నిర్మల ధ్యానాలు - ఓషో - 65



🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 65 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సాహసమన్నది పరిచిత సరిహద్దుల్ని దాటి వెళ్ళడంలో వుంది. అది ప్రమాదకరమైన పని, కానీ ఎంతగా నువ్వు ప్రమాదాల్ని ఎదుర్కొంటే అంతగా ఎదుగుతావు. కోట్ల మందికి ఆత్మ అన్నది అంగీకారం. కానీ ఒక యధార్థం కాదు. 🍀


జీవితం సహసవంతులదే. పిరికి వాళ్ళు మనసు ఎదగని వాళ్ళు. పిరికివాడు. నిర్ణయం తీసుకునే సమయానికి పూర్వకాలం కాస్త గడిచిపోతుంది. పిరికివాడు జీవించడం గురించి ఆలోచిస్తాడు. కానీ జీవించడు. ప్రేమించాలను కుంటాడు. కానీ ప్రేమించడు. ప్రపంచమంతా పిరికి వాళ్ళతో నిండి వుంది. పిరికివాడికి ప్రాథమికమైన భయముంది. అది అజ్ఞాత భయం. తెలియని భయం. తెలిసిన దాని గోడల మధ్య, పరిచితమయిన సరిహద్దుల మధ్య వుంటాడు.

సాహసమన్నది పరిచిత సరిహద్దుల్ని దాటి వెళ్ళడంలో వుంది. అది ఆటంకాలతో నిండింది. కష్టమయిన పని ప్రమాదకరమైన పని, కానీ ఎంతగా నువ్వు ప్రమాదాల్ని ఎదుర్కొంటే అంతగా ఎదుగుతావు. అజ్ఞాతమైన దాని సవాలులో అభివృద్ధి వుంది. ఆత్మ జననంలో అపూర్వమయిన ప్రమాదముంది. కాని పక్షంలో మనిషి కేవలం శరీరప్రాయంగా మిగిలిపోతాడు. కోట్ల మందికి ఆత్మ అన్నది అంగీకారం. కానీ ఒక యధార్థం కాదు. కానీ కొంతమంది, కొంతమంది సాహసవంతులు మాత్రమే. సంపూర్ణ ఆత్మ నిర్భరంతో వుంటారు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


29 Aug 2021

No comments:

Post a Comment