మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 65
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 65 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సప్త స్వరములు - సప్త వర్ణములు 🌻
అక్షరములుచ్చరించు నపుడు ధ్యానమున రంగులు పుట్టును. ఆ రంగుల నుండియే నారాయణుని రూపము దిగి వచ్చెను.
యజ్ఞమున అక్షరములు ఉచ్చరించుట వలన రంగులు వ్యక్తమగుట సుప్రసిద్ధము.
ఏడు స్వరములలో అక్షరములు ఉచ్చరించునపుడు ఏడు రంగులు పుట్టును. వానిని మూడు స్థాయిలలో ఉచ్చరించునపుడు ఇరువది యొక్క వెలుగులు పుట్టును.
కనుకనే వేదోచ్చారణమున వర్ణములు అను పదము పుట్టెను. వర్ణమనగా అక్షరము లేక రంగు.
ఋక్కు అను పదమున రెండర్థములును కలవు.
దీనిని బట్టియే దేవుని రూపము సువర్ణమయ విగ్రహమని అగమశాస్త్రము తెలుపును. తరువాతి కాలమున సువర్ణమనగా బంగారమని అర్థము వచ్చెను.
అప్పటి నుండి దేవాలయములలో బంగారు విగ్రహములు ప్రతిష్ఠ చేయబడుటయు, దొంగల భయమేర్పడుటయు వచ్చి యజ్ఞశాలలు దేవాలయములుగా మారినవి.
✍🏼 మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹 🌹
11 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment