శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 305 / Sri Lalitha Chaitanya Vijnanam - 305
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 305 / Sri Lalitha Chaitanya Vijnanam - 305🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀
🌻 305. 'రాజరాజార్చితా'🌻
రాజాధిరాజులచే నర్చింపబడునది శ్రీదేవి అని అర్థము. రాజులకు రాజు రాజరాజు. చక్రవర్తి. భూమియందు మానవుల నందరిని పరిపాలించువాడు మనువు. వైవస్వత మనువే నిజమైన రాజాధి రాజు. మానవులందరికి మూలమతడే. అట్లే దిక్కులన్నిటికి ఉత్తమ మైనటువంటిది ఉత్తర దిక్కు అట్టి ఉత్తర దిక్కును పరిపాలించు వాడు కుబేరుడు. అతడు దిక్కులకు రాజరాజు. దేవతల నందరిని పరిపాలించువాడు ఇంద్రుడు.
సమస్త దేవతా లోకములకును అతను రాజరాజు. భువనములనే శాసించి పరిపాలించు వాడు విష్ణుమూర్తి. అతడు భువనములకు రాజరాజు. ఇట్లు లోకములందలి పాలకుల నందరిని, పాలించు వారిచే అర్చింప బడునది శ్రీమాత. ఆవిడ ‘రాజరాజార్చిత. అందరి యందును తానే చేతన. చేతన తిరోధానము చెంది నపుడు ఎవ్వరైనను చేయగలిగినది ఏమియునూ లేదు. పాలక శక్తి శ్రీమాతయే యగుటచేత, ఆ శక్తి, తమయందు యుక్తియుక్తముగ నిర్వర్తింపబడుటకు పాలకు లందరూ శ్రీమాతను పూజింప వలసినదే. అర్చించి అనుగ్రహము పొందవలసినదే. మరియొక మార్గము లేదు.
పాలకులు పాలక యంత్రాంగమున నిమగ్నులై యుండగ వారు అప్రమత్తులగుటకు శ్రీమాతను అర్చించుటకు సలహా సంపత్తిని అందించవలసిన బాధ్యత రాజపురోహితుల కున్నది. పాలకులకు అహంకారము సోకుటకు అవకాశ మెక్కువ. అహంకారపడి తామే ప్రభువులు అనుకొనువారు పతనము చెందుదురు. తమ యందలి పాలక శక్తి శ్రీమాత శక్తియే. అది ఆమె వైష్ణవీ శక్తి. ఎంత చిన్న పాలకుడైననూ విష్ణ్వాంశ లేనిదే పాలించలేడు.
“నా విష్ణుః పృథివీ పతిః” అని నానుడి. అనగా విష్ణ్వాంశ లేనివాడు పతిగాని, దళపతిగాని, అధిపతిగాని కాలేడు. వివాహ సమయమున పెండ్లికుమారుని కూడ విష్ణు స్వరూపము గానే ఆవాహన చేయుట ఇందులకే. భార్యను పిల్లలను బంధుమిత్రులను పోషించుట, పరిపాలించుట అను ధర్మమును నిర్వర్తించుటకు విష్ణ్వాంశ యుండవలెను. ధన కనక వస్తు వాహనాది సౌకర్యములు ఏర్పడుటకు కూడ విష్ణ్వాంశ ప్రధానము. అట్టి విష్ణువును కూడ పరిపాలించు శ్రీమాత నర్చించుట సర్వశ్రేయస్కరము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 305 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀
🌻 305. Rājarājārcitā राजराजार्चिता (305) 🌻
She is worshipped by king of kings and emperors. This nāma is to be read with the next nāma. Rājarājā means king of kings, Śiva. Since She is the dear wife of Śiva, Śiva worships Her seems to be an appropriate interpretation. Women are worshipped for their mother hood and Śiva who is the universal teacher follows what He preaches.
There is another interpretation for this nāma. Rājarājā means Kubera, Manu and ten others making twelve Rājarājā-s. Please refer nāma 238 for further details. Each of them worships Her in their own way and accordingly their Pañcadaśī mantra also gets modified without changing the basics of the mantra (the fifteen bīja-s). All the twelve names find a place in this Sahasranāma. She is said to have been worshipped by these twelve Rājarāja-s. They are known as Rājarāja-s because of their sincere devotion to Her and She confers on them the status of king of kings.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
29 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment