్త్రము తెలుపును. తరువాతి కాలమున సువర్ణమనగా బంగారమని అర్థము వచ్చెను.  

అప్పటి నుండి దేవాలయములలో బంగారు విగ్రహములు ప్రతిష్ఠ చేయబడుటయు, దొంగల భయమేర్పడుటయు వచ్చి యజ్ఞశాలలు దేవాలయములుగా మారినవి.

✍🏼 *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 55 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 55. GOING ASTRAY 🍀*

*🕉 To know something, one has to lose it. 🕉*

Everybody goes astray from their inner world, the inner space, and then by and by one feels starved, hungry for it. An appetite arises, a thirst is felt. The call comes from the innermost self to come back home, and one starts traveling. That's what being a seeker is. It is going to the warm inner space that you left one day. You will not be gaining something new. 

You will be gaining something that was always there, but it will still be a gain because now for the first time, you will see what it is. The last time you were in that space, you were oblivious to it. One cannot be aware of something if one has not left it. So everything is good. Going astray is also good. To sin is also good, because that is the only way to become a saint.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 114 / Sri Lalita Sahasranamavali - Meaning - 114 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా |*
*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ‖ 114 ‖ 🍀*

🍀 559. తాంబూల పూరితముఖీ - 
తాంబూలము చేత నిండి పండిన నోరు కలది.

🍀 560. దాడిమీ కుసుమప్రభా - 
దానిమ్మపువ్వు ప్రభతో విరాజిల్లునది.

🍀 561. మృగాక్షీ - 
ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలుగల కళ్ళు కలది.

🍀 562. మోహినీ - 
మోహనమును కలుగజేయునది.

🍀 563. ముఖ్యా - 
ముఖ్యురాలు.

🍀 564. మృడానీ - 
మృడుని పత్ని.

🍀 565. మిత్రరూపిణీ - మిత్రుడని పిలువబడే సూర్యుని రూపముగా ఉంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 114 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 114. tāmbūla-pūrita-mukhī dāḍimī-kusuma-prabhā |*
*mṛgākṣī mohinī mukhyā mṛḍānī mitrarūpiṇī || 114 || 🌻*

🌻 560 ) Dhadimi kusuma prabha -   
She whose colour is like the pomegranate bud

🌻 561 ) Mrgakshi -   
She who has eyes like deer

🌻 562 ) Mohini -   
She who bewitches

🌻 563 ) Mukhya -   
She who is the chief

🌻 564 ) Mridani -   
She who gives pleasure

🌻 565 ) Mithra roopini -   
She who is of the form of Sun

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment